Tata Nexon CNG Vs Punch CNG : టాటాకు చెందిన ఈ రెండు సీఎన్‌జీలలో ఏది బెటర్?-tata nexon cng vs punch cng comparing which suv car better to choose details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Nexon Cng Vs Punch Cng : టాటాకు చెందిన ఈ రెండు సీఎన్‌జీలలో ఏది బెటర్?

Tata Nexon CNG Vs Punch CNG : టాటాకు చెందిన ఈ రెండు సీఎన్‌జీలలో ఏది బెటర్?

Anand Sai HT Telugu
Oct 21, 2024 02:10 PM IST

Tata Nexon CNG Vs Punch CNG : భారత ఆటోమెుబైల్ మార్కెట్‌లో టాటా కంపెనీది ప్రత్యేకమైన స్థానం. ఈ కంపెనీ కార్లు అమ్మకాల్లో ముందుంటాయి. సీఎన్‌జీ కార్ల అమ్మకాల్లోనూ టాటా దూసుకెళ్తోంది. టాటాకు చెందిన నెక్సాన్ సీఎన్‌జీ, పంచ్ సీఎన్‌జీలలో ఏది బెస్ట్ అని చూద్దాం..

టాటా నెక్సాన్ సీఎన్‌జీ వర్సెస్ పంచ్ సీఎన్‌జీ
టాటా నెక్సాన్ సీఎన్‌జీ వర్సెస్ పంచ్ సీఎన్‌జీ

టాటా మోటార్స్ ఇటీవలే దాని బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్ సీఎన్‌జీ మోడల్‌ను విడుదల చేసింది. టాటా పంచ్ సీఎన్‌జీ కూడా కంపెనీ అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటి. రెండు కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఏది బెటర్ అని మీరు ఆలోచిస్తుంటే.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

టాటా నెక్సాన్ సీఎన్జీ ఎనిమిది వేరియంట్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. వాటి ప్రారంభ ధర రూ. 8.99 లక్షల నుండి రూ. 14.59 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. టాటా పంచ్‌లో 5 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ. 7.23 లక్షల నుండి రూ. 9.90 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

నెక్సాన్ సీఎన్జీ 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్‌ను పొందుతుంది. ఇది 99 బీహెచ్పీ, 170 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఇందులో సీఎన్జీ ట్యాంక్ ట్విన్-సిలిండర్ టెక్నాలజీని ఉపయోగించారు, ఇది 321-లీటర్ల భారీ బూట్ స్పేస్‌ను ఇస్తుంది. 60 లీటర్ సీఎన్జీ ట్యాంక్ కలిగి ఉంది. దీని మైలేజ్ కేజీకి 24 కిలో మీటర్లుగా ఉందని కంపెనీ చెప్పింది.

టాటా పంచ్ 72.49 బీహెచ్పీ, 103 ఎన్ఎమ్ టార్క్‌ను ఇచ్చే సీఎన్జీ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఉంటుంది. టాటా పంచ్ సీఎన్జీ కూడా నెక్సాన్ సీఎన్జీ వంటి ట్విన్-సిలిండర్ టెక్నాలజీతో వస్తుంది. ఇందులో 210-లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఈ మోడల్ సుమారుగా కేజీకి 26.99 మైలేజీని ఇస్తుందని కంపెనీ పెర్కోంది.

నెక్సాన్ సీఎన్జీ 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, నావిగేషన్‌తో కూడిన 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వాయిస్ కమాండ్‌లతో కూడిన పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, టచ్-బేస్డ్ క్లైమేట్ ఆధారిత 360-డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో ఉంటుంది.

టాటా పంచ్ సీఎన్జీ 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఎల్ఈడీ టెయిల్ లైట్, యూఎస్బీ టైప్-సి ఫాస్ట్ ఛార్జర్, వాయిస్ కమాండ్‌తో కూడిన సన్‌రూఫ్, ఫాగ్ ల్యాంప్స్, స్టాండర్డ్ డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, వైపర్‌లను కలిగి ఉంది. వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, రియర్‌వ్యూ కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ రెండు కార్ల ధర, ఫీచర్లు చూసి ఏది కొనాలో డిసైడ్ చేసుకోండి.

Whats_app_banner