టాటా మోటార్స్​ నుంచి క్రేజీ అప్డేట్​- ఈ రెండు ఎలక్ట్రిక్​ వాహనాలపై 'లైఫ్​టైమ్​ వారంటీ'!-tata curvv ev and nexon ev get lifetime warranty ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  టాటా మోటార్స్​ నుంచి క్రేజీ అప్డేట్​- ఈ రెండు ఎలక్ట్రిక్​ వాహనాలపై 'లైఫ్​టైమ్​ వారంటీ'!

టాటా మోటార్స్​ నుంచి క్రేజీ అప్డేట్​- ఈ రెండు ఎలక్ట్రిక్​ వాహనాలపై 'లైఫ్​టైమ్​ వారంటీ'!

Sharath Chitturi HT Telugu

టాటా కర్వ్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ 45 త్వరలో లైఫ్​టైమ్​ వారంటీని పొందనున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ రెండు టాటా ఈవీలకు లైఫ్​టైమ్​ వారంటీ..!

టాటా మోటార్స్​ కస్టమర్స్​కి బిగ్​ అప్డేట్​! రెండు ఎలక్ట్రిక్​ వాహనాలకు అపరిమిత కిలోమీటర్లతో 'లైఫ్​టైమ్​ వారంటీ'ని ప్రారంభించాలని టాటా మోటార్స్​ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అవి.. కర్వ్ ఈవీ, నెక్సాన్ ఈవీ. ఇక్కడ 'లైఫ్​టైమ్​' అంటే స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో వాహనం రిజిస్ట్రేషన్ చేసిన మొదటి తేదీ నుంచి పదిహేనేళ్ల వ్యవధి! ఇప్పటికే రిజిస్ట్రేషన్​ చేసుకున్న యజమానులు కూడా ఈ ప్రయోజనాలను పొందగలుగుతారు.

కేవలం 45 కిలోవాట్ల టాటా నెక్సాన్ ఈవీ యజమానులు మాత్రమే ఈ ప్రయోజనానికి అర్హులని గమనించాలి. రెండో రిజిస్ట్రేషన్ తర్వాత నెక్సాన్ ఈవీ 45, కర్వ్ ఈవీలకు 8 ఏళ్లు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీ ఉంటుంది. మొదటిది తర్వాత యజమానులందరూ యాజమాన్య బదిలీ గురించి బ్రాండ్​కు తెలియజేయాలని, లేని పక్షంలో బ్యాటరీ వారంటీ ఇవ్వబోమని టాటా తెలిపింది.

టాటా మోటార్స్​ లైఫ్​ టైమ్​ వారంటీ- నిబంధనలు, షరతులు..

కొనుగోలుదారుడు తన అపరిమిత వారంటీని నిలుపుకోవడానికి పాటించాల్సిన కొన్ని నియమనిబంధనలను టాటా మోటార్స్ నిర్దేశించింది.

1. టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ద్వారా సిఫారసు చేసిన మెయింటెనెన్స్ షెడ్యూల్​ని అనుసరించి అధీకృత TATA.ev సర్వీస్ స్టేషన్ వద్ద వాహనాన్ని సర్వీస్ చేయాలి లేదా రిపేర్ చేయాలి.

2. ప్రైవేటు వ్యక్తుల పేరిట వాహనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఉద్యోగుల కోసం కంపెనీ పెర్క్ కార్ స్కీమ్ కింద చేసిన రిజిస్ట్రేషన్లు, అదే ఉద్యోగికి వాహనం తదుపరి బదిలీలతో సహా! వాహనాన్ని బదిలీ చేసినా లేదా ఏదైనా థర్డ్​ పార్టీకి విక్రయించినా వారంటీ చెల్లదు.

రూ. 10లక్షల బడ్జెట్​లో బెస్ట్​ ఎలక్ట్రిక్​ కారు కొనాలని ప్లాన్​ చేస్తుంటే ఇక్కడ క్లిక్​ చేయండి.

3. మొత్తం యాజమాన్య కాలం అంతటా వాహనం క్రియాశీల, అంతరాయం లేని IRA.ev కనెక్షన్​ను మెయింటైన్ చేయాలి.

4. బ్యాటరీ ఎలాంటి భౌతిక నష్టం లేదా ట్యాంపరింగ్ లేకుండా ఉండాలి.

వీటితో పాటు మరిన్ని షరతులు కూడా ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం సమీప డీలర్​షిప్​లను సంప్రదించాలని టాటా మోటార్స్​ పేర్కొంది.

అపరిమిత వారంటీ పొందిన టాటా మోటార్స్ నుంచి మొదటి ఉత్పత్తి హారియర్ ఈవీ. అయితే రెండో రిజిస్ట్రేషన్ తర్వాత యజమానికి 10 ఏళ్లు లేదా 2 లక్షల కిలోమీటర్ల వారంటీ మాత్రమే లభిస్తుంది. ఇప్పటివరకు, దేశీయ తయారీదారు తన ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ ప్యాక్​పై 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీని అందించేది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం