Electric scooter : సుజుకీ యాక్సెస్‌కి ఈవీ టచ్- ది బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెడీ అవుతోంది!
Suzuki Access EV : సుజుకీ సంస్థ యాక్సెస్ ఈవీని రెడీ చేస్తోంది! ఈ మోడల్ వచ్చే ఏడాది లాంచ్ అవుతుందని తెలుస్తోంది.
ఇండియాలో నానాటికి పెరుగుతున్న ఈవీ సెగ్మంట్ హవాని క్యాష్ చేసుకునేందుకు ఆటోమొబైల్ సంస్థలు పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ సుజుకీ.. తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ని సిద్ధం చేస్తోంది. ఇది.. బెస్ట్ సెల్లింగ్ యాక్సెస్‌కి ఈవీ వర్షెన్! ఈ మోడల్ని 2025లో లాంచ్ చేసేందుకు సంస్థ ప్లాన్ చేస్తోంది. లాంచ్ అయిన తరువాత, సుజుకీ యాక్సెస్ ఈవీ, హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వంటి ప్రత్యర్థులతో పోటీపడుతుంది.
సుజుకీ యాక్సెస్ ఈవీ..
జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బర్గ్‌మన్ ఎలక్ట్రిక్‌ని గత రెండు సంవత్సరాలుగా భారత రోడ్లపై పరీక్షిస్తోంది. అయితే, ఆటో కంపెనీ మొదట యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ని, తరువాత ఎలక్ట్రిక్ బర్గ్మాన్ స్ట్రీట్‌ని విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒకే ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటాయి. ఇది ఒక ఉత్పత్తిని ఉపయోగించి ఎలక్ట్రిక్ వాహనాల ఇంటీరియర్స్‌ని పరీక్షించడం వాహన తయారీదారుకు సులభతరం చేస్తుంది.
గత కొన్నేళ్లుగా భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, లెజెండరీ సంస్థలు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్స్‌ని విడుదల చేయడంలో నెమ్మదిగా ఉన్నాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో ప్రస్తుతం ఈవీ స్టార్టప్స్ ఆధిపత్యం చెలాయిస్తుండగా, లెగసీ ప్లేయర్లలో బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కంపెనీ, హీరో మోటోకార్ప్ తమ తమ ఉత్పత్తులను విడుదల చేశాయి. హీరో మోటోకార్ప్ వీ1 ఎలక్ట్రిక్ స్కూటర్ని విక్రయించే విడా సబ్ బ్రాండ్ను ప్రవేశపెట్టింది.
ఇటీవల రాయల్ ఎన్ఫీల్డ్ కూడా తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను ఆవిష్కరించింది. అయితే, జపనీస్ ద్విచక్ర వాహన తయారీదారులు మాత్రం ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే కాస్త నిదానంగనే ఉన్నారు. ఇప్పుడు హోండా తన ఎలక్ట్రిక్ స్కూటర్ని భారతదేశంలో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నందున, సుజుకీ కూడా ఈ విభాగంలో తన సొంత ఉత్పత్తులను తీసుకురావడానికి ముందడుగు అవకాశం ఉంది. యాక్సెస్ ఎలక్ట్రిక్ లాంచ్ కోసం ద్విచక్ర వాహన తయారీదారు ఎటువంటి నిర్దిష్ట కాలపరిమితిని వెల్లడించలేదు, కానీ వచ్చే సంవత్సరం పండుగ సీజన్‌కి దగ్గరగా ఇంది విడుదలవ్వొచ్చని తెలుస్తోంది.
రాబోయే సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ ధర సుమారు రూ .1.20 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండొచ్చు. ఇది బహుళ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. వినియోగదారులకు వేరియబుల్ రేంజ్ ఆప్షన్స్‌ని అందిస్తుంది. అలాగే, ఇది అనేక ఫీచర్లను కలిగి ఉంటుందని ఆశించవచ్చు.
అయితే సుజుకీ యాక్సెస్ ఈవీకి సంబంధించి ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఇంకా వివరాలను వెల్లడించలేదు. రేంజ్, ధర, ఫీచర్స్ వంటి వాటిపై రానున్న రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ వివరాలను మేము మీకు అప్డేట్ చేస్తాము.
సంబంధిత కథనం