టాటా మోటార్స్ కస్టమర్స్‌కి అలర్ట్! ఈ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ తమ కస్టమర్స్ కోసం దేశవ్యాప్తంగా మాన్సూమ్ క్యాంప్‌ని నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఈ క్యాంప్ 500 నగరాల్లో అందుబాటులో ఉంటుందని, 1090 అధికారిక వర్క్‌షాప్స్ సపోర్ట్ వీటికి ఉంటుందని పేర్కొంది. ఈ టాటా మోటార్స్ మాన్సూమ్ క్యాంప్ సేవలను జూన్ 20 వరకు వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది.
దేశంలో జూన్‌తో వర్షా కాలం మొదలవుతుంది. ఈ సమయంలో భారీ వర్షాలతో అనేక చోట్ల రోడ్లు జలమయం అవుతాయి. డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అటు డ్రైవింగ్ కష్టమే, ఇటు కారు మెయిన్టైనెన్స్ కూడా కష్టమే. అందుకే వాహన పనితీరు, భద్రతను నిర్ధారించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని స్వదేశీ తయారీదారు చెప్పుకొచ్చింది.
30 కంటే ఎక్కువ ముఖ్యమైన చెక్ పాయింట్స్‌తో పాటు, ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన నిర్ధారణలతో సహా, వినియోగదారులు ఉచితంగా పూర్తి వాహన ఆరోగ్య పరీక్షను పొందే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో కారు టాప్వాష్, అసలైన స్పేర్ పార్ట్స్, ఇంజిన్ ఆయిల్, ఎక్స్టెండెడ్ వారంటీలు, లేబర్ ఖర్చులపై ప్రత్యేక తగ్గింపులు కూడా ఉన్నాయి.
విలువను మెరుగుపరచడానికి, వినియోగదారులు కొత్త టాటా వాహనాలపై ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్లను ఉపయోగించుకునే అవకాశాన్ని కూడా సంస్థ ఇస్తోంది. ఇందులో వారి ప్రస్తుత కార్ల ఉచిత అసెస్మెంట్ కూడా ఉంటుంది.
మరిన్ని వివరాల కోసం టాటా మోటార్స్ అధికారిక వెబ్సైట్, సమీపంలోని డీలర్షిప్ షోరూమ్‌ని సందర్శించాల్సి ఉంటుంది.
ఇక టాటా మోటార్స్ నుంచి కొత్తగా ఒక మోడల్ లాంచ్ అయ్యింది. దీని పేరు టాటా హారియర్ ఈవీ. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 21.49 లక్షలు. హ్యారియర్ ఈవీ.. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ నుంచి వస్తున్న ప్రీమియర్ ఎలక్ట్రిక్ వాహనంగా నిలువనుంది. ఈ కొత్త మోడల్ తయారీదారు అభివృద్ధి చేసిన తాజా ఈవీ ఆర్కిటెక్చర్‌ను కలిగి ఉంది. ఇది acti.ev plus గా పిలుస్తున్నారు. ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ ఉంటుంది.
టాటా హారియర్ ఈవీ మూడు ట్రిమ్ స్థాయిలలో అందుబాటులో ఉంటుంది. అవి.. అడ్వెంచర్, ఫియర్‌లెస్, ఎంపవర్డ్. ఇది నైనిటాల్ నాక్చ్యుర్నల్, ఎంపవర్డ్ ఆక్సైడ్, ప్యూర్ గ్రే, ప్రిస్టైన్ వైట్ అనే నాలుగు కలర్ ఆప్షన్స్‌లో వస్తుంది. అదనంగా ప్రత్యేకమైన బ్లాక్డ్-అవుట్ స్టెల్త్ ఎడిషన్ కూడా ఉంటుంది.
టాటా హారియర్ బేస్ వేరియంట్ ఫీచర్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కోసం బుకింగ్‌లు జులై 2న ప్రారంభం కానున్నాయి. హారియర్ ఈవీ.. మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ, బీవైడీ టో 3 వంటి వాహనాలతో పోటీ పడుతుంది. వీటి మధ్య వ్యత్యాసాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
టటా హారియర్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలు, రెండు మోటార్ కాన్ఫిగరేషన్లతో అందుబాటులో ఉంటుంది. హారియర్ ఈవీ లో-వేరియంట్లు 65 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తాయి. కాగా టాప్ ఎండ్ ట్రిమ్స్‌లో 75 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ 75 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో అమర్చిన ఆర్డబ్ల్యూడీ వేరియంట్ల రేంజ్ 627 కిమీ.
సంబంధిత కథనం