Tata Steel Share Price : టాటా స్టీల్ షేర్లు దారుణంగా పడిపోతున్నాయి.. ఈ పతనానికి కారణాలేంటి?
Tata Steel Share Price : టాటా గ్రూప్‌నకు చెందిన టాటా స్టీల్ షేర్లు నిరంతరం చర్చలో ఉంటున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ షేర్లలో భారీగా పతనం కనిపిస్తోంది. మంగళవారం కూడా ఈ షేర్ 3 శాతానికిపైగా పడిపోయి రూ. 130కి చేరింది.

టాటా గ్రూప్‌కు చెందిన టాటా స్టీల్ షేర్లు నిరంతరం వార్తల్లో నిలుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ షేర్లలో నిరంతరంగా పతనం కనిపిస్తూనే ఉంది. మంగళవారం కూడా ఈ షేర్ 3 శాతనికిపైగా పడిపోయింది. రూ.130.20కి చేరింది. గత ఐదు రోజుల్లో 3 శాతానికి పైగా, ఈ ఏడాది లెక్కన చూసుకుంటే.. 5 శాతం వరకు పతనం నమోదైంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1.62 లక్షల కోట్లకు పడిపోయింది. టాటా గ్రూప్ షేర్ ఈ ఏడాది జనవరి 13న తన 52-వారాల అత్యల్ప స్థాయి రూ.122.60 దగ్గర వ్యాపారం చేసింది.
స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో అందుబాటులో ఉన్న ట్రేడింగ్ డేటా ప్రకారం, మంగళవారం ఉదయం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే టాటా స్టీల్ కంపెనీ స్టాక్ రూ. 133.00 వద్ద ప్రారంభమైంది.
షేర్ల పతనం కారణాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే అమెరికాలో ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్‌ను విధిస్తానని చెప్పడం వల్ల మెటల్ కంపెనీ షేర్లలో భారీ పతనం కనిపిస్తోంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అమెరికా అధ్యక్షుడు ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై టారిఫ్‌ను విధించే హెచ్చరికను చెప్పడం వల్ల షేర్లు పడిపోయాయి. ఉక్కు, అల్యూమినియంపై 25 శాతం సుంకాలను విధించాలనే ట్రంప్ తాజా నిర్ణయం మెక్సికో, బ్రెజిల్, దక్షిణ కొరియా, వియత్నాం వంటి దేశాలపై మరింత ప్రభావం చూపుతుంది.
ఒక సంవత్సరంలో ఈ షేర్ 5.17 శాతం పడిపోయింది. సాంకేతిక పరంగా, టాటా స్టీల్ స్టాక్ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ (RSI) 51.3 వద్ద ఉంది. ఇది ఓవర్‌బాట్ లేదా ఓవర్‌సోల్డ్ జోన్‌లో వ్యాపారం చేయడం లేదని సూచిస్తుంది.
బ్రోకరేజ్ అభిప్రాయం
బ్రోకరేజ్ ఫర్మ్ మోతీలాల్ ఒస్వాల్ టాటా స్టీల్ షేర్‌పై తటస్థంగా ఉంది. టాటా స్టీల్‌పై మోతీలాల్ ఒస్వాల్ రూ.140 టార్గెట్ ధరను నిర్దేశించింది. అయితే, యాక్సిస్ సెక్యూరిటీస్ రూ.155 టార్గెట్‌తో టాటా స్టీల్ స్టాక్‌పై కొనుగోలు రేటింగ్ ఇచ్చింది. గ్లోబల్ బ్రోకరేజ్ కంపెనీ JP మోర్గాన్ రూ.155 టార్గెట్ ధరతో స్టాక్‌పై ఓవర్‌వెయిట్ స్టాండ్‌ను కొనసాగించింది. గ్లోబల్ బ్రోకరేజ్ మోర్గాన్ స్టాన్లీ రూ.160 టార్గెట్ ధరతో స్టాక్‌పై రేటింగ్‌ను కొనసాగించింది.
గమనిక : ఇది పెట్టుబడి సలహా కాదు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్నది. నిపుణులను సంప్రదించి వారి సలహా మేరకు ఇన్వెస్ట్ చేయండి.