పలు బెస్ట్​ సెల్లింగ్​ వాహనాల ధరలను పెంచిన టాటా మోటార్స్​- ఏ మోడల్​పై ఎంతంటే…-tata tiago and curvv become costlier by up to rupees 13000 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  పలు బెస్ట్​ సెల్లింగ్​ వాహనాల ధరలను పెంచిన టాటా మోటార్స్​- ఏ మోడల్​పై ఎంతంటే…

పలు బెస్ట్​ సెల్లింగ్​ వాహనాల ధరలను పెంచిన టాటా మోటార్స్​- ఏ మోడల్​పై ఎంతంటే…

Sharath Chitturi HT Telugu

టాటా టియాగో, టాటా కర్వ్​కు సంబంధించిన పలు వేరియంట్ల ధరలను టాటా మోటార్స్​ తాజాగా పెంచింది. ఏ వేరియంట్​ ధర ఎంత పెరిగింది? ఏ వేరియంట్ల ధరలు పెరగలేదు? పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

పలు బెస్ట్​ సెల్లింగ్​ వాహనాల ధరలను పెంచిన టాటా మోటార్స్

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన పోర్ట్​ఫోలియోలోని రెండు వాహనాల ధరలను తాజాగా పెంచింది. ఈప్రకటించిన ధరల సవరణతో, ఎంపిక చేసిన ప్యాసింజర్ వాహనాలైన టాటా కర్వ్, టాటా టియాగో, టాటా టియాగో ఎన్‌ఆర్‌జీ, టాటా టిగోర్ మోడళ్లు మరింత ప్రియం కానున్నాయి. ముఖ్యంగా, టాటా టియాగో, టాటా కర్వ్ మోడళ్లలోని కొన్ని వేరియంట్‌ల ధరలు పెరిగాయి. పూర్తి వివరాలు..

టాటా టియాగో ధర రూ.10,000 వరకు పెంపు..

టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్‌లోని కొన్ని వేరియంట్‌ల ధర రూ.10,000 వరకు పెరిగింది. టియాగో XM పెట్రోల్, XZ పెట్రోల్, XZ+ పెట్రోల్, XZA పెట్రోల్, XM iCNG, XZ iCNG, XZA iCNG ట్రిమ్స్‌పై రూ.10,000 పెంపు వర్తించనుంది. అదే సమయంలో, XT పెట్రోల్, XTA పెట్రోల్, XT iCNG, XTA iCNG వేరియంట్‌లపై ఒక్కొక్క దానికి రూ.5,000 పెరిగింది.

అయితే, బేస్ XE పెట్రోల్, XE iCNG ట్రిమ్స్‌పై మాత్రం ఎటువంటి ధరల పెంపు లేదు. వాటి పాత ధరలే కొనసాగుతాయి.

ప్రస్తుత ధరల ప్రకారం, టాటా టియాగో ఎక్స్-షోరూమ్ ధర రూ.5 లక్షల నుంచి రూ.8.55 లక్షల వరకు ఉంది.

టాటా కర్వ్ ధర రూ.13,000 వరకు పెంపు..

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా నుంచి వచ్చిన ప్రీమియం మోడళ్లలో టాటా కర్వ్ ఒకటి. టియాగో హ్యాచ్‌బ్యాక్‌తో పాటు ఈ కూపే ఎస్‌యూవీ ధర కూడా పెరిగింది. తాజా ధరల సవరణతో, టాటా కర్వ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.10 లక్షల నుంచి రూ.19.52 లక్షల వరకు ఉండనుంది.

కర్వ్ ఎంట్రీ-లెవల్ వేరియంట్‌లైన అకంప్లిష్డ్ ఎస్ జీడీఐ టర్బో-పెట్రోల్ ఎమ్‌టి డార్క్ ఎడిషన్, అకంప్లిష్డ్ ఎస్ జీడీఐ టర్బో-పెట్రోల్ డీసీఏ డార్క్ ఎడిషన్, అకంప్లిష్డ్+ ఏ జీడీఐ టర్బో-పెట్రోల్ ఎమ్‌టీ డార్క్ ఎడిషన్, అకంప్లిష్డ్+ ఏ జీడీఐ టర్బో-పెట్రోల్ డీసీఏ డార్క్ ఎడిషన్, స్మార్ట్ డీజిల్ ఎమ్‌టి, అకంప్లిష్డ్ ఎస్ డీజిల్ ఎమ్‌టి డార్క్ ఎడిషన్, అకంప్లిష్డ్ ఎస్ డీజిల్ డీసీఏ డార్క్ ఎడిషన్, అకంప్లిష్డ్+ ఎ డీజిల్ ఎమ్‌టి డార్క్ ఎడిషన్, అకంప్లిష్డ్+ ఏ డీజిల్ డీసీఏ డార్క్ ఎడిషన్‌పై ఎలాంటి ధరల పెంపు లేదు.

అయితే, క్రియేటివ్ ఎస్ జీడీఐ టర్బో-పెట్రోల్ ఎమ్‌టీ, అకంప్లిష్డ్+ ఏ జీడీఐ టర్బో-పెట్రోల్ డీసీఏ, క్రియేటివ్+ ఎస్ జీడీఐ టర్బో-పెట్రోల్ ఎమ్‌టి, క్రియేటివ్+ ఎస్ జీడీఐ టర్బో-పెట్రోల్ డీసీఏ, అకంప్లిష్డ్ ఎస్ జీడీఐ టర్బో-పెట్రోల్ ఎమ్‌టీ, అకంప్లిష్డ్+ ఏ జీడీఐ టర్బో-పెట్రోల్ ఎమ్‌టీ, అకంప్లిష్డ్+ ఏ జీడీఐ టర్బో-పెట్రోల్ డీసీఏ వెర్షన్‌ల ధర రూ.3,000 పెరిగింది. మిగిలిన అన్ని వెర్షన్‌లపై రూ.13,000 ధర పెంపు వర్తించనుంది.

మరిన్ని వివరాలు కోసం టాటా మోటార్స్​ అధికారిక వెబ్​సైట్​ లేదా మీ సమీప డీలర్​షిప్​ షోరూమ్​లను సందర్శించాల్సి ఉంటుంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం