Tata Nexon : బెస్ట్ సెల్లింగ్ టాటా నెక్సాన్ ఎస్‌యూవీపై భారీ డిస్కౌంట్.. కొనేందుకు ఇదే రైట్ టైమ్!
Discounts on Tata Nexon : టాటా నెక్సాన్‌పై రూ. 1 లక్ష వరకు బెనిఫిట్స్ ఇస్తోంది టాటా మోటార్స్ సంస్థ. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీల్లో ఒకటిగా ఉంది టాటా నెక్సాన్. ఈ కారుకు మంచి డిమాండ్ కనిపిస్తుంది. టాటా నెక్సాన్‌కి సంబంధించి ఇప్పటివరకు 7లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయని టాటా మోటార్స్ సంస్థ ప్రకటించింది. ఇక ఇప్పుడు ఈ మోడల్‌పై భారీ డిస్కౌంట్లను ఇస్తోంది సంస్థ. ఆ వివరాలను ఇక్కడ చూద్దాము..
టాటా నెక్సాన్ ఎస్యూవీ..
టాటా నెక్సాన్‌పై లక్ష రూపాయల వరకు బెనిఫిట్స్ అందించనున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. ఇందులో క్యాష్ బోనస్, డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ వంటివి కలిపి ఉండొచ్చు. ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే వర్తిస్తుందని కస్టమర్లు గుర్తుపెట్టుకోవాలి.
పూర్తి వివరాల కోసం మీరు మీ సమీపంలోని డీలర్షిప్ షోరూమ్‌ని సంప్రదిస్తే మంచిది. మోడల్ని చెక్ చేయడంతో పాటు డిస్కౌంట్లు, ఆఫర్స్‌పై ఓ క్లారిటీ వస్తుంది.
టాటా నెక్సన్ వేరియంట్లు- ధర..
టాటా మోటార్స్ నెక్సాన్ ఎస్‌యూవీని నాలుగు వేరియంట్లలో అందిస్తోంది. అవి స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, ఫియర్లెస్. క్రియేటివ్- ఫియర్లెస్ ట్రిమ్‌తో లభించే కాంపాక్ట్ ఎస్‌యూవీలో డార్క్ ఎడిషన్ కూడా ఉంది.
ఇక టాటా నెక్సాన్‌లో రెండు ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్. టర్బో పెట్రోల్ ఇంజిన్ 118బీహెచ్పీ పవర్, 170ఎన్ఎమ్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్, 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, కొత్త 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో వస్తుంది. డీజిల్ ఇంజిన్ 113బీహెచ్పీ పవర్, 260ఎన్ఎమ్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్, 6-స్పీడ్ ఏఎమ్‌టీ గేర్ బాక్స్‌ను పొందుతుంది.
ఇదీ చూడండి:- Best SUVs in India: హ్యాచ్‌బ్యాక్ నుంచి ఎస్‌యూవీకి అప్‌గ్రేడ్ అవ్వాలా? రూ. 7లక్షల బడ్జెట్లో ఇవి బెస్ట్!
డిస్కౌంట్లను మినహాయిస్తే టాటా నెక్సాన్ ధర రూ .8 లక్షల నుంచి ప్రారంభమై రూ .15.80 లక్షల వరకు ఉంటుంది. ఈ రెండు ధరలు ఎక్స్-షోరూమ్.
టాటా నెక్సాన్ సీఎన్జీ వచ్చేస్తోంది..!
భారత్ మొబిలిటీ షో 2024లో ఆవిష్కరించిన టాటా నెక్సాన్ ఐసీఎన్జీ రాబోయే 6 నుంచి 8 నెలల్లో భారత మార్కెట్లో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ.. సీఎన్జీ సెగ్మెంట్లో గేమ్ ఛేంజర్‌గా నిలవనుంది. ఇది భారతదేశంలో టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో కనెక్ట్ చేసిన తొలి సీఎన్జీ వెహికిల్‌గా నిలువవనుంది.
ఇండియాలో సీఎన్జీ వెహికిల్స్ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందుతోంది. మారుతీ సుజుకీ ఈ సెగ్మెంట్లో రారాజుగా కొనసాగుతోంది. మారుతీ సుజుకీకి పోటీగా పలు మోడల్స్‌ని లాంచ్ చేసేందుకు టాటా మోటార్స్ రెడీ అవుతోంది. ఇందులో టాటా నెక్సాన్ ఐసీఎన్జీ ఒకటి.
ఏదేమైనా, టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ, టాటా పంచ్ ఐసీఎన్జీ ఇప్పటికే ఉపయోగించిన 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ని ఈ టాటా నెక్సాన్ ఐసీఎన్జీలో కూడా వాడే అవకాశం లేకపోలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం