Tata Motors Car sales : మళ్లీ పడిపోయిన టాటా మోటార్స్ సేల్స్- స్టాక్ పరిస్థితేంటి?
Tata Motors : టాటా మోటార్స్ సేల్స్ మళ్లీ పడ్డాయి! జనవరి సేల్స్ డేటాలో వీక్నెస్ మరింత స్పష్టంగా కనిపించింది. ఇది, టాటా మోటార్స్ స్టాక్‌ని భారీగా ప్రభావితం చేస్తోంది.
దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్‌కి గత కొంతకాలంగా గడ్డుకాలం నడుస్తోంది! సంస్థ సేల్స్ కొన్ని నెలలుగా తగ్గుతూనే ఉన్నాయి. తాజాగా, జనవరి 2025లోనూ టాటా మోటార్స్ వాహన అమ్మకాలు పడిపోయాయి. ఇది టాటా మోటార్స్ స్టాక్‌పైనా భారీ ప్రభావాన్నే చూపిస్తోంది. మరి ఇప్పుడు స్టాక్ పరిస్థితేంటి?

మళ్లీ పడిన టాటా మోటార్స్ సేల్స్..
టాటా మోటార్స్ 2025 జనవరిలో మొత్తం 80,304 యూనిట్లను విక్రయించింది. జనవరి 2024లో ఇది 86,125 యూనిట్లుగా ఉండేది. గత నెలలో మొత్తం దేశీయ అమ్మకాలు 78,159 యూనిట్లకు పడిపోయాయని టాటా మోటార్స్ ఫిబ్రవరి 1, 2025 న విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో విక్రయించిన 84,276 దేశీయ యూనిట్లతో పోలిస్తే ఇది 7 శాతం తక్కువ!
టాటా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు.. 2024 జనవరిలో 54,033 యూనిట్ల నుంచి 11 శాతం తగ్గి, 2025 జనవరిలో 48,316 యూనిట్లకు చేరుకున్నాయి. గత నెలలో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్‌లో 25 శాతం క్షీణత నమోదైంది. గత సంవత్సరం ఇదే సమయంలో విక్రయించిన 6,979 యూనిట్ల నుంచి 5,240 యూనిట్లకు పడిపోయింది!
సేల్స్‌లో క్షీణత టాటా మోటార్ వాణిజ్య వాహనాల విభాగంలో కూడా ప్రతిబింబిస్తుంది. గత నెలలో విక్రయించిన మొత్తం సీవీలు 31,988 యూనిట్లు కాగా.. 2024 జనవరిలో అది 32,092 యూనిట్లుగా ఉండేది.
టాటా మోటార్స్ స్టాక్ పరిస్థితేంటి?
సేల్స్‌లో క్షీణత టాటా మోటార్స్ స్టాక్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. రూ. 1,179.00 ఆల్ టైమ్ హై నుంచి టాటా మోటార్స్ షేర్లు భారీగా పతనమయ్యాయి. శనివారం ట్రేడింగ్ సెషన్లో ఈ సంస్థ షేరు ధర రూ. 706 వద్ద ముగిసింది. కానీ, 5 రోజుల్లో టాటా మోటార్స్ స్టాక్ 2.5శాతం, నెల రోజుల్లో 7.7శాతం, ఆరు నెలల్లో ఏకంగా 36శాతం మేర పనతమైంది.
గత బుధవారం ట్రేడింగ్ సెషన్లో రూ. 683.20 వద్ద 52 వీక్ లో- ని టచ్ చేసిన టాటా మోటార్స్ స్టాక్, అక్కడి నుంచి కాస్త పుంజుకుంది.
కంపెనీ షేర్లు పతనమవ్వడం ఇన్వెస్టర్లను భయపెడుతోంది. కంపెనీ సేల్స్‌కి తగ్గట్టుగానే అనేక బ్రోకరేజ్ సంస్థలు టాటా మోటార్స్ షేర్ ప్రైజ్ టార్గెట్‌ని డౌన్‌గ్రేడ్ చేశాయి. రూ. 660 నుంచి రూ. 755 మధ్యలో టార్గెట్‌ని ఇస్తున్నాయి.
అయితే, కంపెనీలో కష్టకాలం, స్టాక్‌లో ఇప్పటికే రిఫ్లెక్ట్ అయ్యిందని నిపుణులు గుర్తుచేస్తున్నారు. భవిష్యత్తులో కంపెనీ నుంచి ఏదైనా సానుకూల వార్త వస్తే, టాటా మోటార్స్ స్టాక్ పెరిగే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
(గమనిక:- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హెచ్‌టీ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం