ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా సియెర్రా ఈవీ భారతదేశంలో లాంచ్‌కు సన్నద్ధమవుతోంది. అయితే ఈ మోడల్ ప్రస్తుతం రోడ్ టెస్ట్ దశలో ఉంది. ఈ మోడల్ కామోఫ్లోజ్లో ఇటీవలే కనిపించింది. ఈ ప్రోటోటైప్‌తో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. ఆ వివరాలు..
టాటా సియెర్రా ఈవీ- ఐసీఈ వెర్షన్‌తో అందుబాటులోకి రానుంది. టాటా కర్వ్ ఈవీ, హారియర్ ఈవీల కంటే ముందు ఈ సియెర్రా ఈవీ మొదట భారతదేశంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ స్వదేశీ కార్ల తయారీ సంస్థ నుంచి ఫ్లాగ్షిప్ ఈవీ అవుతుంది.
టాటా సియెర్రా ఈవీ టెస్ట్ మ్యూల్ భారీగా కప్పబడి ఉన్నట్టు స్పై షాట్లు వెల్లడించాయి. ఫలితంగా డిజైన్ ఎలిమెంట్స్ చాలా వరకు దాగి ఉన్నాయి. అయితే, కొన్ని స్టైలింగ్ ఎలిమెంట్స్ కామోఫ్లేజ్డ్ ర్యాప్ ద్వారా కనిపించాయి. సియెర్రా ఈవీలో నిటారుగా ఉండే ఫ్రెంట్ ఫ్యాసియా, నిలువుగా అమర్చిన రెక్టాంగ్యులర్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఏడీఏఎస్ సెన్సార్‌తో వెడల్పాటి ఎయిర్ డ్యామ్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, రేర్ బంపర్ మౌంటెడ్ రిజిస్ట్రేషన్ ప్లేట్ హోల్డర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎల్ఈడీ టెయిల్ లైట్లు, షార్క్‌ఫిన్ యాంటెనా, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ వంటివి కూడా ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఉంటాయి. ఈ ఎలిమెంట్స్ 2025 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన కాన్సెప్ట్ మోడల్‌కు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఏయిరో డిజైన్‌తో రానున్న అల్లాయ్ వీల్స్ మరో కీలక మార్పు.
టాటా సియెర్రా ఎలక్ట్రిక్ ఎస్యూవీ విస్తృత శ్రేణి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి. అలాగే, ఈ స్టీరింగ్ వీల్ ఇతర సమకాలీన టాటా కార్ల మాదిరిగానే నిగనిగలాడే లుక్, టచ్-ఆధారిత కంట్రోల్స్ మధ్యలో ప్రకాశవంతమైన బ్రాండ్ లోగోతో అనుసరిస్తుంది. పనోరమిక్ సన్‌రూఫ్, ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రెంట్ సీట్లు, ఏడీఏఎస్ సూట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
పవర్ట్రెయిన్ విషయానికి వస్తే, టాటా సియెర్రా ఈవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 500 కిలోమీటర్ల రేంజ్‌ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
మరోవైపు, టాటా సియెర్రా ఐసీఈ వెర్షన్ 2.0-లీటర్ క్రియోటెక్, 1.5-లీటర్ టీజీడీఐ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్లను అందిస్తుంది. ట్రాన్స్మిషన్ ఆప్షన్స్‌లో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రెండూ ఉంటాయి.
ఈ టాటా సియెర్రా ఈవీ లాంచ్ డేట్‌ని సంస్థ ప్రకటించాల్సి ఉంది. లాంచ్ డేట్, రేంజతో పాటు ఇతర వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ వివరాలను మేము మీకు అప్డేట్ చేస్తాము.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్‌లో అందుబాటులో ఉంది. ఆటోమొబైల్ ప్రపంచం కోసం లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకునేందుకు వాట్సాప్‌లో హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఫాలో అవ్వండి.
సంబంధిత కథనం