టాటా మోటార్స్ ఇటీవల తన హారియర్ ఈవీ రియర్-వీల్ డ్రైవ్ (ఆర్డబ్ల్యూడీ) వేరియంట్ల ధరలను ప్రకటించింది. వీటి ధరలు రూ. 21.49 లక్షల నుంచి రూ. 27.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఇప్పుడు, ఆటోమేకర్ హారియర్ ఈవీకి చెందిన మరిన్ని వివరాలను వెల్లడించింది. మరీ ముఖ్యంగా వేరియంట్ల వారీగా ఈ ఎలక్ట్రిక్ కారు అందించే రేంజ్ గురించి స్పష్టం చేసింది. టాటా హారియర్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ప్రతి వేరియంట్ అందించే రేంజ్‌ను ఇప్పుడు తెలుసుకోండి..
టాటా హారియర్ ఈవీలో రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. సింగిల్ మోటార్‌తో కూడిన రియర్-వీల్ డ్రైవ్ (ఆర్డబ్ల్యూడీ) వెర్షన్‌ల కోసం 65 కేడబ్ల్యూహెచ్, 75 కేడబ్లూహెచ్ ఆప్షన్స్ ఉన్నాయి. 75 కేడబ్ల్యూహెచ్ యూనిట్ డ్యూయెల్ మోటార్ సెటప్‌తో కూడిన క్వాడ్-వీల్ డ్రైవ్ (క్యూడబ్ల్యూడీ) లో కూడా అందుబాటులో ఉంది.
హారియర్ ఈవీ 65 ఆర్డబ్ల్యూడీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 538 కి.మీ. రేంజ్ అందిస్తుంది.
హారియర్ ఈవీ 75 ఆర్డబ్ల్యూడీ అత్యధికంగా 627 కి.మీ. రేంజ్ అందిస్తుంది.
హారియర్ ఈవీ 75 ఆర్డబ్ల్యూడీ కొద్దిగా తక్కువగా 622 కి.మీ. రేంజ్ అందిస్తుందియ అయితే ఇది ఎక్కువ పవర్‌ని, టార్క్‌ని, ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ఈ రేంజ్ గణాంకాలన్నీ MIDC టెస్ట్ సైకిల్ ప్రకారం ధృవీకరించడం జరిగింది.
పైన పేర్కొన్న క్లెయిమ్డ్ రేంజ్ గణాంకాలు ఐడియల్ టెస్టింగ్ పరిస్థితుల్లో ధృవీకరించడం జరిగింది.. అందుకే టాటా ప్రతి వేరియంట్ రియల్-వరల్డ్ రేంజ్‌ను కూడా షేర్ చేసింది. ఈ గణాంకాలను కంపెనీ సీ75 ఫిగర్స్ అని పిలుస్తుంది. అంటే, 75 శాతం మంది వినియోగదారులు రోజువారీ డ్రైవింగ్ పరిస్థితుల్లో వాస్తవంగా పొందే రేంజ్ ఇది. C75 గణన ప్రకారం:
65 కేడబ్ల్యూహెచ్ ఆర్డబ్ల్యూడీ వేరియంట్ - 420-445 కి.మీ. రేంజ్.
75 కేడబ్ల్యూహెచ్ ఆర్డబ్ల్యూడీ వేరియంట్ - 480-505 కి.మీ. రేంజ్.
75 కేడబ్ల్యూహెచ్ క్యూడబ్ల్యూడీ వేరియంట్ - 460-490 కి.మీ. రేంజ్.
టాటా హారియర్ ఈవీ వేరియంట్లు | రేంజ్ (MIDC) | రియల్ వరల్డ్ రేంజ్ (C-75) |
---|---|---|
65kWh RWD | 538 km | 420-445 km |
75kWh RWD | 627 km | 480-505 km |
75kWh QWD | 622 km | 460-490 km |
టాటా హారియర్ ఈవీ బ్యాటరీ ప్యాక్‌పై జీవితకాల వారంటీ (రిజిస్ట్రేషన్ తేదీ నుంచి 15 సంవత్సరాలు)తో వస్తుంది. అంతేకాకుండా, ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని రెండోసారి కొనుగోలు చేసే వారికి 10 సంవత్సరాలు/200,000 కి.మీ.ల వారంటీ ప్యాకేజీ లభిస్తుంది.
హారియర్ ఈవీ క్యూడబ్ల్యూడీ వేరియంట్ల ధరలను టాటా ఇంకా ప్రకటించలేదు. వాటి గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.
ఈ ఎలక్ట్రిక్ కారు ఎక్స్-షోరూమ్ ధరలో ఛార్జర్, ఇన్‌స్టాలేషన్ ఖర్చు ఉండదని గమనించండి. కంపెనీ 7.3 కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్‌ను అందిస్తోంది. దీనితో 65 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను ఛార్జ్ చేయడానికి సుమారు 9.3 గంటలు పడుతుంది. 75 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను 10-100 శాతం ఛార్జ్ చేయడానికి సుమారు 10.7 గంటలు పడుతుంది.
టాటా హారియర్ ఈవీ బుకింగ్స్ జులై 2న మొదలవుతాయి.
హైదరాబాద్‌లో టాటా హారియర్ ఈవీ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం