సరికొత్తగా టాటా ఆల్ట్రోజ్​- ప్రీమియం హ్యాచ్​బ్యాక్​ ఫేస్​లిఫ్ట్​ వివరాలు..-tata altroz facelift unveiled ahead of its launch check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  సరికొత్తగా టాటా ఆల్ట్రోజ్​- ప్రీమియం హ్యాచ్​బ్యాక్​ ఫేస్​లిఫ్ట్​ వివరాలు..

సరికొత్తగా టాటా ఆల్ట్రోజ్​- ప్రీమియం హ్యాచ్​బ్యాక్​ ఫేస్​లిఫ్ట్​ వివరాలు..

Sharath Chitturi HT Telugu

టాటా ఆల్ట్రోజ్ ఫేస్​లిఫ్ట్ హ్యాచ్​బ్యాక్​కి ప్రస్తుత మోడల్ కంటే మరింత ప్రీమియం అనుభూతిని కలిగించడానికి అనుగుణంగా మార్పులు చేసింది టాటా మోటార్స్​. ఈ మోడల్​ని తాజాగా రివీల్​ చేసింది. ఈ నేపథ్యంలో టాటా ఆల్ట్రోజ్​ ఫేస్​లిఫ్ట్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

టాటా ఆల్ట్రోజ్ ఫేస్​లిఫ్ట్​

టాటా ఆల్ట్రోజ్ ఫేస్​లిఫ్ట్ మే 22న లాంచ్​కు రెడీ అవుతోంది. కాగా ఈ మోడల్​ని టాటా మోటార్స్​ తాజాగా ఆవిష్కరించింది. 2020లో లాంచ్​ అయినప్పటి నుంచి ప్రీమియం హ్యాచ్​బ్యాక్​ అందుకున్న తొలి ఫేస్​లిఫ్ట్​ ఇదే కావడంతో లేటెస్ట్​ మోడల్​పై భారీ అంచనాలే ఉన్నాయి. కొత్త ఆల్ట్రోజ్ ప్యూర్, క్రియేటివ్, అచీవ్డ్ ఎస్, ఎక్వైర్డ్ + ఎస్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో టాటా ఆల్ట్రోజ్​ ఫేస్​లిఫ్ట్​పై పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా ఆల్ట్రోజ్​ ఫేస్​లిఫ్ట్​..

టాటా ఆల్ట్రోజ్ ఫేస్​లిఫ్ట్ గణనీయంగా అప్డేటెడ్​ డిజైన్ లాంగ్వేజ్​తో వస్తుంది. ముందు భాగంలో డబుల్ బ్యారెల్ ఎల్ఈడీ లైట్లతో పాటు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ట్విన్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. ఇది విస్తృతమైన ఎయిర్ ఇన్​టేక్​తో రీవ్యాంప్డ్​ ఫ్రెంట్ బంపర్​ను కూడా పొందుతుంది. డిజైన్ ఫిలాసఫీ హారియర్, సఫారీలతో సరిపోలుతుంది.

హ్యాచ్​బ్యాక్​ ఎల్ఈడీ టెయిల్​లైట్లు వెనుక భాగంలో సొగసైన ఎల్ఈడీ స్ట్రిప్​తో కనెక్ట్ చేసి ఉంటాయి. వెనుక బంపర్ కూడా రివైజ్డ్​ డిజైన్​తో వస్తుంది. ఇతర స్టైలింగ్ ఎలిమెంట్లలో ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ ఉంటాయి. ఇది ప్రీమియం హ్యాచ్​బ్యాక్ సెగ్మెంట్లో మొదటిది. కొత్త డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ వస్తున్నాయి.

ఆసక్తికరంగా, టాటా ఆల్ట్రోజ్​ ఫేస్​లిఫ్ట్​ లో-ఎండ్​ వేరియంట్లు స్టీల్ చక్రాలను పొందుతుండగా, క్రియేటివ్ ట్రిమ్ స్థాయి నుంచి ప్రారంభమయ్యే వేరియంట్లు 16 ఇంచ్​ అల్లాయ్ వీల్స్​తో వస్తున్నాయి. క్రియేటివ్ ట్రిమ్ లెవల్​లో 16 ఇంచ్​ హైపర్ స్టైల్ డ్యూయెల్ టోన్ వీల్స్ లభించనుండగా, టాప్ రెండు వేరియంట్లలో డ్రాగ్ కట్ ఆర్ 16 అల్లాయ్ వీల్స్ ఉంటాయి.

ఆల్ట్రోజ్ ఫేస్​లిఫ్ట్ ఐదు కలర్ ఆప్షన్లను పొందుతుంది. అవి.. డ్యూన్ గ్లో, ఎంబర్ గ్లో, ప్యూర్ గ్రే, రాయల్ బ్లూ, ప్రిస్టీన్ వైట్

టాటా ఆల్ట్రోజ్ ఫేస్ లిఫ్ట్: క్యాబిన్- ఫీచర్లు..

ఆల్ట్రోజ్ క్యాబిన్ అదే సిల్హౌట్​ని నిలుపుకుంటూనే పెద్ద మార్పులను చూస్తుంది. ఇందులో డ్యూయెల్ టోన్ థీమ్- లేత గోధుమ, లేత బూడిద రంగుల మిశ్రమం ఉంటుంది. టాటా హారియర్, సఫారీ కార్లను పోలిన ఫ్రెంట్ సీట్ల డిజైన్ కూడా మారింది.

ముందు భాగంలో, ఆల్ట్రోజ్ ఫేస్​లిఫ్ట్​లో కొత్త గ్రాండ్ ప్రెస్టిజియా డ్యాష్​బోర్డ్​ను కలిగి ఉంది. ఇది రెండు 10.25 ఇంచ్​ స్క్రీన్లను కలిగి ఉంది. టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టెమ్, డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్​ కోసం ఇవి ఉన్నాయి. అయితే ఈ డ్యాష్​బోర్డు బ్లాక్ అండ్ బీజ్ కలర్ థీమ్​ను కలిగి ఉంది. ఇతర ఫీచర్ల విషయానికొస్తే, ఆల్ట్రోజ్ 360 డిగ్రీల కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఐఆర్ఏ కనెక్టెడ్ వెహికల్ టెక్, ఎయిర్ ప్యూరిఫైయర్, వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్​రూఫ్, యాంబియంట్ లైటింగ్ వంటివి ఉన్నాయి.

టాటా ఆల్ట్రోజ్ ఫేస్​లిఫ్ట్: స్పెసిఫికేషన్లు..

కార్ల తయారీదారు ఇంజిన్ ఎంపికలను వెల్లడించనప్పటికీ, టాటా ఆల్ట్రోజ్ ఫేస్​లిఫ్ట్ ప్రస్తుత మోడల్​లో ఉన్న ఇంజన్లతో పనిచేస్తుందని అంచనాలు ఉన్నాయి. ఆల్ట్రోజ్ ఫేస్​లిఫ్ట్ పవర్ట్రెయిన్ ఎంపికలలో 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మోటార్, 1.2-లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్, ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో 1.2-లీటర్ పెట్రోల్-సీఎన్జీ బై-ఫ్యూయల్ యూనిట్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో అమ్మకానికి ఉన్న ఏకైక డీజిల్ హ్యాచ్​బ్యాక్ ఆల్ట్రోజ్ కావడం విశేషం.

టాటా ఆల్ట్రోజ్​ ధర సహా ఇతర వివరాలు లాంచ్​ నాటికి అందుబాటులోకి వస్తాయి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం