Nexon CNG Car : ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌తో మైలేజ్ కింగ్ టాటా నెక్సాన్ సీఎన్‌జీ.. ధర ఎంత?-tata nexon cng car get automatic gearbox know this mileage king vehicle expected price and other details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nexon Cng Car : ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌తో మైలేజ్ కింగ్ టాటా నెక్సాన్ సీఎన్‌జీ.. ధర ఎంత?

Nexon CNG Car : ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌తో మైలేజ్ కింగ్ టాటా నెక్సాన్ సీఎన్‌జీ.. ధర ఎంత?

Anand Sai HT Telugu
Aug 26, 2024 06:30 AM IST

TATA Nexon CNG Car Price : సీఎన్‌జీ కారు కొనాలి అని చూసేవారికోసం శుభవార్త. త్వరలో టాటా నెక్సాన్ సీఎన్‌జీ భారతీయ మార్కెట్లోకి వస్తుంది. ఈ కారుకు ఆటోమేటింగ్ గేర్ బాక్స్‌ కూడా రానుంది. మైలేజీ కూడా సీఎన్‌జీలలో టాప్ ఉండేలా వస్తుందని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటో చూద్దాం..

నెక్సాన్ సీఎన్‌జీ
నెక్సాన్ సీఎన్‌జీ

టాటా మోటార్స్ భారతదేశంలో ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారుగా గుర్తింపు పొందింది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడిన టియాగో, టిగోర్ సీఎన్‌జీ కార్లు కొన్ని నెలల క్రితం దేశీయ మార్కెట్లోకి విడుదలయ్యాయి. అయితే ప్రస్తుతం CNG పవర్డ్ నెక్సాన్ కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది కాంపాక్ట్ ఎస్‌యూవీ, ఇది సెప్టెంబర్ నెలలో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

yearly horoscope entry point

కొత్త టాటా నెక్సాన్ సీఎన్‌జీ ఎస్‌యూవీలో 5 స్పీడ్ మ్యాన్యువల్/5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఉంటుందని తెలిసింది. ఇది 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ 3-సిలిండర్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది గరిష్టంగా 100 PS శక్తిని, 150 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని అంటున్నారు.

సరికొత్త టాటా నెక్సాన్ సీఎన్‌జీ ఎస్‌యూవీ గరిష్ట ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 26.99 km/kg మైలేజీని అందజేస్తుందని అంచనా. ఈ కారు ధర రూ.9.25 లక్షలుగా ఉండే అవకాశం ఉంది. ఇది అధునాతన డిజైన్, ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇంధనంతో నడిచే (పెట్రోల్/డీజిల్) దాదాపు నెక్సాన్ కారుతో పోల్చవచ్చు. ట్విన్‌లో 60-లీటర్ సీఎన్‌జీ ట్యాంక్ ఉండనుంది. ఎక్కువ లగేజీని తీసుకెళ్లడానికి 230 కెపాసిటీ గల బూట్ స్పేస్‌ను కలిగి ఉన్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం దేశీయంగా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న ఇంధనంతో నడిచే నెక్సాన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.8 లక్షల నుండి రూ.15.80 లక్షల మధ్య ఉంది. ఇందులో 1.2-లీటర్ టర్బో పెట్రోల్, రియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి. ఇది వేరియంట్‌లను బట్టి 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, 7-స్పీడ్ DCT (డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్) గేర్‌బాక్స్ కలిగి ఉంది.

ఈ Nexon కారు 17.01 నుండి 24.08 kmpl మైలేజీని ఇస్తుంది. ఇందులో 5 మంది సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో సహా వివిధ ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

టాటా నెక్సాన్ ఈవీ కూడా కొనుగోలుకు అందుబాటులో ఉంది. దీని ధర రూ. 14.49 లక్షల నుండి రూ. 19.49 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా నడుస్తోంది. 30 నుండి 40.5 KWh బ్యాటరీ ప్యాక్ ఎంపిక అందుబాటులో ఉంది. 325 నుండి 465 మైలేజ్ ఇస్తుంది. 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఫీచర్లతో నిండి ఉంది.

Whats_app_banner