Tata Altroz Racer : సూపర్​ స్పోర్టీ లుక్స్​తో.. టాటా ఆల్ట్రోజ్​ రేసర్​​ వచ్చేస్తోంది!-tata altroz racer revs up for june launch check what to expect ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Altroz Racer : సూపర్​ స్పోర్టీ లుక్స్​తో.. టాటా ఆల్ట్రోజ్​ రేసర్​​ వచ్చేస్తోంది!

Tata Altroz Racer : సూపర్​ స్పోర్టీ లుక్స్​తో.. టాటా ఆల్ట్రోజ్​ రేసర్​​ వచ్చేస్తోంది!

Sharath Chitturi HT Telugu
Published May 28, 2024 01:40 PM IST

Tata Altroz Racer : టాటా ఆల్ట్రోజ్ రేసర్ ప్రీమియం హ్యాచ్​బ్యాక్ లాంచ్​పై బజ్​ నెలకొంది. లాంచ్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

టాటా ఆల్ట్రోజ్​ రేసర్​..
టాటా ఆల్ట్రోజ్​ రేసర్​.. (REUTERS)

Tata Altroz Racer on road price Hyderabad : టాటా ఆల్ట్రోజ్​ రేసర్​ లాంచ్​పై గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. భారీ అంచనాలతో వస్తున్న ఆల్ట్రోజ్​ రేసర్​.. 2024 జూన్​లో లాంచ్​ అవుతుందని తాజా లీక్స్​ సూచిస్తున్నాయి. టాటా మోటార్స్​ ప్రీమియం హ్యాచ్​బ్యాక్ అయిన టాటా ఆల్ట్రోజ్​కు స్పోర్టియర్ వెర్షన్​గా వస్తున్న ఈ ఆల్ట్రోజ్​ రేస్​లో మరింత శక్తివంతమైన ఇంజిన్, విలక్షణమైన డిజైన్​, మెరుగైన ఎక్విప్​మెంట్స్​ ఉన్నాయి.

టాటా ఆల్ట్రోజ్​ రేసర్​​.. హైలైట్స్​..

2023 ఆటో ఎక్స్​పోలో ఆల్ట్రోజ్ రేసర్​ను మొదట ప్రదర్శించింది దిగ్గజ్​ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​. ప్రోడక్షన్ మోడల్ లో బ్లాక్-అవుట్ బానెట్, రూఫ్, ఓఆర్​వీఎమ్​లతో పాటు బానెట్ పైకప్పు వెంట నడిచే డ్యూయెల్ వైట్ రేసింగ్ చారలు ఉంటాయి. ఇది ఆకర్షణీయమైన, అగ్రెసివ్​ రూపాన్ని ఇస్తుంది.

టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఇంటీరియర్​లో గణనీయమైన అప్​గ్రేడ్​లను చూడవచ్చు. యాపిల్ కార్​ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.25 ఇంచ్​ టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్​ను కలిగి ఉంటుంది. అదనపు సౌకర్యాల్లో.. వెంటిలేటెడ్ ఫ్రెంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, వాయిస్ ఎనేబుల్డ్ సన్ రూఫ్ కంట్రోల్, వైర్ లెస్ ఛార్జింగ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీల కెమెరా వంటివి ఉన్నాయి. ఇంటీరియర్ లో లెథర్ సీట్ అప్​హోలిస్ట్రీ ఆల్ బ్లాక్ థీమ్, డిటైలింగ్ ఉంటాయి.

Tata Altroz Racer launch date in India : స్టాండర్డ్ ఆల్ట్రోజ్ కంటే ఆల్ట్రోజ్ రేసర్​కు అతిపెద్ద మార్పు.. దాని ఇంజిన్​ అనే చెప్పుకోవాలి. 110 బీహెచ్​పీ స్టాండర్డ్​ అల్ట్రోజ్​ ఐటర్బో ఇంజిన్​ కాకుందా.. కొత్త టాటా ఆల్ట్రోజ్​ రేస్​లో 120 బీహెచ్​పీ 1.2 లీటర్​ యూనిట్​ ఉంటుంది. టాటా నెక్సాన్​లోనూ ఇదే ఇంజిన్​ ఉంటుంది.

ఈ మెరుగైన పనితీరు ఆల్ట్రోజ్ రేసర్​ను హ్యుందాయ్ ఐ20 ఎన్​లైన్​కు నేరుగా పోటీగా ఉంచుతుంది. ఇది 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్​ను కలిగి ఉంటుంది. ఇది 120 బీహెచ్​పీ పవర్​, 172 ఎన్ఎమ్ టార్క్​ని ఉత్పత్తి చేస్తుంది. ఆల్ట్రోజ్ రేసర్ ప్రత్యేకంగా 6-స్పీడ్ మాన్యువల్ గేర్​బాక్స్​తో వస్తుందని భావిస్తున్నారు.

ఆల్ట్రోజ్ రేసర్ ధర.. ప్రస్తుతం రూ .9.20 లక్షల–10.10 లక్షల (ఎక్స్-షోరూమ్) శ్రేణిలో ఉన్న ఐటర్బో కంటే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ధర హ్యుందాయ్ ఐ20 ఎన్​లైన్ వంటి ప్రత్యర్థులకు పోటీగా ఉంటుంది. దీని ధర మాన్యువల్ వేరియంట్లకు రూ .10 లక్షల నుంచి 11.42 లక్షలు (ఎక్స్-షోరూమ్), ఆటోమేటిక్ వేరియంట్ల కోసం రూ .11.15 లక్షల నుంచి 12.52 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.

Tata Altroz Racer : టాటా ఆల్ట్రోజ్​ రేసర్​ లాంచ్​ డేట్​పై ఇంకొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పూర్తి వివరాలపై.. లాంచ్​ టైమ్​ నాటికి క్లారిటీ వస్తుంది. ఏది ఏమైనా.. హ్యాచ్​బ్యాక్​ సెగ్మెంట్​లో ఆల్ట్రోజ్​ రేసర్​పై టాటా మోటార్స్​ భారీ అంచనాలు పెట్టుకుంది. అటు ఎస్​యూవలతో పాటు హ్యాచ్​బ్యాక్​ సెగ్మెంట్​పై పట్టు సాధించాలని ప్లాన్​ చేస్తున్న సంస్థకు.. టాటా ఆల్ట్రోజ్​ రేసర్​ కీలకంగా మారనుంది.

Whats_app_banner

సంబంధిత కథనం