బెస్ట్ సెల్లింగ్ యాక్సెస్ స్కూటర్లో కొత్త ఎడిషన్‌ని లాంచ్ చేసింది సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా. దీని పేరు రైడ్ కనెక్ట్. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 1,01,900గా ఉంది. ఈ స్కూటర్ పెర్ల్ మ్యాట్ ఆక్వా సిల్వర్ అని పిలిచే కొత్త కలర్ స్కీమ్, కొత్త 4.2 ఇంచ్ కలర్ టీఎఫ్టీ డిస్ప్లేని పొందుతుంది. ఇది ప్రకాశవంతమైన విజువల్స్, వేగవంతమైన రిఫ్రెష్ రేట్లు, అధిక కాంట్రాస్ట్ నిష్పత్తులు, మరింత ఖచ్చితమైన రంగులను చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
కొత్తగా ప్రవేశపెట్టిన పెర్ల్ మ్యాట్ ఆక్వా సిల్వర్‌తో పాటు ఈ బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లో ప్రస్తుతం ఉన్న మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నంబర్ 2, మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, పెర్ల్ గ్రేస్ వైట్, సాలిడ్ ఐస్ గ్రీన్ వంటి ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
సుజుకీ యాక్సెస్ రైడ్ కనెక్ట్ స్కూటర్లో 124 సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. అన్ని సుజికీ 125 మోడల్స్‌లో ఇదే ఇంజిన్ ఉంటుంది. ఇది 6,500 ఆర్పీఎం వద్ద 8.31 బీహెచ్పీ పీక్ పవర్, 5,000 ఆర్పీఎం వద్ద 10.2 ఎన్ఎమ్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఇంజిన్ ఫ్యూయల్ ఇంజెక్షన్, సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు కిక్- ఎలక్ట్రిక్ స్టార్టర్ని ఈ వెహికిల్ పొందుతుంది.
సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ ముత్రేజా మాట్లాడుతూ.. “సుజుకీ యాక్సెస్ చాలాకాలంగా పట్టణ రైడర్లకు నమ్మకమైన సహచరిగా ఉంది. తాజా అప్‌గ్రేడ్‌తో, మేము ఆధునిక కార్యాచరణ, నైపుణ్యాన్ని జోడిస్తున్నాము. కలర్ టీఎఫ్టీ డిజిటల్ డిస్ప్లే, సొగసైన కొత్త రంగు స్కూటర్ విశ్వసనీయత, సౌకర్యం, సామర్థ్యానికి కట్టుబడి ఉంటూ రోజువారీ రైడింగ్ అనుభవాన్ని పెంచుతాయి,” అని వివరించారు.
టెలిస్కోపిక్ యూనిట్లు, వెనుక భాగంలో స్వింగ్ ఆర్మ్ మౌంటెడ్ సస్పెన్షన్ ద్వారా ఈ యాక్సెస్ స్కూటర్ సస్పెన్షన్ జరుగుతుంది. బ్రేకింగ్ డ్యూటీ కోసం ముందు భాగంలో డ్రమ్/డిస్క్ బ్రేక్- వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. టైర్ సైజులు.. ముందు భాగంలో 90/90 సెక్షన్, వెనుక భాగంలో 90/100 సెక్షన్‌ని కొలుస్తాయి. ఈ స్కూటర్ బరువు 106 కిలోలు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లు.
ముందు భాగంలో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ ఉన్నాయి. వన్ పుష్ సెంట్రల్ లాక్ సిస్టమ్‌తో పాటు ఎక్స్టర్నల్ ఫ్యూయెల్ ఫిల్లర్ క్యాప్ కూడా ఉంది. ఇది కాకుండా సుజుకి ఇంజిన్ కిల్ స్విచ్, యూఎస్బీ పోర్ట్, ముందు భాగంలో యుటిలిటీ పాకెట్లు, రెండు హుక్స్‌తో పాటు సీటు కింద రెండు హుక్‌లు, స్టోరేజ్‌ని అందిస్తుంది.
సాధారణంగా సుజుకీ యాక్సెస్ 125 స్కూటర్ 46 కేఎంపీఎల్ మైలేజ్‌ని ఇస్తుంది.
సంబంధిత కథనం