టాటా మోటార్స్ నుంచి ఇటీవలే లాంచ్ అయిన టాటా హారియర్ ఈవీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ భారీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ప్రారంభ ధర రూ. 21.49లక్షలు. లైనప్‌లోని మిగిలిన ధరలను దేశీయ ఆటోమొబైల్ సంస్థ ఇంకా ప్రకటించలేదు. కాగా లాంచ్ ఈవెంట్లో.. టాటా మోటార్స్ హారియర్ ఈవీని అడ్వెంచర్, ఫియర్లెస్, ఎంపవర్డ్ అనే మూడు వేరియంట్లలో అందించనున్నట్లు వెల్లడించింది. ఇదే కార్యక్రమంలో, బ్రాండ్ హారియర్ ఈవీ అడ్వెంచర్ వేరియంట్‌ని ప్రదర్శించింది. అడ్వెంచర్ వేరియంట్ అనేది బేస్ వేరియంట్. ఇప్పుడు ఈ వేరియంట్‌పై అందుబాటులో ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
టాటా హారియర్ ఈవీల బేస్ వేరియంట్ చిన్న 65 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో మాత్రమే అందుబాటులోకి వస్తోంది. ప్రస్తుతానికి, ఈ బ్యాటరీ ప్యాక్ రేంజ్ గణాంకాలు మనకు తెలియదు. కానీ ఇది 120 కిలోవాట్ల వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది. ఇక్కడ టాప్- అప్ 20 శాతం నుంచి 80 శాతం వరకు కేవలం 25 నిమిషాల్లో జరుగుతుందని సమాచారం. ఈ అడ్వెంచర్ వేరియంట్ రేర్ వీల్ డ్రైవ్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 234 బీహెచ్పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది.
ఈ టాటా హారియర్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ అడ్వెంచర్ వేరియంట్లో టాటా కొత్త అల్ట్రా గ్లైడ్ సస్పెన్షన్ ఉంటుంది. ఇది ప్రాథమికంగా ఫ్రీక్వెన్సీ ఆధారిత డంపర్లు. నార్మల్, వెట్/రెయిన్ అండ్ రఫ్ రోడ్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్ - స్పోర్ట్, సిటీ, ఎకోతో వస్తుంది. ఇది కాకుండా, డ్రిఫ్ట్ మోడ్ కూడా ఉంది. పెడల్ షిఫ్టర్ల ద్వారా నియంత్రించే నాలుగు రెజెన్ మోడ్లు అందుబాటులో ఉంటాయి. టాటా క్రూయిజ్ కంట్రోల్, అకౌస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్‌ను కూడా సంస్థ అందిస్తోంది.
హారియర్ ఈవీ బేస్ వేరియంట్లో 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఏరో ఇన్సర్ట్స్, డ్యూయెల్ టోన్ పెయింట్, ఎల్ఈడీ బై ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, ఇరువైపులా కనెక్టెడ్ లైట్లు, రూఫ్ రైల్స్, ఇంటిగ్రేటెడ్ సైడ్ స్టెప్స్, రేర్ వైపర్ అండ్ వాషర్, పడ్ల్ ల్యాంప్స్, షార్క్ ఫిన్ యాంటెనా ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. అన్ని వీల్ డిస్క్ బ్రేకులే. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టెమ్, రేర్ పార్కింగ్ కెమెరా, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్, బ్రేక్ డిస్క్ వైపింగ్ వంటి ఫీచర్లను టాటా అందిస్తోంది.
45వాట్ యూఎస్బీ-సీ ఛార్జింగ్ పోర్టులు, స్లైడింగ్ ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, టిల్ట్, టెలిస్కోపిక్ అడ్జెస్టెబుల్ స్టీరింగ్, పార్శిల్ ట్రే, లెథరెట్ సీట్ అప్‌హోలిస్ట్రీ, డ్యూయెల్ టోన్ ఇంటీరియర్ థీమ్, ఆటో-ఫోల్డ్ ఫంక్షన్‌తో ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేయగల ఫోల్డబుల్ ఓఆర్వీఎంలు, వీ2వీ, వీ2ఎల్ సామర్థ్యాలు ఉన్నాయి.
2025 టాటా హారియర్ ఈవీ అడ్వెంచర్‌లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 8-వే అడ్జెస్టెబుల్ డ్రైవర్ సీటు, ఫోర్-వే అడ్జెస్టెబుల్ ఫ్రంట్ ప్యాసింజర్ సీటు, రేర్ ఏసీ వెంట్స్, వివిధ టెర్రైన్ మోడ్లు, డ్రిఫ్ట్ మోడ్, క్రూయిజ్ కంట్రోల్, అకౌస్టిక్ వెహికల్ అలెర్టరింగ్ సిస్టమ్ (ఎవిఎఎస్), డ్యూయల్ 10.25-ఇంచ్ డిస్ప్లేలు, ఐఆర్ఏ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కోసం కనెక్టివిటీ వంటి అనేక ముఖ్యమైన ఇంటీరియర్ ఫీచర్లు ఉన్నాయి.
టాటా హారియర్ ఈవీ పూర్తి ధరలు బయటకు వచ్చిన తర్వాత.. ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు అందుబాటులోకి వస్తాయి. వాటిని మేము మీకు అప్డేట్ చేస్తాము.
సంబంధిత కథనం