సింగిల్​ ఛార్జ్​తో 620 కి.మీ వరకు రేంజ్​- టాటా హారియర్​ ఈవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు ఇవే..-tata harrier ev on road price in hyderabad revealed see other details of this long range electric car ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  సింగిల్​ ఛార్జ్​తో 620 కి.మీ వరకు రేంజ్​- టాటా హారియర్​ ఈవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు ఇవే..

సింగిల్​ ఛార్జ్​తో 620 కి.మీ వరకు రేంజ్​- టాటా హారియర్​ ఈవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు ఇవే..

Sharath Chitturi HT Telugu

టాటా హారియర్​ ఈవీ ధరలను సంస్థ తాజాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లో టాటా హారియర్​ ఈవీ ఆన్​రోడ్​ ప్రైజ్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా హారియర్​ ఈవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

భారత ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో టాటా మోటార్స్​కి అత్యధిక వాటా ఉంది. నెక్సాన్​ ఈవీ, పంచ్​ ఈవీ, టియాగో ఈవీ, టిగోర్​ ఈవీ వంటి బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​కి మంచి డిమాండ్​ ఉంది. ఇక టాటా మోటార్స్​ నుంచి ఇటీవలే టాటా హారియర్​ ఈవీ మార్కెట్​లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు, ఈ ఎలక్ట్రిక్​ కారుకు సంబంధించిన ధరల వివరాలను సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఒకవేళ మీరు ఈ ఎలక్ట్రిక్​ కారు కొనాలని ప్లాన్​ చేస్తుంటే.. హైదరాబాద్​లో టాటా హారియర్​ ఈవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హైదరాబాద్​లో టాటా హారియర్​ ఈవీ ఆన్​రోడ్​ ప్రైజ్​..

  • టాటా హారియర్​ ఈవీ అడ్వెంచర్​ 65- రూ. 22.58 లక్షలు
  • అడ్వెంచర్​ ఎస్​ 65- రూ. 23.32 లక్షలు
  • ఫియర్​లెస్​ ప్లస్​ 65- రూ. 25.24 లక్షలు
  • ఫియర్​లెస్​ ప్లస్​ 75- రూ. 26.47 లక్షలు
  • ఎంపవర్డ్​ 75- రూ. 29.08 లక్షలు

అంటే హైదరాబాద్​లో టాటా హారియర్​ ఈవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ రూ. 22.58 లక్షల నుంచి రూ. 29.08 లక్షల వరకు ఉంటుంది. ఒకవేళ వీటిపై ఏమైనా ఆఫర్లు ఉంటే, ధరలు తగ్గొచ్చు.

సాధారణంగా వెహికల్​కి ఎక్స్​షోరూం ప్రైజ్​, ఆన్​రోడ్​ ప్రైజ్​లు వేరువేరుగా ఉంటాయి. వెహికిల్​ని లాంచ్​ చేసే సమయంలో ఆటోమొబైల్​ సంస్థలు ఎక్స్​షోరూం ధరలను మాత్రమే చెబుతాయి. కాగా ఆన్​రోడ్​ ప్రైజ్​ అనేది వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్​లు వేరువేరుగా ఉండటంతో మారుతుంటూ ఉంటుది. అందుకే కస్టమర్లు వెహికిల్​ని కొనే ముందు, ఎక్స్​షోరూం ప్రైజ్​ కాకుండా ఆన్​రోడ్​ ప్రైజ్​ తెలుసుకుని బడ్జెట్​ వేసుకోవాలి.

మీ సమీప డీలర్​షిప్​ షోరూమ్​ని సందర్శిస్తే టాటా హారియర్​ ఈవీ​​ టెస్ట్​ డ్రైవ్​తో పాటు ఆఫర్స్​, డిస్కౌంట్స్​ వంటి వివరాలపైనా క్లారిటీ వస్తుంది. ఆ మేరకు మీరు మీ బడ్జెట్​ని ప్లాన్​ చేసుకోవచ్చు.

టాటా హారియర్​ ఈవీ బుకింగ్స్​ జులై 2 ప్రారంభమవుతాయి.

టాటా హారియర్​ ఈవీ రేంజ్​​..

ఈ టాటా హారియర్​ ఈవీ ఒక లాంగ్​ రేంజ్​ ఎలక్ట్రిక్​ కారు అని చెప్పుకోవచ్చు. ఇందులోని 75 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే సుమారు 620 కి.మీ రేంజ్​ వస్తుందని అంచనాలు ఉన్నాయి. అంతేకాదు, ఫాస్ట్​ ఛార్జర్​తో ఈ ఈవీని 15 నిమిషాలు ఛార్జ్​ చేస్తే ఏకంగా 250 కి.మీ వరకు ప్రయాణిస్తుందట. మొత్తం మీద చూసుకుంటే, 120 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్​ ఛార్జర్​తో 20-80శాతం ఛార్జింగ్​కి కేవలం 25 నిమిషాల సమయం పడుతుందని సంస్థ చెబుతోంది.

మరి మీరు ఈ టాటా హారియర్​ ఈవీ కొంటారా?

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం