టాటా మోటార్స్​ షాకింగ్​ నిర్ణయం! బెస్ట్​ సెల్లింగ్​ కారుకు ఈవీ వర్షెన్​ లాంచ్​ నిలిపివేత..-tata motors pauses altroz ev plans heres why ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  టాటా మోటార్స్​ షాకింగ్​ నిర్ణయం! బెస్ట్​ సెల్లింగ్​ కారుకు ఈవీ వర్షెన్​ లాంచ్​ నిలిపివేత..

టాటా మోటార్స్​ షాకింగ్​ నిర్ణయం! బెస్ట్​ సెల్లింగ్​ కారుకు ఈవీ వర్షెన్​ లాంచ్​ నిలిపివేత..

Sharath Chitturi HT Telugu

టాటా ఆల్ట్రోజ్​ ఈవీ వర్షెన్​పై సంస్థ పనిచేస్తున్నట్టు చాలా కాలంగా వార్తలు వినిపించాయి. ప్రాడక్ట్​ మోడల్​ని కూడా సంస్థ ప్రదర్శించింది. కానీ ఇప్పుడు టాటా ఆల్ట్రోజ్​ ఎలక్ట్రిక్​ కారుపై సంస్థ షాకింగ్​ ప్రకటన చేసింది.

టాటా కొత్త ఈవీ లాంచ్​ నిలిపివేత!

అప్డేటెడ్ ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్​బ్యాక్​ని ఇటీవలే భారత మార్కెట్​లో రూ .6.98 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు విడుదల చేసింది టాటా మోటార్స్​. ఈ ప్రీమియం హ్యాచ్​బ్యాక్​ ఇప్పుడు పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ఇంధన ఆప్షన్స్​తో లభిస్తుంది. ఇప్పుడు అందరి ఫోకస్​ ఈ టాటా ఆల్ట్రోజ్​ ఈవీపై పడింది! ఈ మోడల్​ లాంచ్​కి రెడీ అవుతోందని గతంలో ఊహాగానాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ ఊహాగానాలకు సంస్థ స్వయంగా బ్రేక్​లు వేసింది. టాటా ఆల్ట్రోజ్​ ఎలక్ట్రిక్​ కారును ఇప్పట్లో లాంచ్​ చేయడం లేదని ధ్రువీకరించింది.

టాటా ఆల్ట్రోజ్​కి ఈవీ టచ్​..

వాస్తవానికి, టాటా ఆల్ట్రోజ్ భారత మార్కెట్లో డీజిల్ ఇంజిన్​తో వచ్చే ఏకైక ప్రీమియం హ్యాచ్​బ్యాక్​! ట్రాన్స్​మిషన్​ ఎంపికలలో మాన్యువల్, ఆటోమేటిక్, ఏఎంటీ యూనిట్లు కూడా ఉన్నాయి. ఇండియాలో ఇది బెస్ట్​ సెల్లింగ్​ హ్యాచ్​బ్యాక్​ కూడా! అందుకే ఈ మోడల్​కి చెందిన ఈవీ వర్షెన్​పై సర్వత్రా ఆసక్తి కనిపించింది.s

మారుతీ సుజుకీ బాలెనో, హ్యుందాయ్ ఐ20, టయోటా గ్లాంజా వంటి మోడల్స్​కి పోటీగా ఉన్న ఆల్ట్రోజ్​.. ఫుల్లీ ఎలక్ట్రిక్ వర్షెన్​ను పొందాల్సి ఉంది. ప్రస్తుతం టియాగో ఈవీ, టిగోర్ ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ వంటి మోడళ్లతో భారత ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన మార్కె్ట్​లో సింహభాగాన్ని కలిగి ఉన్న టాటా మోటార్స్.. ఆల్ట్రోజ్ ఈవీపై పనిచేస్తోందని ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆల్ట్రోజ్ ఈవీని లాంచ్ చేసే ప్రణాళికను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు దేశీయ కార్ల తయారీ సంస్థ వెల్లడించింది.

టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ లిమిటెడ్- టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. ఆల్ట్రోజ్ ఎలక్ట్రిక్ వర్షెన్​ని ప్రవేశపెట్టే ప్రణాళికలను కంపెనీ నిలిపివేసిందని చెప్పారు.

టాటా మోటార్స్ గతంలో ఆల్ట్రోజ్ ఈవీని ప్రాడక్ట్​ రూపంలో ప్రదర్శించింది. ఇది రూ.5-8 లక్షల ధర శ్రేణిలో ఉండాల్సి ఉంది. అయితే, ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలో మారుతున్న డైనమిక్స్ కారణంగా, బ్యాటరీ ధరలు తగ్గడంతో ఈ ప్రాజెక్టును నిలిపివేసినట్లు చంద్ర తెలిపారు. రూ.8-15 లక్షల సెగ్మెంట్​కి సపోర్ట్ చేసే టియాగో.ఈవీ, పంచ్.ఈవీ, నెక్సాన్.ఈవీ అనే మూడు ఉత్పత్తులు తమ వద్ద ఉన్నప్పుడు, ఇదే సెగ్మెంట్​లో ఆల్ట్రోజ్.ఈవీని నాలుగో కారుగా తీసుకొచ్చేందుకు తమ వద్ద కారణాలు కనిపించలేదని శైలేష్​ చంద్ర అన్నారు.

ఆల్ట్రోజ్ ఈవీ ప్రాజెక్ట్ ఇప్పటికే ఒక నిర్దిష్ట దశకు చేరుకుందని, అయితే ఒక దశలో, రూ .8-15 లక్షల సెగ్మెంట్​లో నాల్గొవ ఆప్షన్ తీసుకురావాల్సిన అవసరం లేదని భావించినందున టాటా మోటార్స్​ దానిని నిలిపివేసినట్లు చంద్ర చెప్పారు. అయితే, టాటా మోటార్స్ ఈ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయలేదని, ఆల్ట్రోజ్ ఈవీని ఎప్పటికీ తీసుకుండా ఉండటం తమ ఉద్దేశం కాదని ఆయన అన్నారు. భవిష్యత్తులో టాటా మోటార్స్ ఈవీని తగిన మార్కెట్ వాతావరణానికి తీసుకురావచ్చని ఆయన పేర్కొన్నారు.

“భవిష్యత్తులో ఈ కారును మళ్లీ తీసుకురావాల్సిన అవసరం ఉందని భావిస్తే ఆ ఆప్షన్​కు సిద్ధంగా ఉన్నాము. అయితే ప్రస్తుతానికి దీన్ని లాంచ్ చేయడం లేదు,” అని ఆయన అన్నారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం