Tata Nexon iCNG : సీఎన్జీ వెహికిల్స్‌లో ఈ కారు తోపు! ఇప్పుడు కొత్త ఎడిషన్‌తో మరింత స్టైలిష్‌గా..
టాటా నెక్సాన్ ఐసీఎన్జీ రెడ్ డార్క్ ఎడిషన్ లాంచ్ అయ్యింది. 3 వేరియంట్లలో ఈ ఎస్యూవీ అందుబాటులోకి వచ్చింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
టాటా నెక్సాన్ ఐసీఎన్జీ రెడ్ డార్క్ ఎడిషన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. రూ.12.70 లక్షల ప్రారంభ ధరతో ఈ ఎస్యూవీ లాంచ్ అయ్యింది. క్రియేటివ్, క్రియేటివ్ ప్లస్ పీఎస్, ఫియర్లెస్ ప్లస్ పీఎస్ అనే మూడు వేరియంట్లలో ఈ మోడల్ లభిస్తుంది. చివరి రెండు వేరియంట్ల ధరలు రూ.13.70 లక్షలు, రూ.14.70 లక్షలుగా ఉన్నాయి. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఎడిషన్ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా నెక్సాన్ ఐసీఎన్జీ రెడ్ డార్క్ ఎడిషన్..
టాటా సబ్ కాంపాక్ట్ సీఎన్జీ ఎస్‌యూవీతో పోల్చితే తాజాగా మార్కెట్లోకి వచ్చిన రెడ్ డార్క్ ఎడిషన్ క్రియేటివ్, క్రియేటివ్ + పిఎస్ వేరియంట్ల ధరలు సుమారు రూ .40,000, ఫియర్లెస్ + వేరియంట్ రూ .20,000 అధికం.
టాటా నెక్సాన్ ఐసీఎన్జీ రెడ్ డార్క్ ఎడిషన్ ఆల్ బ్లాక్ ఎక్స్టీరియర్ పెయింట్ షేడ్‌ని పొందుతుంది. ఇందులో అట్లాస్ బ్లాక్ బాడీ కలర్, ఫ్రంట్ గ్రిల్, అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అల్లాయ్ వీల్స్ డిజైన్ సాధారణ మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఎస్యూవీ రెడ్ థీమ్ ఇంటీరియర్‌ని పొందుతుంది. క్యాబిన్లో ఎరుపు, పియానో నలుపు యాక్సెంట్‌తో పాటు రెడ్ లెదర్లెట్ అప్హోలిస్టరీ ఉంటుంది.
టాటా నెక్సాన్ ఐసీఎన్జీ రెడ్ డార్క్ ఎడిషన్: ఫీచర్లు..
టాటా నెక్సాన్ లైనప్ ఇటీవల కొత్త వేరియంట్లు, ఫీచర్లతో అప్డేట్ అయ్యింది. ఇందులో క్రియేటివ్ ప్లస్ పీఎస్ వేరియంట్ ఒకటి కాగా, ఫియర్లెస్ ట్రిమ్ లెవల్ కొన్ని కొత్త ఫీచర్లను జోడించింది. రెగ్యులర్ మోడల్ ఆధారంగా ఐసీఎన్జీ డార్క్ ఎడిషన్‌లో కూడా ఇవే ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 10.2 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్లు, వాయిస్ అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. ఛార్జింగ్, ఆండ్రాయిడ్ ఆటో- యాపిల్ కార్ప్లే, 360-డిగ్రీ కెమెరాతో వైర్లెస్ సౌలభ్యం, జేబీఎల్ 8-స్పీకర్ సిస్టెమ్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం, ఎయిర్ ప్యూరిఫైయర్, హైట్ అడ్జెస్టెబుల్ ఫ్రెంట్ సీట్‌బెల్ట్స్ సహా మరెన్నో ఉన్నాయి.
టాటా నెక్సాన్ ఐసీఎన్జీ రెడ్ డార్క్ ఎడిషన్: స్పెసిఫికేషన్లు..
టాటా నెక్సాన్ ఐసీఎన్జీ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది పెట్రోల్ మోడ్‌లో 87 బీహెచ్పీ, సీఎన్జీ మోడ్‌లో 72 బీహెచ్పీ పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది పెట్రోల్ మోడ్‌లో 170 ఎన్ఎమ్ టార్క్, సీఎన్జీ మోడ్‌లో 140 ఎన్ఎమ్ టార్క్‌ని అందిస్తుంది. రెవోట్రాన్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కనెక్ట్ చేసి ఉంటుంది. మొత్తం మీద టాటా నెక్సాన్ ఐసీఎన్జీ ఎస్యూవీ 24 కి.మీ/కేజీ మైలేజ్ ఇస్తుంది.
సంబంధిత కథనం