Suzuki V-Strom 800DE: సుజుకి నుంచి మరో అడ్వెంచర్ బైక్-suzuki v strom 800de adv showcased at eimca 2022 here s all you need to know ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Suzuki V-strom 800de Adv Showcased At Eimca 2022: Here`s All You Need To Know

Suzuki V-Strom 800DE: సుజుకి నుంచి మరో అడ్వెంచర్ బైక్

HT Telugu Desk HT Telugu
Nov 09, 2022 08:53 PM IST

Suzuki V-Strom 800DE: ఆటోమెబైల్ దిగ్గజం సుజుకి నుంచి కొత్త అడ్వెంచర్ బైక్ మార్కెట్లోకి రాబోతోంది. 776 సీసీ పవర్ ఫుల్, లిక్విడ్ కూల్డ్, ప్యారెలల్ ట్విన్ యూనిట్ ఇంజిన్ తో ఈ స్టైలిష్ బైక్ రూపుదిద్దుకుంది.

సుజుకీ నుంచి వచ్చిన కొత్త అడ్వెంచర్ బైక్  V-Strom 800DE
సుజుకీ నుంచి వచ్చిన కొత్త అడ్వెంచర్ బైక్ V-Strom 800DE (Suzuki)

Suzuki V-Strom 800DE: Suzuki Motor Corporation నుంచి వస్తున్న మరో అడ్వెంచర్ బైక్ ఇది. 6 స్పీడ్ గేర్ డిజైన్ తో వస్తున్న ఈ బైక్ 83 bhp of max power at 8,500 rpm ను ప్రొడ్యూస్ చేయగలదు. టార్క్ ఔట్ పుట్ ను సంస్థ ఇంకా వెల్లడించలేదు.

ట్రెండింగ్ వార్తలు

Suzuki V-Strom 800DE: సుజుకి వీ స్ట్రోమ్ 800 డీఈ(V-Strom 800DE)

సుజుకి నుంచి వస్తున్న మరో అడ్వెంచర్ బైక్ V-Strom 800DE. ఇది ఇప్పటికే సుజుకీ రిలీజ్ చేసిన V-Strom 1050 , V-Strom 650ల మధ్య స్పెసిఫికేషన్స్ తో ఉంటుంది. ఈ మోడల్ అమ్మకాలు ఉత్తర అమెరికాలో, అలాగే యూరోప్ లో వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ప్రారంభం అవుతాయి. భారతీయ మార్కెట్లోకి ఈ మోడల్ ఎప్పుడు వస్తుందనే విషయంలో సుజుకీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

Suzuki V-Strom 800DE: 22.7 కిమీ మైలేజీ

ఈ అడ్వెంచర్ బైక్ లీటర్ కు 22.7 కిమీల మైలేజీ ఇస్తుందని సంస్థ వెల్లడించింది. 220ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ తో కఠినమైన రహదారులపై కూడా దూసుకుపోయేలా దీన్ని రూపొందించారు. అలాగే, ఈ బైక్ సీట్ హైట్ 855 ఎంఎం. పొడవు 2345 ఎంఎం. వెడల్పు 975 ఎంఎం, ఎత్తు 1310 ఎంఎం. బైక్ మొత్తం బరువు 230 కేజీలు. ఫ్యుయెల్ ట్యాంక్ సామర్ధ్యం 20 లీటర్లు.

Suzuki V-Strom 800DE: అడ్జస్టబుల్ పొజిషన్స్ తో విండ్ షీల్డ్

ఈ బైక్ కు ఈజీ స్టార్ట్ సిస్టమ్, మూడు అడ్జస్టబుల్ విండ్ షీల్డ్ పొజిషన్స్ తో పాటు మొబైల్ రీచార్జ్ కు ఒక USB socket, ఐదు అంగుళాల TFT screen ఉంటుంది. చక్రాల విషయానికి వస్తే.. ఈ బైక్ ముందు టైర్ 21 అంగుళాలు, వెనుక టైర్ 17 అంగుళాలు ఉంటుంది. ఇందులో wire-spoke wheels and tube tyres ను వాడారు.

WhatsApp channel

టాపిక్