Tax on EPF: ఈపీఎఫ్ వడ్డీపై, విత్ డ్రాయల్స్ పై పన్ను ఎంత? ఎలా విధిస్తారు?
ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ దశలో పన్ను మినహాయింపు ఉంటుంది. కానీ, ఈపీఎఫ్ పై వచ్చే వడ్డీపై, అలాగే, ఒకవేళ ఈపీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేస్తే, ఆ డబ్బుపై, షరతులకు లోబడి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ వడ్డీ, ఈపీఎఫ్ విత్ డ్రా లపై పన్ను ఎంత ఉంటుంది? మినహాయింపు ఎంత ఉంటుంది?.. తదితర వివరాలను ఇక్కడ చూడండి.
Tax on EPF: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఉపసంహరణలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ఒకవేళ మీరు మీ ఈపీఎఫ్ ను విత్ డ్రా చేయాలనుకుంటే, ముందుగా దానిపై చెల్లించాల్సిన పన్నులను పరిశీలించి, తదనుగుణంగా నిర్ణయం తీసుకోండి.
ఈపీఎఫ్ అంటే ఏమిటి?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అనేది ఉద్యోగుల రిటైర్మెంట్ పొదుపు పథకం. ఈ స్కీమ్ లో ప్రతీ నెల ఉద్యోగి, యజమాని కొంత నిర్దిష్ట మొత్తంలో డబ్బును జమ చేస్తారు. దానిపై ప్రభుత్వం వడ్డీ ఇస్తుంది. ఈపీఎఫ్ కు కంట్రిబ్యూషన్ దశలో పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. కానీ, ఆ డబ్బును మొత్తంగా కానీ, దశల వారీగా కానీ ఉపసంహరించుకునే సమయంలో కొన్ని పన్ను చిక్కులు తలెత్తుతాయి. పన్ను ఎంత ఉంటుంది అనేది ఎంప్లాయ్ మెంట్ ఉద్దేశం, వ్యవధిపై ఆధారపడి ఉంటుంది.
ఈపీఎఫ్ వల్ల కలిగే పన్ను ప్రయోజనాలు ఏమిటి?
ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద ఉద్యోగి వైపు నుంచి కంట్రిబ్యూషన్ కు మినహాయింపు లభిస్తుంది. అయితే దీని గరిష్ట పరిమితి రూ.1.5 లక్షలుగా ఉంటుంది. యజమాని వైపు నుంచి ఉద్యోగి వేతనంలో 12 శాతం వరకు కంట్రిబ్యూషన్ కు పన్ను మినహాయింపు ఉంటుంది.
ప్రస్తుతం ఈపీఎఫ్ పై పన్ను ఎలా ఉంది?
ఫైనాన్స్ యాక్ట్ 2021లో చేసిన సవరణను అనుసరించి ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ మొత్తంపై వచ్చే వడ్డీ రూ .2.5 లక్షలకు మించి ఉంటే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్స్ ఉద్యోగి మాత్రమే చేస్తుంటే, యజమాని చేయకపోతే, ఆ వడ్డీ మొత్తం గరిష్ట పరిమితి రూ .2.5 లక్షల నుండి రూ .5 లక్షలకు పెరుగుతుంది. అలాగే, ఏడాదికి 9.5% కంటే ఎక్కువ కంట్రిబ్యూషన్ పై వచ్చే వడ్డీ కూడా పన్ను పరిధిలోకి వస్తుందని తెలిపారు. ఇక యజమాని కంట్రిబ్యూషన్ విషయానికి వస్తే రూ.7.5 లక్షలకు మించిన మొత్తంపై ఆదాయపు పన్ను రూల్స్ లోని సెక్షన్ 17(2) (ఐఏ), రూల్ 3బీ కింద పన్ను విధిస్తారు.
ఐదేళ్లు పూర్తి చేస్తే..
ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 10 (12) ప్రకారం ఉద్యోగి ఐదు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల నిరంతర సర్వీస్ ను పూర్తి చేసిన తరువాత, ఆ ఉద్యోగి ఈపీఎఫ్ నుండి ఏకమొత్తంలో డబ్బును అందుకున్నట్లయితే, దానిపై పన్ను మినహాయింపు లభిస్తుంది.
పన్ను మినహాయింపు లభించే ఇతర కారణాలు
ఈ క్రింది పరిస్థితులలో కూడా ఉద్యోగికి ఈపీఎఫ్ విత్ డ్రాయల్స్ పై పన్ను మినహాయింపు లభిస్తుంది.