T+0 settlement : మదుపర్లు- ట్రేడర్స్​కు అలర్ట్​.. మార్చ్​ 28 నుంచి టీ+0 సెటిల్మెంట్​!-t0 settlement to begin by march 28 on optional basis says sebi chairperson ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  T+0 Settlement To Begin By March 28 On Optional Basis, Says Sebi Chairperson

T+0 settlement : మదుపర్లు- ట్రేడర్స్​కు అలర్ట్​.. మార్చ్​ 28 నుంచి టీ+0 సెటిల్మెంట్​!

Sharath Chitturi HT Telugu
Mar 11, 2024 02:59 PM IST

T+0 settlement Sebi : T+0 settlement : మదుపర్లు- ట్రేడర్స్​కు అలర్ట్! మార్చ్​ 28 నుంచి ఆప్షనల్​ బేసిస్​ కింద టీ+0 సెటిల్మెంట్​ సైకిల్​ అమల్లోకి రానుంది. ఆ వివరాలు..

మార్చ్​ 28 నుంచి టీ+0 సెటిల్మెంట్​!
మార్చ్​ 28 నుంచి టీ+0 సెటిల్మెంట్​!

T+0 settlement in India : టీ+0 సెటిల్మెంట్​పై కీలక అప్డేట్​ ఇచ్చారు సెబీ (సెక్యూరిటీస్​ అండ్​ ఎక్స్​ఛేంజ్​ బోర్డ్​ ఆఫ్​ ఇండియా) ఛైర్మన్​ మధాబి పూరి బచ్​. మార్చ్​ 28 నుంచి.. ఆప్షనల్​ బేసిస్​ కింద ఈ టీ+0 సెటిల్మెంట్​ని అమలు చేయనున్నట్టు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

మహిళా ఫండ్​ మేనేజర్​లను సత్కరించేందుకు సోమవారం ఏర్పాటు చేసిన ఐఎంఎఫ్​ఐ ఈవెంట్​లో పాల్గొన్నారు సెబీ ఛైర్మన్​. ఈ నేపథ్యంలో.. టీ+0 సెటిల్మెంట్​పై కీలక వ్యాఖ్యలు చేశారు.

"మార్చ్​ 28 నుంచి ఆప్షనల్​ బేసిస్​ కింద ఇండియన్​ స్టాక్​ మార్కెట్​లో టీ+0 సెటిల్మెంట్​ని అమలు చేస్తాము. 2025 మార్చ్​, అంటే ఇంకో ఏడాది కాలంలో.. ఇన్​స్టెంట్​ సెటిల్మెంట్​ సైకిల్​ని తీసుకొస్తాము," అని తెలిపారు మధాబి పూరి.

T+0 settlement news : ఇండియా స్టాక్​ మార్కెట్​లో ప్రస్తుతం టీ+1 (ట్రేడ్​+1) సెటిల్మెంట్​ సిస్టెమ్​ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.

"రెగ్యులేటరీ మార్కెట్​ కాంపిటీటివ్​గా ఉండేందుకు, మదుపర్లు, ట్రేడర్లకు అడ్వాంటేజ్​ లభించేందుకు ఈ టీ+0 సెటిల్మెంట్​ని తీసుకురావాలని చూస్తున్నాము," అని సెబీ ఛైర్మన్​ స్పష్టం చేశారు.

స్టాక్​ మార్కెట్​ ట్రేడ్స్​లో సేమ్​-డే సెటిల్మెంట్​ ప్రక్రియను అమలు చేసేందుకు డిసెంబర్​ 2023లో కన్సల్టెంట్​ పేపర్​ని తీసుకొచ్చింది సెబీ. దశల వారీగా దీనిని అమలు చేయాలని చూస్తున్నట్టు వెల్లడించింది.

మొదటి దశలో భాగంగా.. మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు జరిగే ట్రేడ్స్​లో.. అదే రోజు 4 గంటల 30 నిమిషాలలోపు ఫండ్స్​ సెటిల్మెంట్​ పూర్తయిపోతుంది.

Stock market news today : రెండో ఫేజ్​లో భాగంగా.. ఆప్షనల్​ బేసిస్​ కింద ట్రేడ్​-బై- ట్రేడ్​ సెటిల్మెంట్​ జరుగుతుంది. అంటే.. 3 గంటల 30 నిమిషాల వరకు తీసుకునే ట్రేడ్స్​కి వెంటనే సెటిల్మెంట్​ జరిగిపోతుంది!

ప్రపంచంలో చాలా తక్కువ దేశాల్లోనే ఈ టీ+0 సెటిల్మెంట్​ సైకిల్​ అమల్లో ఉంది!

వాస్తవానికి.. 2002 వరకు ఇండియా స్టాక్​ మార్కెట్​లో టీ+5 సెటిల్మెంట్​ సిస్టెమ్​ అమల్లో ఉండేది! అంటే.. సెటిల్మెంట్​ కోసం ట్రేడ్​ తీసుకున్న రోజులతో పాటు ఐదు రోజులు ఎదురు చూడాల్సి వచ్చేది. దానిని 2003లో టీ+2కి తీసుకొచ్చింది సెబీ. ఇక 2032 జనవరి నాటికి టీ+1 సెటిల్మెంట్​ సైకిల్​ అమల్లోకి వచ్చింది. ఇప్పుడు.. టీ+0 వైపు శరవేగంగా అడుగులు వేస్తోంది.

క్రిప్టోకరెన్సీ వంటి ప్రత్యామ్నాయ అన్​-రెగ్యులేటెడ్​ ఇన్​వెస్ట్​మెంట్స్​కి డిమాండ్​ పెరుగుతున్న సమయంలో.. మదుపర్లు, ట్రేడర్లకు ఈ టీ+0 సెటిల్మెంట్​ సైకిల్​ ప్రయోజనకరంగా ఉంటుందని సెబీ భావిస్తోంది.

స్టాక్​ మార్కెట్​ టైమింగ్స్​లో మార్పు..!

Stock market timings change : ఇక స్టాక్​ మార్కెట్​ టైమింగ్స్​ని 3:30 కన్నా ఎక్స్​టెండ్​ చేసేందుకు కూడా సెబీ ప్రయత్నిస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే.. ఇది క్యాష్​ మార్కెట్​కి కాదు. కేవలం ఎఫ్​ అండ్​ ఓ ట్రేడింగ్​కి మాత్రమే! ఎక్స్​టెండ్​ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బ్రోకరేజ్​ సంస్థలు ఇప్పటికే స్పష్టం చేశాయి. కానీ ఇటీవలి కాలంలో దీనిపై ఎలాంటి అప్డేట్​ లేదు.

WhatsApp channel

సంబంధిత కథనం