Tata Curvv: 48 టన్నుల ఎయిరిండియా విమానాన్ని లాగి, రికార్డు సృష్టించిన టాటా కర్వ్
Tata Curvv record: టాటా మోటార్స్ లేటెస్ట్ గా లాంచ్ చేసిన టాటా కర్వ్ ఎస్ యూవీ 48 టన్నుల బరువున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 737విమానాన్ని 100 మీటర్ల దూరం లాగి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో రికార్డు సృష్టించింది.

Tata Curvv record: టాటా మోటార్స్ కు చెందిన కూపే పెట్రోల్ ఎస్ యూవీ టాటా కర్వ్ ఎయిర్ ఇండియా బోయింగ్ 737విమానాన్ని 100 మీటర్ల దూరం లాగి 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ 'లో స్థానం సంపాదించింది. 48 టన్నుల బరువున్న బోయింగ్ 737 విమానాన్ని 100 మీటర్ల దూరం లాగడం ద్వారా టాటా కర్వ్ ఈ రికార్డును నెలకొల్పింది. టాటా మోటార్స్ ఈ విజయాన్ని వివిధ సోషల్ మీడియా ఛానెళ్లలో వెల్లడించింది.
టాటా కర్వ్ పవర్ట్రెయిన్ దృఢత్వం
టాటా కర్వ్ అట్లాస్ ఆర్కిటెక్చర్, హైపరియన్ జీడీఐ పవర్ట్రెయిన్ దృఢత్వాన్ని ప్రదర్శించేందుకు తిరువనంతపురంలోని ఏఐఈఎస్ఎల్ హ్యాంగర్ లో ఈ ఫీట్ చేసి, రికార్డును నెలకొల్పారు. ఈ కారులో 1.2-లీటర్ ఇంజన్ ఉంది. ఇది 5,000 ఆర్పిఎమ్ వద్ద 123.2 బీహెచ్పీ, 1,750 నుండి 3,000 ఆర్పిఎమ్ వద్ద 225 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వాహనంతో ఈ ఫీట్ నిర్వహించారు. ఈ కారు టైర్ ప్రెజర్ లు ముందు టైర్లకు 32 పిఎస్ ఐ, వెనుక టైర్లకు 30 పిఎస్ఐగా ఉంది.
టాటా కర్వ్ ఐసిఇ పవర్ ట్రెయిన్, పెర్ఫార్మెన్స్
హైపరియన్ ఇంజన్ కాకుండా, టాటా కర్వ్ మరో రెండు ఇంజన్ ఆప్షన్స్ తో వస్తుంది. ఈ కారు నెక్సాన్ 1.2-లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ను వారసత్వంగా పొందుతుంది. ఇది 119 బీహెచ్పీ, 170 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు పెట్రోల్ ఇంజన్లు 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డిసిఎ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో లభిస్తాయి. డీజల్ వేరియంట్ లో కొత్త 1.5-లీటర్ కైరోటెక్ ఇంజన్ ఉంటుంది. ఇది 117 బీహెచ్పీ, 260 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ యూనిట్ 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డీసీఏను కలిగి ఉంది. ఇది డీజిల్ ఇంజిన్ తో ఆటోమేటిక్ ను కలిగి ఉన్న సెగ్మెంట్లో మొదటిది.
టాటా కర్వ్ సేఫ్టీ ఫీచర్స్
టాటా కర్వ్ లో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉన్నాయి. వెనుక భాగంలో ఐసోఫిక్స్ మౌంట్లు ఉన్నాయి. ఇందులో 3-పాయింట్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి. క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, 360 డిగ్రీల మానిటర్, బ్లైండ్ స్పాట్ మానిటర్ వంటి అదనపు సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. టాటా కర్వ్ లో 20 ఫీచర్లతో లెవల్ 2 ఏడీఏఎస్ ఉంటుంది.
సంబంధిత కథనం