టాటాకు చెందిన ఈ చౌకైన కారు.. ఇంటికి రావాలంటే 98 రోజులు వెయిట్ చేయాల్సిందే!-tata tiago car waiting period november 2024 nearly 14 weeks for delivery ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  టాటాకు చెందిన ఈ చౌకైన కారు.. ఇంటికి రావాలంటే 98 రోజులు వెయిట్ చేయాల్సిందే!

టాటాకు చెందిన ఈ చౌకైన కారు.. ఇంటికి రావాలంటే 98 రోజులు వెయిట్ చేయాల్సిందే!

Anand Sai HT Telugu
Nov 14, 2024 02:00 PM IST

Tata Car Waiting Period : మీరు ఈ నెలలో టాటా ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ టియాగోను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే దీని డెలివరీ కోసం మీరు 14 వారాలు వేచి ఉండాలి. అప్పుడే ఇంటికి వస్తుంది.

టాటా టియాగో వెయిటింగ్ పీరియడ్
టాటా టియాగో వెయిటింగ్ పీరియడ్

టాటా మోటార్స్ తన కార్లపై నవంబర్ కోసం అందుబాటులో ఉన్న వెయిటింగ్ పీరియడ్ల లిస్ట్ విడుదల చేసింది. ఈ నెలలో కంపెనీ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ టియాగోను కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తుంటే అసలు విషయం తెలుసుకోవాలి. దాని డెలివరీ కోసం 14 వారాలు అంటే 98 రోజులు వేచి ఉండాలి. నివేదిక ప్రకారం, టియాగోలో వేరియంట్‌ను బట్టి 8 నుండి 14 వారాల వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఈ వెయిటింగ్ మోడల్, కారు రంగుతో పాటు మీ నగరం, డీలర్‌పై ఆధారపడి ఉంటుంది. భారత మార్కెట్లో పెట్రోల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ వేరియంట్లలో కొనుగోలు చేయగల ఏకైక హ్యాచ్‌బ్యాక్ ఇది. దీని ప్రారంభ ధర రూ.4,99,900గా ఉంది.

టాటా టియాగో సీఎన్‌జీ ఎఎమ్‌టీ వేరియంట్లు ఈ విభాగంలో కొత్త బెంచ్ మార్క్‌ను సెట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఆటో-ఫోల్డింగ్ ఓఆర్ విఎమ్‌లు, ర్యాప్-ఎరౌండ్ టెయిల్ ల్యాంప్స్, టూ-టోన్ అల్లాయ్ వీల్స్ వంటి డిజైన్ ఉన్నాయి. లోపల ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్, 7-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. ఇది కంఫర్ట్, రిచ్ ఫీలింగ్‌తో మంచి అనుభవాన్ని ఇస్తుంది.

టియాగో సీఎన్జీ ఎఎమ్‌టీ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ పెట్రోల్ మోడ్‌లో 85 బిహెచ్‌పీ పవర్, 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీ మోడ్‌లో ఇది 72బీహెచ్‌పీ పవర్, 95ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టియాగో సీఎన్‌జీ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ హైవేపై కిలోకు 33 కిలోమీటర్లు, సిటీలో 17 కిలోమీటర్లు/కిలో మైలేజ్ ఇస్తుంది.

సేఫ్టీ కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, రియర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఏబీఎస్, ఈబీడీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. టాటా ట్విన్ సిలిండర్ టెక్నాలజీ బూట్ స్పేస్‌లో కూడా చాలా స్థలాన్ని అందిస్తుంది. టియాగో సీఎన్జీ తన సెగ్మెంట్లో హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ సీఎన్జీ, మారుతి సుజుకి సెలెరియో సీఎన్జీ, వాగన్ఆర్ సీఎన్జీ వంటి వాటికి గట్టి పోటీ ఇస్తుంది.

Whats_app_banner