Tata Altroz Racer vs Hyundai i20 N Line : ఈ రెండు హ్యాచ్​బ్యాక్స్​లో ఏది బెస్ట్​?-tata altroz racer vs hyundai i20 n line which hatch to choose ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Altroz Racer Vs Hyundai I20 N Line : ఈ రెండు హ్యాచ్​బ్యాక్స్​లో ఏది బెస్ట్​?

Tata Altroz Racer vs Hyundai i20 N Line : ఈ రెండు హ్యాచ్​బ్యాక్స్​లో ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu
Jun 10, 2024 11:47 AM IST

Tata Altroz Racer vs Hyundai i20 N Line : ఆల్ట్రోజ్​లో రేసర్​ వర్షెన్​ని లాంచ్​ చేసింది టాటా మోటార్స్​. దీనిని.. హ్యుందాయ్​ ఐ20 ఎన్​ లైన్​తో పోల్చి.. ఏది బెస్ట్​? ఏది కొంటే బెటర్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

ఈ రెండు హ్యాచ్​బ్యాక్స్​లో ఏది బెస్ట్​? ఏది కొనాలి?
ఈ రెండు హ్యాచ్​బ్యాక్స్​లో ఏది బెస్ట్​? ఏది కొనాలి?

Tata Altroz Racer on road price Hyderabad : టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్​బ్యాక్​కు స్పోర్టియర్ వర్షెన్​గా ఆల్ట్రోజ్ రేసర్​ భారతదేశంలో విడుదలైంది. మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఐ 20 వంటి ప్రత్యర్థులతో ఇప్పటికే ఉన్న పోటీని ఈ ఆల్ట్రోజ్​ రేస్​తో మరింత పెంచింది టాటా మోటార్స్​. ఈ నేపథ్యంలో.. ఈ టాటా ఆల్ట్రోజ్​ రేసర్​ని హ్యుందాయ్​ ఐ20 ఎన్​ లైన్​తో పోల్చి.. ఈ రెండింట్లో ఏది బెస్ట్​? ఏది కొంటే బెటర్​? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

yearly horoscope entry point

టాటా ఆల్ట్రోజ్ రేసర్ వర్సెస్ హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్: ధర..

Tata Altroz Racer vs Hyundai i20 N Line : మూడు వేర్వేరు ట్రిమ్ ఆప్షన్లలో లభిస్తున్న టాటా ఆల్ట్రోజ్ రేసర్ ధర రూ .9.49 లక్షల నుంచి రూ .10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. మరోవైపు.. హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ ధర రూ .9.99 లక్షల నుంచి రూ .12.52 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది.

అంటే.. ఐ 20 ఎన్​ లైన్​ కన్నా.. ఆల్ట్రోజ్​ రేసర్​ ధర తక్కువే!

టాటా ఆల్ట్రోజ్ రేసర్ వర్సెస్ హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్: స్పెసిఫికేషన్లు..

టాటా ఆల్ట్రోజ్ రేసర్ స్పోర్టీ ప్రీమియం హ్యాచ్​బ్యాక్​లో టాటా నెక్సాన్ నుంచి తీసుకున్న 1.2-లీటర్ 3 సిలిండర్ల టర్బోఛార్జ్​డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఆల్ట్రోజ్​ రేసర్​లో ఆటోమేటిక్ వేరియంట్ లేనందున ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్​తో మాత్రమే కనెక్ట్​ చేసి ఉంటుంది. ఈ ఇంజిన్.. గరిష్టంగా 118బీహెచ్​పీ పవర్, 170ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ 1.0-లీటర్ టర్బోఛార్జ్​డ్​ పెట్రోల్ మోటార్​తో పనిచేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ గేర్​బాక్స్​ ఆప్షన్స్​తో లభిస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 118బీహెచ్​పీ పవర్, 172ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

Hyundai i20 N Line on road price in Hyderabad : రెండు హ్యాచ్​బ్యాక్ లు ఒకే విధమైన పవర్, టార్క్ ఔట్​పుట్​ను కలిగి ఉన్నాయి. కానీ హ్యుందాయ్ ఐ 20 మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్ వేరియంట్లలో లభిస్తుంది. ఇది ఆల్ట్రోజ్ రేసర్​తో పోలిస్తే ఈ కారుతో వినియోగదారులకు ఎక్కువ ఆప్షన్స్​ లభిస్తున్నట్టు అవుతుంది.

టాటాకు ఆల్ట్రోజ్​, హ్యుందాయ్​కి ఐ20.. బెస్ట్​ సెల్లింగ్​ హ్యాచ్​బ్యాక్​ మోడల్స్​గా ఉన్నాయి. హ్యుందాయ్​ ఐ20 ఎన్​ లైన్​కి కూడా మంచి డిమాండ్​ కనిపిస్తోంది. మరి.. ఈ కొత్త టాటా ఆల్ట్రోజ్​ రేసర్​.. ఏ మేరకు ప్రదర్శన చేస్తుందో చూడాలి. 

ఇంకో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సప్ ఛానల్స్​లో అందుబాటులో ఉంది! ఆటోమొబైల్​ ప్రపంచం నుంచి లేటెస్ట్​ అప్డేట్స్​ మిస్ కాకుండా ఉండటానికి హెచ్​టీ తెలుగు వాట్సాప్​ ఛానెల్​ని ఇప్పుడే ఫాలో అవ్వండి.

Whats_app_banner

సంబంధిత కథనం