Tata Altroz CNG vs Maruti Baleno CNG : టాటా ఆల్ట్రోజ్- మారుతీ బలెనో.. ఈ ‘సీఎన్జీ’ల్లో ఏది బెస్ట్?
Tata Altroz iCNG vs Maruti Suzuki Baleno S CNG : టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ, మారుతీ సుజుకీ బలెనో సీఎన్జీ.. ఈ రెండిట్లో ఏది బెస్ట్? ఇక్కడ తెలుసుకోండి..

Tata Altroz iCNG vs Maruti Suzuki Baleno S CNG : మార్కెట్లో సీఎన్జీ మోడల్స్‌కి కూడా మంచి డిమాండ్ కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఆటోమొబైల్ సంస్థలు సీఎన్జీ మోడల్స్‌పై దృష్టి సారించాయి. తాజాగా.. టాటా మోటార్స్ నుంచి టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ బయటకొచ్చింది. రూ. 21వేల టోకెన్ అమౌంట్‌తో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ మోడల్.. మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్‌గా ఉన్న మారుతీ సుజుకీ బలెనో ఎస్- సీఎన్జీకి గట్టిపోటీనిస్తుంది అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండిట్లో ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ వర్సెస్ మారుతీ సుజుకీ బలెనో ఎస్- సీఎన్జీ- లుక్స్..
టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీలో స్కల్ప్టెడ్ హుడ్, స్వెప్ట్ బ్యాక్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్తో కూడిన బంపర్ మౌంటెడ్ ఫాగ్ ల్యాంప్స్, బ్లాక్డ్- ఔట్ గ్రిల్, వ్రాప్ అరౌండ్ టెయిల్‌ల్యాంప్స్ వంటివి వస్తున్నాయి.
Tata Altroz CNG on road price in Hyderabad : టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ పొడవు 3,990ఎంఎం. వెడల్పు 1,755ఎంఎం. ఎత్తు 1,523ఎంఎం. వీల్‌బేస్ వచ్చేసి 2,501ఎంఎం ఉంటుంది.
ఇక మారుతీ సుజుకీ ఎస్-సీఎన్జీలో స్కల్ప్టెడ్ బానెట్, క్రోమ్ సరౌండింగ్ మెష్ గ్రిల్, వైడ్ ఎయిర్ డ్రమ్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్తో కూడిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఇండికేటర్ మౌంటెడ్ ఓఆర్వీఎంలు, ఫ్లేర్స్ వీల్ ఆర్చీస్, వ్రాప్ అరౌండ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ లభిస్తున్నారు.
Maruti Suzuki Baleno S CNG features : మారుతీ సుజుకీ బలెనో సీఎన్జీ మోడల్ పొడవు 3,990ఎంఎం. వెడల్పు 1,745ఎంఎం. ఎత్తు 1,500 ఎంఎం. వీల్‌బేస్ 2,520ఎంఎం ఉంటుంది.
ఈ రెండు మోడల్స్‌లోనూ 16 ఇంచ్ డిజైనర్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి.
టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ వర్సెస్ మారుతీ సుజుకీ బలెనో ఎస్- సీఎన్జీ.. ఫీచర్స్
Tata Altroz CNG features : టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీలో డ్యూయెల్ టోన్ డాష్‌బోర్డ్, ఫాబ్రిక్ అప్‌హోలిస్ట్రీ, కీలెస్ ఎంట్రీ, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, సెమీ- డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 7 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్ ప్యానెల్ లభిస్తున్నాయి.
ఇక మారుతీ సుజుకీ బలెనో సీఎన్జీలో డ్యూయెల్ టోన్ బ్లాక్- బ్లూ డాష్‌బోర్డ్, లెథరెట్ అప్‌హోలిస్ట్రీ, హెడ్ అప్ డిస్ప్లే, కీలెస్ ఎంట్రీ, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 9 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్ వస్తున్నాయి.
ఈ రెండిట్లోనూ మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.
టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ వర్సెస్ మారుతీ సుజుకీ బలెనో ఎస్- సీఎన్జీ ఇంజిన్..
Tata Altroz CNG mileage : టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీలో 1.2 లీటర్ రెవొట్రాన్, బై ఫ్యూయెల్ ఇంజిన్ ఉంది. ఇది 76 హెచ్‌ప పవర్‌ను, 97ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఇక మారుతీ సుజుకీ బలెనో సీఎన్జీలో 1.2 లీటర్, ఇన్లైన్ 4 సిలిండర్, కే సిరీస్ ఇంజిన్ ఉంది. ఇది 76.4 హెచ్‌పీ పవర్‌ను, 98.5ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఈ రెండిట్లోనూ 5 స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంది.
టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ వర్సెస్ మారుతీ సుజుకీ బలెనో ఎస్- సీఎన్జీ.. ధర
Maruti Suzuki Baleno CNG on road price Hyderabad : మారుతీ సజుకీ బలెనో ఎస్-సీఎన్జీ ఎక్స్‌షోరూం ధర రూ. 8.35లక్షలు- రూ. 9.28లక్షల మధ్యలో ఉంది. ఇక టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ ఎక్స్‌షోరూం ధర రూ. 7.3లక్షలుగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి.
సంబంధిత కథనం