Suzuki E Access : 95 కిలోమీటర్ల రేంజ్ అందించే సుజుకి ఈ యాక్సెస్ బ్యాటరీ, ఫీచర్లపై ఓ లుక్కేయండి
Suzuki E Access : సుజుకి ఇటీవలే తన ఎలక్ట్రిక్ వేరియంట్ స్కూటర్‌ను ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించిన విషయం తెలిసిందే. 95 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఈ స్కూటీ బ్యాటరీ, ఫీచర్ల గురించి చూద్దాం..
సుజుకి మోటర్ సైకిల్ ఇండియా ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టింది. ఆటో ఎక్స్ పోలో సుజుకి ఈ యాక్సెస్‌ను ప్రదర్శించింది. సుజుకికి ఇప్పటికే భారత మార్కెట్‌లో మంచి పేరు ఉంది. సుజుకి ఈ యాక్సెస్ కూడా మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తే మంచి అమ్మకాలు చేసే అవకాశ ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ రంగంలోకి ప్రవేశించడం ద్వారా మరింత మంది వినియోగదారులను ఆకర్షించే లక్ష్యంతో వచ్చింది.

ఈ స్కూటర్ పెట్రోల్ పవర్డ్ వెర్షన్‌లో ఉన్న ప్లాట్‌ఫారమ్‌లోనే తయారుచేశారు. ఇది దాదాపుగా కంపెనీ ఇంధనంతో నడిచే మోడల్ యాక్సెస్ వెర్షన్‌లా కనపడుతుంది. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జింగ్‌తో 95 కిలో మీటర్ల రేంజ్ అందిస్తుంది. టాప్ స్పీడ్ దాదాపు గంటకు 70 కిలో మీటర్ల పైనే. ఈ స్కూటర్ 2025 మధ్యలో మార్కెట్‌లోకి వస్తుందని అంటున్నారు.
బ్యాటరీ
కొత్త సుజుకి ఈ యాక్సెస్ స్థిరమైన బ్యాటరీని కలిగి ఉంది. రిమూవబుల్ బ్యాటరీల వలె కాకుండా తీసుకొస్తుంది. స్కూటర్ ఎక్కువ సీట్ స్టోరేజీని పొందుతుంది. దీని బ్యాటరీ సాధారణ ఛార్జర్‌పై 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 4 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. ఫాస్ట్ ఛార్జర్‌తో 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 1 గంట 12 నిమిషాలు పడుతుంది. ఈ స్కూటర్‌లో ఎకో, రైడ్ ఎ, రైడ్ బి అనే 3 రైడింగ్ మోడ్‌లు కూడా ఉన్నాయి.
ఇది 3.07kW ఫిక్స్‌డ్ బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్‌పై 95కిమీల రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ 4.1 kW మోటార్‌తో 71 కేఎంపీహెచ్ గరిష్ట వేగాన్ని అందుకోగలదు. స్కూటర్ టెలిస్కోపిక్ ఫోర్క్, ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ సెటప్‌ను పొందుతుంది. సుజుకి ఫిక్స్‌డ్ బ్యాటరీ ప్యాక్‌ని ఎంచుకోవడంతో ఇది స్కూటర్ అందించే అండర్ సీట్ స్టోరేజీని పెంచడంలో కొంత సహాయపడింది.
ఫీచర్లు
ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో టీఎఫ్‌టీ కన్సోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్/ఎస్ఎంఎస్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సుజుకి ఈ యాక్సెస్ టర్న్ ఇండికేటర్, దీర్ఘచతురస్రాకార ఎల్ఈడీ హెడ్ లైట్, డీఆర్ఎల్‌లు, పెద్ద అండర్ సీట్ స్టోరేజ్‌తో స్టైలిష్‌గా కనిపిస్తుంది.
కొత్త యాక్సెస్ ఏతర్, ఓలా ఎస్1, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, హోండా యాక్టివా ఈ లాంటి ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ పడుతుంది.