Tata Curvv EV : 600 కి.మీ రేంజ్‌తో రేపే టాటా కర్వ్ ఈవీ లాంచ్.. ధర ఎంత?
Tata Curvv EV price : ఆగస్ట్ 7న టాటా కర్వ్ ఈవీ లాంచ్ అవ్వనుంది. కూపే ఎస్యూవీ సెగ్మెంట్లో తొలి మోడల్ అయన ఈ టాటా కర్వ్ వివరాలను ఇక్కడ చూసేయండి..
దేశీయ స్టాక్ మార్కెట్లో మరో కొత్త ఆవిష్కరణ. మచ్ అవైటెడ్ టాటా కర్వ్ ఈవీ కూపై ఎస్యూవీ ఆగస్ట్ 7, బుధవారం ఇండియాలో లాంచ్ అవ్వనుంది. ఈ సెగ్మెంట్లో ఇదే తొలి వెహికల్‌గా నిలిచిపోనుంది. లాంచ్‌కి ముందు ఈ కర్వ్ ఈవీ పలు టాటా డీలర్షిప్షోరూమ్స్కి చేరుకుంది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్‌కి చెందిన ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
టాటా కర్వ్ ఈవీ ఫీచర్స్..
నివేదికల ప్రకారం టాటా కర్వ్ ఈవీ కూపే ఎస్యూవీ ఎక్స్టీరియర్లో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఏరో ఇన్సర్ట్స్తో కూడిన 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్, విశాలమైన బూట్ ఉంటాయి. ఎలక్ట్రిక్ పానోరమిక్ సన్‌రూఫ్ కూడా ఉంటుంది.
ఇక టాటా కర్వ్ ఈవీ ఇంటీరియర్ విషయానికొస్తే, ఇందులో హర్మన్ నుంచి 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆర్కేడ్.ఈవీ యాప్ సూట్, మల్టిపుల్ వాయిస్ అసిస్టెంట్లు, గెస్చర్ యాక్టివేషన్‌తో పవర్డ్ టెయిల్‌గేట్ ఉండొచ్చు. వెహికల్-టు-వెహికల్ ఛార్జింగ్, వెహికల్-టు-లోడ్ ఫంక్షనాలిటీని కూడా టాటా అందిస్తోంది.
ఈ కూపే ఎస్యూవీ ఇంటీరియర్‌లో వెంటిలేటెడ్ సీట్లు, 6-వే ఎలక్ట్రికల్ అడ్జస్టెబుల్ డ్రైవర్ సీటు, కో-డ్రైవర్ సీటు ఉంటాయి. వెనుక సీటులో సెంటర్ కన్సోల్‌తో పాటు టూ స్టెప్ రెక్లైన్ ఫంక్షన్ ఉంటుంది. రీజనరేషన్ లెవల్స్‌ని మార్చడానికి టాటా ప్యాడిల్ షిఫ్టర్లను కూడా అందిస్తోంది. లెవల్ 2 ఏడీఏఎస్, డ్రైవర్ డోజ్-ఆఫ్ అలర్ట్‌తో కూడిన ఈఎస్పీ, 6 ఎయిర్ బ్యాగులు, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఇప్పటివరకు విడుదలైన టీజర్లలో వెల్లడించిన ఇతర ఫీచర్లు.. డ్రైవర్ కోసం డిజిటల్ టీఎఫ్టీ స్క్రీన్, వైర్లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ప్రకాశవంతమైన టాటా లోగోతో కొత్త ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్.
టాటా కర్వ్ ఈవీ రేంజ్- ధర..
టాటా కర్వ్ ఈవీ కూపే ఎస్యూవీ బ్యాటరీ వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు. అయితే ఇందులో రెండ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉంటాయని తెలుస్తోంది. అందులో ఒకటి 55కేడబ్ల్యూహెచ్ యూనిట్ అని సమాచారం. ఇందులో సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ ఉండొచ్చు. డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో ఈ కూపే ఎస్‌యూవీని 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 100 కి.మీల దూరం ప్రయాణిస్తుందట. పలు నివేదికల ప్రకారం టాటా కర్వ్ ఈవీ రేంజ్ 600 కి.మీలు. ఇక టాటా కర్వ్ ఈవీ ధరకు సంబంధించిన వివరాలు సైతం ప్రస్తుతం అందుబాటులో లేవు. కానీ దీని ఎక్స్‌షోరూం ధర రూ. 11 లక్షల నుంచి రూ. 20లక్షల మధ్యలో ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
టాటా కర్వ్ ఈవీ కూపే ఎస్యూవీ ఇతర ఫీచర్స్, రేంజ్, ధరతో పాటు ఇతర వివరాలపై లాంచ్ టైమ్‌కి క్లారిటీ వస్తుంది.
మరోవైపు టాటా కర్వ్‌కి ఐసీఈ ఇంజిన్ని కూడా సంస్థ ప్లాన్ చేసింది. ఈవీ వర్షెన్ లాంచ్ అయిన కొంత కాలానికి ఐసీఈ ఇంజిన్ మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది.
ఇంకో విషయం. హిందుస్థాన్ టైమ్స్ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్లో అందుబాటులో ఉంది. ఆటోమొబైల్ రంగం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్‌లోని మన హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఫాలో అవ్వండి.
సంబంధిత కథనం