Suzuki Access 125 : సుజుకి యాక్సెస్ సరికొత్త రికార్డు.. ఇప్పటివరకు 60 లక్షల స్కూటర్లు!-suzuki access125 scooter crosses 60 lakh production milestone check in details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Suzuki Access 125 : సుజుకి యాక్సెస్ సరికొత్త రికార్డు.. ఇప్పటివరకు 60 లక్షల స్కూటర్లు!

Suzuki Access 125 : సుజుకి యాక్సెస్ సరికొత్త రికార్డు.. ఇప్పటివరకు 60 లక్షల స్కూటర్లు!

Anand Sai HT Telugu

Suzuki Access 125 : సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ. దేశీయ విపణిలో అనేక బైక్‌లు, స్కూటర్‌లను విక్రయిస్తోంది. ఈ కంపెనీకి చెందిన యాక్సెస్ 125 స్కూటర్‌ రికార్డు సృష్టించింది.

ప్రతీకాత్మక చిత్రం

సుజుకి నుంచి వచ్చిన టూ వీలర్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీ బైకులు, స్కూటర్లకు మార్కెట్‌లో క్రేజ్ ఎక్కువే. ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్ల కారణంగా ఈ కంపెనీ వెహికల్స్ అధికంగా అమ్ముడవుతున్నాయి. కస్టమర్లు కూడా వీటిని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ కంపెనీ ప్రముఖ యాక్సెస్ 125 స్కూటర్‌ను తయారు చేయడంలో కంపెనీ కొత్త చరిత్ర సృష్టించింది.

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా 2006లో యాక్సెస్ 125 స్కూటర్‌ను విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ స్కూటర్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కస్టమర్లు కూడా ఎక్కువగానే కొనుగోలు చేస్తున్నారు. కంపెనీ ఈ స్కూటర్లను పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం 125 స్కూటర్లను తయారు చేయడంతో 60 లక్షల యూనిట్ యాక్సెస్‌ను సాధించారు.

ఈ సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ ఇండియన్ మార్కెట్లోనే కాకుండా విదేశాల్లో కూడా అమ్ముడవుతోంది. గత నెల నవంబర్‌లోనూ 54,118 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2023లో ఇదే కాలంలో విక్రయించిన 52,512 యూనిట్లతో పోలిస్తే, ఇది సంవత్సరానికి 3.06 శాతం వృద్ధి.

దేశీయ కస్టమర్లు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న సరికొత్త సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ ధర కనిష్టంగా రూ.84,281, గరిష్టంగా రూ.95,381 ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఇది మెటాలిక్ మ్యాట్ ప్లాటినం సిల్వర్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్, సాలిడ్ ఐస్ గ్రీన్ వంటి ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్స్‌లో దొరుకుతుంది.

సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ 124సీసీ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో వస్తుంది. ఇది 45 kmpl మైలేజీని ఇస్తుంది. ఇది సెమీ-డిజిటల్ సమాచార ప్యానెల్, సుజుకి రైడ్ కనెక్ట్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. దీని బరువు 103 కిలోలు, 5 లీటర్ల సామర్థ్యం గల ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంది. సుజుకి యాక్సెస్ 125 స్కూటర్‌లో రైడర్ సేఫ్టీ కోసం డిస్క్ లేదా డ్రమ్ బ్రేక్ ఆప్షన్ ఉంది. టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ సెటప్ కూడా ఉంది. ఈ సుజుకి స్కూటర్‌కు హోండా యాక్టివా 125, టీవీఎస్ జూపిటర్ 125 పోటీగా ఉన్నాయి.