Tata Technologies IPO : 140శాతం ప్రీమియంతో టాటా టెక్​ ఐపీఓ బంపర్​ లిస్టింగ్​!-tata technologies share price debuts 140 premium at 1 200 on nse ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Tata Technologies Share Price Debuts 140% Premium At 1,200 On Nse

Tata Technologies IPO : 140శాతం ప్రీమియంతో టాటా టెక్​ ఐపీఓ బంపర్​ లిస్టింగ్​!

Sharath Chitturi HT Telugu
Nov 30, 2023 10:08 AM IST

Tata Technologies IPO : టాటా టెక్నాలజీస్​ ఐపీఓకు బంపర్​ లిస్టింగ్​ లభించింది. 140శాతం ప్రీమియంతో రూ. 1200 వద్ద లిస్ట్​ అయ్యింది!

టాటా టెక్​ ఐపీఓకు బంపర్​ లిస్టింగ్​
టాటా టెక్​ ఐపీఓకు బంపర్​ లిస్టింగ్​

Tata Technologies IPO : ఇండియా స్టాక్​ మార్కెట్​లో టాటా టెక్నాలజీ ఐపీఓ దుమ్మురేపింది. ఈ ఐపీఓకు బంపర్​ లిస్టింగ్​ లభించింది. ఎన్​ఎస్​ఈలో 140శాతం ప్రీమియంతో రూ. 1,200 వద్ద లిస్ట్​ అయ్యింది. బీఎస్​ఈలో రూ. 1,199.55 వద్ద లిస్ట్​ అయ్యింది ఈ స్టాక్​. ఫలితంగా.. అలాట్​మెంట్​ లభించిన మదుపర్లు.. జాక్​పాట్​ కొట్టినట్టు అయ్యింది.

ట్రెండింగ్ వార్తలు

టాటా టెక్​ ఐపీఓ..

టాటా టెక్నాలజీస్​ ఐపీఓ సబ్​స్క్రిప్షన్​ 22న మొదలై.. 24తో ముగిసింది. ఓపీఓ కోసం రీటైలర్లు, షేర్​హోల్డర్లు, బడా ఇన్​వెస్టర్లు క్యూ కట్టారు. ఫలితంగా.. ఈ ఐపీఓ చాలా స్ట్రాంగ్​గా సబ్​స్క్రైబ్​ అయ్యింది. ఒక్క చివరి రోజే.. దీనికి 69.43 రెట్లు అధికంగా సబ్​స్క్రిప్షన్​ లభించింది.

Tata Technologies IPO listing price : ఈ ఐపీఓకు బంపర్​ లిస్టింగ్​ లభిస్తుందని.. గ్రే మార్కెట్​ ప్రీమియం చూస్తే అర్థమైపోయింది. గురువారం ఉదయం 6 గంటలకు.. ఐపీఓ జీఎంపీ రూ. 425గా ఉంది. అంటే.. రూ. 500 అప్పర్​ ప్రైజ్​ బ్యాండ్​ నుంచి రూ. 425 అధికంగా పెరిగి, స్టాక్​ మార్కెట్​లో లిస్ట్​ అవుతుందని జీఎంపీ సూచించింది. ఫలితంగా.. టాటా టెక్​ షేరు ప్రైజ్​ 4 డిజిటిన్​ని తాకుతుందని మార్కెట్​ వర్గాలు భావించాయి. కానీ ఇంకొందరు మాత్రం.. లిస్టింగ్​ ప్రైజ్​ రూ. 900కి అటు, ఇటుగా ఉంటుందని అంచనా వేశారు.

కాగా.. అప్పర్​ ప్రైజ్​ బ్యాండ్​ రూ. 500తో పోల్చుకుంటే.. టాటా టెక్నాలజీస్​ స్టాక్​.. ఎన్​ఎస్​ఈలో 700 పాయింట్లు అధికంగా లిస్ట్​ అయ్యినట్టు!

Tata Technologies IPO share price : టాటా టెక్​ ఐపీఓ ప్రైజ్​ బ్యాండ్​ షేరు రూ. 475- రూ. 500. ఫేస్​ వాల్యూ రూ. 2. ఐపీఓ సైజ్​ రూ. 3,042.51 కోట్లు.

WhatsApp channel

సంబంధిత కథనం