250 aircrafts for Air India: 250 విమానాలను కొనుగోలు చేస్తున్న ఎయిర్ ఇండియా
250 aircrafts for Air India: ఫ్రాన్స్ కు చెందిన విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్ (Airbus) నుంచి ఎయిర్ ఇండియా (Air India) మొత్తం 350 విమానాలను కొనుగోలు చేయనుంది.
250 aircrafts for Air India: ఫ్రాన్స్ కు చెందిన విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్(Airbus) నుంచి ఎయిర్ ఇండియా (Air India) కోసం టాటా గ్రూప్ (Tata Group) మొత్తం 350 విమానాలను కొనుగోలు చేయనుంది.
250 aircrafts for Air India: 40 ఏ 350 విమానాలు
ఎయిర్ బస్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఎయిర్ ఇండియాకు 40 వెడల్పాటి ఏ 350 (wide-body A350 aircraft) విమానాలను, 210 ఏ 320 నియో జెట్ (narrow-body A320 neo jets) విమానాలను ఎయిర్ బస్ (Airbus) సమకూర్చనుంది. వీటిలో ఏ 350 విమానాలు అత్యంత సుదూర తీరాలకు ప్రయాణించగల, అత్యాధునిక సౌకర్యాలున్న విమానాలు. వీలైనంత త్వరగా భారత్ లోనే విమాన తయారీ ప్రారంభించే ఆలోచనలో టాటా గ్రూప్ ఉన్నట్లు టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వెల్లడించారు. త్వరలో ఎయిర్ ఇండియా (Air India)ను మరింత విస్తరించనున్నామని ఆయన తెలిపారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు విమాన సేవలను అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేయనున్నామన్నారు. ప్రస్తుతం ఎయిర్ ఇండియా (Air India) వద్ద 113 విమానాలు ఉన్నాయి. భాగస్వామ్య సంస్థలైన ఎయిర్ ఆసియాకు 28 విమానాలు, విస్తారా వద్ద 54, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ వద్ద 24 విమానాలు ఉన్నాయి.
250 aircrafts for Air India: వర్చువల్ మీటింగ్
ఎయిర్ ఇండియా (Air India), ఎయిర్ బస్ ((Airbus)) ల మధ్య కుదిరిన ఈ విమాన కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi), ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మేక్రాన్ (French President Emmanuel Macron) , రతన్ టాటా (Ratan Tata), కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్(Piyush Goyal), పౌర విమానయానమంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia), ఎయిర్ ఇండియా (Air India) చైర్మన్ క్యాంప్ బెల్ విల్సన్ తదితరులు వర్చువల్ గా హాజరయ్యారు. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) ను, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ (Air India Express)ను టాటా గ్రూప్ జనవరి 2022 లో 100% కొనుగోలు చేసింది. అలాగే, టాటా సన్స్, సింగపూర్ ఎయిర్ లైన్స్ (Singapore airlines) కు చెందిన జాయింట్ వెంచర్ విస్తారా ఎయిర్ లైన్స్ ను ఎయిర్ ఇండియా (Air India)లో విలీనం చేయనున్నట్లు గతంలో టాటా గ్రూప్ ప్రకటించింది. ఇందులో సింగపూర్ ఎయిర్ లైన్స్ కు 25.1% వాటా ఉంటుంది.