టాటా ఆల్ట్రోజ్ ఫేస్​లిఫ్ట్​పై బిగ్​ అప్డేట్​- ఈ పాప్యులర్​ హ్యాచ్​బ్యాక్​ లాంచ్​ ఎప్పుడంటే..-tata altroz facelift to be launched on may 22 see full details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  టాటా ఆల్ట్రోజ్ ఫేస్​లిఫ్ట్​పై బిగ్​ అప్డేట్​- ఈ పాప్యులర్​ హ్యాచ్​బ్యాక్​ లాంచ్​ ఎప్పుడంటే..

టాటా ఆల్ట్రోజ్ ఫేస్​లిఫ్ట్​పై బిగ్​ అప్డేట్​- ఈ పాప్యులర్​ హ్యాచ్​బ్యాక్​ లాంచ్​ ఎప్పుడంటే..

Sharath Chitturi HT Telugu

టాటా ఆల్ట్రోజ్​ ఫేస్​లిఫ్ట్​పై బిగ్​ అప్డేట్​. ఈ మోడల్​ లాంచ్​ డేట్​ బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో టాటా ఆల్ట్రోజ్​ ఫేస్​లిఫ్ట్​పై ఉన్న అంచనాలతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా ఆల్ట్రోజ్​ ఫేస్​లిఫ్ట్​

టాటా ఆల్ట్రోజ్ అమ్మకానికి వచ్చిన ఐదు సంవత్సరాల తరువాత, త్వరలో దాని మిడ్-లైఫ్ సైకిల్ అప్​డేట్​ని అందుకోవడానికి సిద్ధంగా ఉంది. టాటా ఆల్ట్రోజ్​ ఫేస్​లిఫ్ట్​ని మే 22, 2025న మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఈ హ్యాచ్​బ్యాక్ ఎక్స్​టీరియర్, ఇంటీరియర్​లో కీలక మార్పులు ఉంటాయని తెలుస్తోంది. వాస్తవానికి ఆల్ట్రోజ్​ ఇప్పటికే పలు అప్డేట్స్​ని పొందినప్పటికీ, ఈ ఓవరాల్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​తో ఈ కారు మరింత అట్రాక్టివ్​గా మారుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

టాటా ఆల్ట్రోజ్ ఫేస్​లిఫ్ట్: అంచనాలు..

ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ హ్యాచ్​బ్యాక్స్​లో టాటా ఆల్ట్రోజ్​ ఒకటి. ఇక ఇప్పుడు టాటా ఆల్ట్రోజ్ ఫేస్​లిఫ్ట్ హ్యాచ్​బ్యాక్ సిల్హౌట్​లో ఎక్కువ మార్పులు లేకుండా విజువల్, ఫీచర్ అప్​గ్రేడ్​లతో వచ్చే అవకాశం ఉంది. రివైజ్డ్ గ్రిల్, హెడ్​ల్యాంప్స్, టెయిల్ లైట్లు, రివైజ్డ్​ బంపర్లతో కొత్త స్టైలింగ్ ఆశించవచ్చు. క్యాబిన్ మరింత విస్తృతమైన అప్​గ్రేడ్​లను చూడొచ్చు. ఇందులో కొత్త యూజర్ ఇంటర్​ఫేస్​తో కూడిన పెద్ద ఇన్ఫోటైన్​మెంట్ సిస్టెమ్, కొత్త ఇన్​స్ట్రుమెంట్ కన్సోల్, ఎయిర్-కాన్ వెంట్​లతో రివైజ్​ చేసిన డ్యాష్​బోర్డ్ ఉంటాయి. వెంటిలేటెడ్ సీట్లు, 360 డిగ్రీల కెమెరా, ఎలక్ట్రిక్ సన్​రూఫ్, కొత్త సీట్ అప్​హోల్​స్టరీ, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్​ ప్లే వంటి ఫీచర్లతో ప్రీమియం ఫీల్​ మెరుగుపడుతుంది.

టాటా ఆల్ట్రోజ్ ఫేస్​లిఫ్​ట్​ స్పెసిఫికేషన్లు..

టాటా ఆల్ట్రోజ్​ ఫేస్​లిఫ్ట్​లో ఇప్పటికే ఉన్న ఇంజిన్​ కొనసాగుతుందని అంచనాలు ఉన్నాయి. ఇందులో 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ (ఎన్ఏ) పెట్రోల్, 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి. డీజిల్ ఇంజిన్ పొందిన ఏకైక హ్యాచ్​బ్యాక్​ ఈ టాటా ఆల్ట్రోజ్​. ఇందులో 1.5-లీటర్ ఇంజిన్​ కొనసాగవచ్చు. టాటా తన ట్విన్ సిలిండర్ సీఎన్జీ టెక్నాలజీని ఆల్ట్రోజ్​లో అందిస్తుంది. ఇది 1.2-లీటర్ ఎఏ పెట్రోల్ మోటారుతో కనెక్ట్​ చేసి ఉంటుంది. ట్రాన్స్​మిషన్​ ఆప్షన్లలో పవర్ట్రెయిన్​ని బట్టి 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, డీసీటీ ఉంటాయి..

టాటా ఆల్ట్రోజ్ ఫేస్​లిఫ్ట్:

తాజా అప్​డేట్​తో టాటా ఆల్ట్రోజ్​ హ్యాచ్​బ్యాక్​ ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. కొత్త ఆల్ట్రోజ్ ఫేస్​లిఫ్ట్.. హ్యుందాయ్ ఐ20, మారుతీ సుజుకీ బాలెనో, టయోటా గ్లాంజాలకు పోటీగా ఉంటుంది. గత ఏడాది అమ్మకానికి వచ్చిన ఆల్ట్రోజ్ రేసర్ కూడా ఇప్పుడు అప్​డేట్​ను అందుకుంటుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

టాటా ఆల్ట్రోజ్ ఫేస్​లిఫ్ట్ ఈ సంవత్సరం ఆటోమొబైల్ సంస్థ ప్లాన్ చేసిన అనేక లాంచ్​లలో ఒకటి. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్​పో 2025లో ప్రదర్శించిన హారియర్ ఈవీ, సరికొత్త సియెర్రా ఐసీఈ, ఈవి సహా మరిన్ని మోడళ్లను ప్రవేశపెట్టడానికి కంపెనీ సన్నద్ధమవుతోంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం