ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ప్రీమియం హ్యచ్బ్యాక్గా గుర్తింపు తెచ్చుకున్న టాటా ఆల్ట్రోజ్‌కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ రాబోతోంది. మే 22న ఈ మోడల్ లాంచ్కానుంది. 2020లో తొలిసారి బయటకు వచ్చినప్పటి నుంచి ఈ కారుకు ఇదే బిగ్గెస్ట్ అప్‌గ్రేడ్! కాగా ఈ హ్యాచ్‌బ్యాక్‌ని టాటా మోటార్స్ ఇప్పటికే ఆవిష్కరించింది. 2025 ఆల్ట్రోజ్ స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, అకంప్లీష్డ్ ఎస్, అంకప్లీష్డ్ + ఎస్ అనే ఐదు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో వేరియంట్లు, వాటిల్లో లభిస్తున్న ఫీచర్ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
2025 టాటా ఆల్ట్రోజ్ లైనప్ స్మార్ట్ వేరియంట్‌తో ప్రారంభమవుతుంది. స్మార్ట్ బేస్ లెవల్ సేఫ్టీ, బేసిక్ డిజైన్ ఫీచర్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మోడల్ పూర్తి భద్రతా ప్యాకేజీ, 6 ఎయిర్ బ్యాగులు, ఈఎస్పీ వస్తుంది, ఇది డ్రైవర్‌కి మరింత నమ్మకాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది.
ఎక్స్టీరియర్ హైలైట్స్‌లో ప్రొజెక్టర్ హాలోజెన్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, స్లీక్ ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఎంట్రీ- ఎగ్జిట్ కోసం 90 డిగ్రీలు తెరుచుకునే డోర్స్ని ఇచ్చింది టాటా మోటార్స్. ఈ స్మార్ట్ వేరియంట్లో టాటా లోగోతో కూడిన స్మార్ట్ డిజిటల్ స్టీరింగ్ వీల్, లోపల ప్రత్యేకమైన 3డీ ఫ్రంట్ గ్రిల్ ఉన్నాయి.
స్టార్ వేరియంట్‌తో పోలిస్తే ప్యూర్ వెర్షన్లో కంఫర్ట్, కన్వీనియన్స్ ఫీచర్లు పెరిగాయి. ఇందులో హర్మన్ నుంచి 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. ఇది ఇన్-కార్ ఎంటర్టైన్మెంట్, కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ప్యూర్ వెర్షన్లో ఆటో-ఫోల్డ్ ఎక్స్టర్నల్ రేర్ వ్యూ మిర్రర్స్ (ఓఆర్వీఎమ్), సౌకర్యవంతమైన క్యాబిన్ వాతావరణం కోసం క్లిమా టచ్‌తో ఆటో క్లైమేట్ కంట్రోల్, మెరుగైన ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి.
ఈ కారులో రేర్ వ్యూ కెమెరా కూడా ఉంది. డ్రైవర్ సౌకర్యం కోసం హైట్- అడ్జెస్టెబుల్ సీటును ఇచ్చింది టాటా మోటార్స్. రిలాక్స్డ్ హైవే క్రూయిజింగ్ కోసం, క్రూయిజ్ కంట్రోల్ ప్యాకేజీలో భాగం. వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా ఈ వేరియంట్లో ఉంది.
టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ క్రియేటివ్ వేరియంట్ మరింత అధునాతన సాంకేతికత, అప్ మార్కెట్ స్టైలింగ్ అంశాలతో ఆల్ట్రోజ్ అనుభవాన్ని మరింత ముందుకు తీసుకువెళుతుంది. ఇది ప్యూర్ వేరియంట్లోని ఫీచర్లతో పాటు 360 డిగ్రీల హెచ్డీ సరౌండ్ వ్యూ సిస్టెమ్‌ను కలిగి ఉంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్‌ను అల్ట్రా వ్యూ 10.25 ఇంచ్ హెచ్డీ యూనిట్‌కు హర్మన్ అప్‌గ్రేడ్ చేసింది. లుమినేట్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్తో లైటింగ్ మెరుగుపడుతుంది.
పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ సిస్టెమ్తో సౌలభ్యాన్ని మరింత మెరుగుపరిచింది టాటా మోటార్స్. ఎక్స్టీరియర్ ఆర్16 హైపర్ స్టైల్ డ్యూయెల్-టోన్ వీల్స్ (ఇవి స్టైలైజ్డ్ స్టీల్ వీల్స్) తో స్పోర్టియర్ లుక్‌ను పొందుతాయి. వెనుక ప్రయాణీకుల కోసం రేర్ ఏసీ వెంట్లు ఉన్నాయి. గెలాక్సీ యాంబియంట్ లైటింగ్ ద్వారా క్యాబిన్ పరిసరాలు మెరుగుపడతాయి. వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ క్రియేటివ్ ట్రిమ్‌లో ఆప్షనల్ ఫీచర్‌గా ఉంది.
టాటా ఆల్ట్రోజ్ క్రియేటివ్ వేరియంట్ కంటే ఎక్కువ ప్రీమియం ఫీచర్లు, విలక్షణమైన కాస్మెటిక్ అప్గ్రేడ్లను ఇందులో ఇచ్చింది సంస్త. ఈ ట్రిమ్ లెవల్ స్టైలిష్ డ్రాగ్ కట్ ఆర్ 16 అల్లాయ్ వీల్స్‌పై ప్రయాణిస్తుంది. డ్రైవర్ సమాచారం 7 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌పై డిస్ప్లే అవుతుంది. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో మెరుగైన విజిబిలిటీ కోసం, LED ఫాగ్ ల్యాంప్‌లు ఇచ్చింది.
వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఈ వేరియంట్ నుంచి ప్రామాణిక ఫీచర్‌గా మారుతుంది. క్యూఐ సపోర్ట్ ఉన్న వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్‌తో ఆధునిక సౌలభ్యాన్ని పెంచింది టాటా మోటార్స్ ఇన్ఫినిటీ ఎల్ఈడీ కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్‌తో వెనుక డిజైన్ని మరింత మెరుగుపరింది.
టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌లో టాప్ ఎండ్ వేరియంట్ ఈ అకంప్లీష్డ్+ ఎస్. లోయర్ ట్రిమ్స్‌లోని ఫీచర్లు అన్నీ ఇందులో ఉన్నాయి. అదనంగా అధునాతన కనెక్టెడ్ కార్ టెక్నాలజీ. అప్‌గ్రేడెడ్ డిస్ప్లేలను కలిగి ఉంది. ఐఆర్ఏ కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో కనెక్టెడ్ ఫీచర్ల ప్యాకేజీని అందిస్తోంది.
హ్యాచ్‌బ్యాక్‌లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది అల్ట్రా వ్యూ 10.25 ఇంచ్ హెచ్డీ యూనిట్. ఇంటిగ్రేటెడ్ నావిగేషన్ కోసం ఇన్-బిల్ట్ మ్యాప్ వ్యూను కలిగి ఉంది. ఇన్ బిల్ట్ బ్లైండ్ స్పాట్ మానిటర్‌తో భద్రత కూడా మెరుగుపడుతుంది. ప్రీమియం ఆడియో అనుభవం కోసం, ఆడియోవోర్ఎక్స్ కస్టమైజబుల్ ఆడియో మోడ్స్ ఉన్నాయి. ఎయిర్ ప్యూరిఫైయర్ ఆరోగ్యకరమైన క్యాబిన్ వాతావరణాన్ని అందించడంలో సహాయపడుతుంది. ఎస్ఓఎస్ కాలింగ్ ఫంక్షన్ (ఈ-కాల్/బీ-కాల్) అత్యవసర పరిస్థితుల్లో అదనపు భద్రతను అందిస్తుంది.
ఈ వేరియంట్ల ధరలు వంటి వివరాలు లాంచ్ టైమ్ నాటికి అందుబాటులోకి వస్తాయి.
సంబంధిత కథనం