Tata Altroz CNG launch : లాంచ్​కు సిద్ధంగా టాటా ఆల్ట్రోజ్​ సీఎన్​జీ.. హైలైట్స్​ ఇవే!-tata motors to launch altroz cng tomorrow check features and full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Tata Motors To Launch Altroz Cng Tomorrow Check Features And Full Details Here

Tata Altroz CNG launch : లాంచ్​కు సిద్ధంగా టాటా ఆల్ట్రోజ్​ సీఎన్​జీ.. హైలైట్స్​ ఇవే!

Sharath Chitturi HT Telugu
Apr 18, 2023 10:30 AM IST

Tata Altroz CNG launch date : టాటా ఆల్ట్రోజ్​కు సీఎన్​జీ వర్షెన్​.. బుధవారం లాంచ్​కానుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాము..

టాటా ఆల్ట్రోజ్​ సీఎన్​జీ లాంచ్​ రేపే..
టాటా ఆల్ట్రోజ్​ సీఎన్​జీ లాంచ్​ రేపే.. (RushLane)

Tata Altroz CNG launch date : టాటా ఆల్ట్రోజ్​ ఐసీఎన్​జీ మోడల్​ను బుధవారం లాంచ్​ చేయనున్నట్టు ప్రకటించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​. ఈ మోడల్​ను 2023 జనవరిలో జరిగిన ఆటో ఎక్స్​పోలోనే ప్రదర్శించింది. ఇక టాటా టియాగో ఐసీఎన్​జీ, టాటా టిగోర్​ ఐసీఎన్​జీ తర్వాత సంస్థ నుంచి వస్తున్న మూడో సీఎన్​జీ మోడల్​ ఇదే కావడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

టాటా ఆల్ట్రోజ్​ సీఎన్​జీ.. విశేషాలు..

Tata Altroz CNG launch date and price : ప్రస్తుతం ఉన్న టాటా ఆల్ట్రోజ్​కు బుధవారం లాంచ్​కానున్న ఆల్ట్రోజ్​ సీఎన్​జీ వేరియంట్​కు డిజైన్​, లుక్స్​ పరంగా పెద్దగా తేడా లేదు! ఐసీఎన్​జీ బ్యాడ్జింగ్​ కొత్తగా ఉంటుంది.

అయితే.. టాటా ఆల్ట్రోజ్​ సీఎన్​జీకీ, సంస్థ నుంచి వచ్చిన ఇతర సీఎన్​జీ మోడల్స్​కు మధ్య ఓ పెద్ద డిఫరెన్స్​ ఉంది. అదే సీఎన్​జీ కిట్​ పొజిషన్​. ఆల్ట్రోజ్​ సీఎన్​జీలో బూట్​ స్పేస్​ ఎక్కువగా ఇచ్చింది సంస్థ. ఇందుకోసం స్పేర్​ వీల్​ను తొలగించి, దాని స్థానంలో రెండు చిన్న సీఎన్​జీ ట్యాంక్​లను ఏర్పాటు చేసింది.

ఇదీ చదవండి :- Most affordable CNG cars : దేశంలో అత్యంత చౌకైన సీఎన్​జీ కార్లు ఇవే..

Tata Altroz CNG launch :ఈ ఆల్ట్రోజ్​ ఐసీఎన్​జీలో సరికొత్త ట్విన్​- సిలిండర్​ సీఎన్​జ టెక్నాలజీ ఉండనుంది. కాగా.. త్వరలోనే టాటా పంచ్​కి కూడా సీఎన్​జీ వర్షెన్​ రాబోతోందని తెలుస్తోంది. ఇందులోనూ ఇదే టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్టు సమచారం.

టాటా ఆల్ట్రోజ్​ సీఎన్​జీలో 1.2 లీటర్​ నేచురల్సీ ఆస్పిరేటెడ్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉండనుంది. టియాగో, టిగోర్​ సీఎన్​జీ వర్షెన్​లలోనూ ఇదే ఇంజిన్​ ఉంది. ఇది 73 బీహెచ్​పీ పవర్​ను, 95ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

Tata Altroz CNG price : టాటా ఆల్ట్రోజ్​ సీఎన్​జీ ధర.. స్టాండర్డ్​ వేరియంట్​ కన్నా రూ. 75వేలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. లాంచ్​ తర్వాత ఈ మోడల్​.. బలెనో ఎస్​సీఎన్​జీ, గ్లాంజా సీఎన్​జీలకు గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ డార్క్ ఎడిషన్..

Tata Nexon EV Max Dark Edition : నెక్సాన్ ఈవీ మ్యాక్స్ లైనప్‍తో డార్క్ ఎడిషన్‍ను టాటా మోటార్స్ లాంచ్ చేసింది. ఎక్స్‌జెడ్+ ఎల్‍యూఎక్స్ ట్రిమ్‍లో రెండు వేరియంట్లలో ఈ డార్క్ ఎడిషన్ కారు విడుదలైంది. ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ థీమ్ మార్పులతో ఈ టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ డార్క్ ఎడిషన్ లాంచ్ అయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం