Tata EV Discounts : టాటా ఎలక్ట్రిక్ కార్లపై తగ్గింపు.. ఈ లిస్టులో టాప్ ఈవీలు!-tata electric cars offers february 2025 list including punch ev tiago ev and curvv ev know the benefits ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Ev Discounts : టాటా ఎలక్ట్రిక్ కార్లపై తగ్గింపు.. ఈ లిస్టులో టాప్ ఈవీలు!

Tata EV Discounts : టాటా ఎలక్ట్రిక్ కార్లపై తగ్గింపు.. ఈ లిస్టులో టాప్ ఈవీలు!

Anand Sai HT Telugu Published Feb 09, 2025 09:40 PM IST
Anand Sai HT Telugu
Published Feb 09, 2025 09:40 PM IST

Tata EV Discounts : టాటా ఎలక్ట్రిక్ కార్లపై ఆఫర్ నడుస్తోంది. మోడల్ ఇయర్ ఆధారంగా ఈవీలపై తగ్గింపు ప్రయోజనాలు ఉన్నాయి. కావాలనుకునేవారు ఈ ఆఫర్ ఉపయోగించుకోవచ్చు.

టాటా నెక్సాన్ ఈవీ
టాటా నెక్సాన్ ఈవీ

ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్‌లో టాటా కార్లది ప్రత్యేకమైన స్థానం. టాటా మోటార్స్ బ్రాండ్ భారత్‌లో టాప్‌లో ఉంటుంది. టాటా నుంచి కొన్ని ఎలక్ట్రిక్ కార్లు కూడా వచ్చాయి. టియాగో, టిగోర్, పంచ్ ఈవీలు మార్కెట్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి. ఇప్పుడు పంచ్ ఈవీ, టియాగో ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ వంటి మోడళ్లపై ధర తగ్గింపులో ఉంది. టాటా 2024 స్టాక్‌ కోసం ఈ ఆఫర్‌లను సిద్ధం చేసింది. అయితే 2025 మోడల్స్ మీద కూడా అఫర్స్ ఉన్నాయి. ధర తగ్గింపులను వేరియంట్‌ను బట్టి గ్రీన్ బోనస్, ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ ప్రయోజనాలుగా విభజించారు.

  1. టాటా పంచ్ ఈవీ 3.3 kW AC వాల్ బాక్స్ ఛార్జర్‌తో కూడిన స్మార్ట్, స్మార్ట్ ప్లస్ వేరియంట్‌లపై రూ. 40,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. 3.3kW ఛార్జర్‌తో అన్ని ఇతర మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ వేరియంట్‌లపై రూ. 50,000 వరకు ఆఫర్‌లు లభిస్తాయి. 7.2kW AC ఫాస్ట్ ఛార్జర్‌ను ఎంచుకుంటే కస్టమర్‌లకు ధరపై రూ. 70,000 వరకు తగ్గింపు లభిస్తుందని కంపెనీ ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ మోడల్ ఇయర్ 2025కి సంబంధించిన అన్ని ఇతర వేరియంట్లపై రూ.40,000 వరకు తగ్గింపు లభిస్తుంది.
  2. టాటా నెక్సాన్ ఈవీపై లభించే ప్రయోజనాలు రూ. 40,000 వరకు ఉన్నాయి. అయితే ఈ ఆఫర్ 2024 మోడల్ ఇయర్ స్టాక్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రత్యేకంగా పేర్కొంది. కంపెనీ ఎలక్ట్రిక్ లైనప్‌లో ఇది మొదటి వాహనం అయినప్పటికీ ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 45kWh పెద్ద బ్యాటరీ ప్యాక్, ఆకట్టుకునే రేంజ్‌తో వస్తుంది.
  3. టియాగో ఈవీ మొత్తం వేరియంట్ లైనప్‌పై టాటా మోటార్స్ రూ.85,000 వరకు విలువైన ఆఫర్‌లను ప్రవేశపెట్టింది. మీరు 3.3kW ఛార్జర్‌తో ఎక్స్‌టీ వేరియంట్‌ను ఎంచుకుంటేనే ఈ భారీ తగ్గింపు అందుబాటులో ఉంటుంది. టాప్-స్పెక్ ఎక్స్‌జెడ్ ప్లస్ వేరియంట్లకు రూ. 60,000 వరకు ఆఫర్లు లభిస్తాయి.
  4. టాటా ప్రస్తుత ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ కారు కర్వ్ ఈవీ 2024 స్టాక్‌ను వివిధ వేరియంట్లలో రూ. 70,000 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. 55kWh బ్యాటరీ ప్యాక్, 167 బీహెచ్‌పీ వరకు పవర్ కలిగిన ఈ ఎలక్ట్రిక్ కూపే ఎస్‌యూవీ, కంపెనీ ఈవీ లైనప్‌లో అతిపెద్ద బ్యాటరీ సామర్థ్యాన్ని, అత్యధిక శక్తిని అందిస్తుంది.

గమనిక : ఈ ఆఫర్ నగరానికి నగరానికి మారుతూ ఉండవచ్చు. సమీప డీలర్షిప్ లేదా షోరూమ్ దగ్గరకు వెళ్లి తగ్గింపు ప్రయోజనాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

Whats_app_banner