టాటా మోటార్స్ సంస్థ మంచి జోరు మీదుంది! టాటా హారియర్ ఈవీని ఇటీవలే లాంచ్ చేసిన ఈ సంస్థ, ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కారులో కొత్త ఎడిషన్‌ని కూడా ప్రవేశపెట్టింది. దీని పేరు టాటా హారియర్ ఈవీ స్టెల్త ఎడిషన్. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 28.24 లక్షలు. టాటా హారియర్ ఈవీ స్టెల్త్ ఎడిషన్ కేవలం 75 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో మాత్రమే లభిస్తుంది. అయితే ఇది 4 విభిన్న వేరియంట్లలో వస్తుంది. ఈ ప్రత్యేక ఎడిషన్ ఎస్‌యూవీలో 'ఎంపవర్డ్ 75 స్టెల్త్', 'ఎంపవర్డ్ 75 స్టెల్త్ ఏసీఎఫ్‌సీ', ‘ఎంపవర్డ్ 75 క్యూడబ్ల్యూడీ స్టెల్త్’, 'ఎంపవర్డ్ 75 క్యూడబ్ల్యూడీ స్టెల్త్ ఏసీఎఫ్‌సీ' వేరియంట్‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
ఈ ప్రత్యేక 'స్టెల్త్ ఎడిషన్' ఎస్‌యూవీ అదనపు ఖర్చుతో అనేక ప్రత్యేక ఫీచర్లు, అదనపు హంగులతో వస్తుంది. వాటిలో ముఖ్యమైనవి:
ఎంచుకున్న వేరియంట్‌ను బట్టి పనితీరు, ఇతర ఫీచర్ల పరంగా ఎస్‌యూవీ అలాగే ఉంటుంది.
టాటా హారియర్ ఈవీ స్టెల్త్ ఎడిషన్ ధర 'ఎంపవర్డ్ 75 స్టీల్త్' ట్రిమ్ రూ. 28.24 లక్షలు (ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. 'ఎంపవర్డ్ 75 స్టెల్త్ ఏసీఎఫ్‌సీ'ని రూ. 49,000 అదనపు ప్రీమియంతో రూ. 28.73 లక్షలకు (ఎక్స్‌షోరూమ్) పొందవచ్చు. చివరిగా, 'ఎంపవర్డ్ 75 క్యూడబ్ల్యూడీ స్టెల్త్' రూ. 29.74 లక్షలు, 'ఎంపవర్డ్ 75 క్యూడబ్ల్యూడీ స్టెల్త్ ఏసీఎఫ్‌సీ' రూ. 30.23 లక్షలకు (రెండు ఎక్స్‌షోరూమ్ ధరలు) కొనుగోలు చేయవచ్చు.
టాటా హారియర్ ఈవీ కొత్త 'Acti.ev ప్లస్ ఆర్కిటెక్చర్'తో ప్రారంభమైంది, ఇది ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) సామర్థ్యాలతో సహా అనేక ఫీచర్లను అందిస్తుంది. దీంతో హారియర్ ఈవీ ఆల్-వీల్ డ్రైవ్ సామర్థ్యాలు కలిగిన టాటా మోటార్స్ పోర్ట్‌ఫోలియోలోని మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనంగా నిలిచింది.
మోటార్ విషయానికి వస్తే, టాటా హారియర్ ఈవీ స్టెల్త్ ఎడిషన్ 75 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ 75 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ఆర్డబ్ల్యూడీ (రియర్-వీల్ డ్రైవ్) క్యూడబ్ల్యూడీ (క్వాడ్-వీల్ డ్రైవ్) సహా రెండు డ్రైవ్‌ట్రెయిన్ కాన్ఫిగరేషన్ ఆప్షన్‌లను పొందుతుంది. ఆర్డబ్ల్యూడీ వేరియంట్లు 235 బీహెచ్‌పి పవర్‌ని, 315 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తాయి. అయితే క్యూడబ్ల్యూడీ వేరియంట్‌లు 391 బీహెచ్‌పి పవర్‌ని, 504 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తాయి. ఎంఐడీసీ పరీక్ష ప్రకారం, ఈ కాన్ఫిగరేషన్లు ఎస్‌యూవీకి ఒకే ఛార్జ్‌తో 627 కి.మీ (ఆర్డబ్ల్యూడీ), 622 కి.మీ (క్యూడబ్ల్యూడీ) రేంజ్‌ని అందిస్తాయి.
హారియర్ ఈవీకి కొత్త 14.5-ఇంచ్ శాంసంగ్ నియో క్యూఎల్‌ఈడీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అలాగే 10.25-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లభిస్తాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఉంటాయి. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను మ్యాప్‌లను ప్రొజెక్ట్ చేయడానికి ఉపయోగించవచ్చు, ఇది మరింత సౌలభ్యాన్ని అందిస్తుంది. క్యాబిన్ లోపల ఇతర ముఖ్యమైన మార్పులలో ఆరు విభిన్న టెర్రైన్ మోడ్‌లను ఎంచుకోవడానికి కొత్త రోటరీ డయల్ ఉంది. అవి: నార్మల్, సాండ్, మడ్ రట్స్, స్నో/గ్రాస్, రాక్ క్రాల్ మరియు కస్టమ్. డాష్‌బోర్డ్, సన్‌రూఫ్, డోర్లు, కన్సోల్‌లో మల్టీ-మూడ్ యాంబియంట్ లైటింగ్ కూడా ఈ ఇంటీరియర్‌లో ఉన్నాయి.
సంబంధిత కథనం