మచ్ అవైటెడ్ సుజుకీ ఈ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై బిగ్ అప్డేట్! భారత దేశంలో ఈ ఈ-స్కూటర్ ప్రొడక్షన్‌ని ప్రారంభించింది సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా. సంస్థ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ గురుగ్రామ్‌లో తయారవుతోంది. సుజుకీ ఈ-యాక్సెస్ లాంచ్ అయిన తరువాత హోండా యాక్టివా ఈ, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టా, బజాజ్ చేతక్, ఓలా ఎస్ 1లకు గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్ రేంజ్, బ్యాటరీతో పాటు ఇతర వివరాలపై ఇక్కడ ఒక లుక్కేయండి.
ఈ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 95 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్‌ని ఇస్తుంది సుజుకీ చెప్పింది.
సుజుకీ ఈ-యాక్సెస్ బ్యాటరీ ప్యాక్ 3.07 కిలోవాట్! ఇది ఎల్ఎఫ్పీ యూనిట్. ఏసీ పోర్టబుల్ ఛార్జర్ ఉపయోగించి, ఈ బ్యాటరీని సుమారు 6 గంటల 20 నిమిషాల్లో 0 శాతం నుంచి 100 శాతం వరకు, 25 డిగ్రీల సెంటీగ్రేడ్ పరిసర ఉష్ణోగ్రత పరిస్థితుల్లో 4 గంటల 30 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.
ఈ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కి కూడా మద్దతు ఇస్తుంది. ఇది బ్యాటరీ ప్యాక్‌ని సుమారు 2 గంటల 12 నిమిషాల్లో 0 శాతం నుంచి 100 శాతానికి పెంచగలదు. అయితే 80 శాతం ఛార్జింగ్‌కి చేరుకోవడానికి 1 గంట 12 నిమిషాలు పడుతుంది.
ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 4.1 కిలోవాట్ల పవర్‌ని, 15 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని జనరేట్ చేయగలదు.
ఈ-యాక్సెస్ రైడర్లకు మూడు విభిన్న డ్రైవ్ మోడ్ ఆప్షన్స్ ఉంటాయని తెలుస్తోంది.
ఈకో మోడ్: ఈ మోడ్ గరిష్ట వేగాన్ని గంటకు 55 కిలోమీటర్లకు పరిమితం చేయడం ద్వారా క్రూయిజింగ్ పరిధిని ఆప్టిమైజ్ చేస్తుంది. తద్వారా పవర్‌ని ఆదా చేయడానికి పవర్ ఔట్‌పుట్‌ను పరిమితం చేస్తుంది. మెరుగైన పునరుత్పత్తి బ్రేకింగ్ ద్వారా పవర్ రికవరీని పెంచుతుంది.
రైడ్ మోడ్ ఏ: ఈ- యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్లోని ఈ మోడ్ గరిష్టంగా గంటకు 71 కిలోమీటర్ల వేగంతో గరిష్ట ఔట్‌పుట్‌ను అందిస్తుంది. అయినప్పటికీ, ఇది అధిక పునరుత్పత్తి బ్రేకింగ్ సెట్టింగ్ (2కేడబ్ల్యూ)ను కలిగి ఉంది. ఇది రైడ్ మోడ్ బి తో పోలిస్తే వేగవంతమైన డీసలరేషన్కి దారితీస్తుంది.
రైడ్ మోడ్ బీ: ఈ మోడ్ గరిష్టంగా గంటకు 71 కిలోమీటర్ల వేగంతో గరిష్ట ఔట్ పుట్‌ను అందిస్తుంది. అయితే ఇది తక్కువ పునరుత్పత్తి బ్రేకింగ్ సెట్టింగ్ (1 కిలోవాట్) కలిగి ఉంటుంది. ఇది రైడ్ మోడ్ ఏ కంటే నెమ్మదిగా డీసరేట్కు దారితీస్తుంది.
సుజుకీ ఈ- యాక్సెస్ లాంచ్, డెలివరీ, ధరతో పాటు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. రానున్న రోజుల్లో వీటిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత కథనం