Electric scooter : ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ లిస్ట్‌లో కొత్త ఆప్షన్! సుజుకీ యాక్సెస్‌కి ఈవీ టచ్..
Best Electric scooter : ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ లిస్ట్‌లో కొత్త ఆప్షన్ వస్తోందని తెలుస్తోంది. సుజుకీ యాక్సెస్125కి ఈవీ టచ్ ఇచ్చేందుకు సంస్థ రెడీ అయ్యింది. ఈ యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..
బెస్ట్ సెల్లింగ్ యాక్సెస్ స్కూటర్‌కి ఎలక్ట్రిక్ వర్షెన్‌ని సుజుకీ సంస్థ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక 2025 ఆటో ఎక్స్పో వేదికగా ఈ సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని సంస్థ ఆవిష్కరించే అవకాశం ఉంది. దీనిని ఈ-యాక్సెస్‌గా పిలవనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌కి సంబంధించి ప్రస్తుతం ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

బెస్ట్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే అవుతుందా?
బర్గ్‌మన్ ఎలక్ట్రిక్ పేరుతో ఒక ఈ-స్కూటర్ని గత కొంతకాలంగా ఇండియాలో టెస్ట్ చేస్తోంది సుజుకీ. కానీ దీనికి ముందే యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వస్తుందని తెలుస్తోంది. ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా, మంచి ఫ్యామిలీ స్కూటర్‌గా పేరు సంపాదించుకున్న సుజుకీ యాక్సెస్ 125కి ఈవీ వర్షెన్ రాబోతోందని కస్టమర్లు చాలా ఆసక్తిగా ఉన్నారు. 125 సీసీ సెగ్మెంట్లో ప్రస్తుతం ఈ యాక్సెస్ రాజ్యమేలుతోంది. ఫలితంగా ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లోనూ మంచి డిమాండ్ లభిస్తుందని సంస్థ ఆశలు పెట్టుకుంది.
అయితే, బర్గమన్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న మోటార్, బ్యాటరీ స్పెసిఫికేషన్స్ ఈ సుజుకీ యాక్సెస్ ఈ-స్కూటర్లోనూ కనిపించే అవకాశం ఉంది. బర్గమన్ ఎలక్ట్రిక్‌లో 4 కేడబ్ల్యూహెచ్ పీఎంఎస్ మోటార్ ఉంటుది. ఇది 5.3 బీహెచ్పీ పవర్‌ని, 18 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే.. సింగిల్ ఛార్జ్‌లో ఇది కేవలం 44 కి.మీ రేంజ్‌నే ఇస్తుంది! ప్రస్తుత మార్కెట్లో పోటీని తట్టుకోవాలంటే ఈ సెగ్మెంట్లో ఈ రెంజ్ సరిపోదు. అందుకే, బ్యాటరీ పరంగా సుజుకీ భారీ మార్పులే చేసే అవకాశం ఉంది. అంతేకాదు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో రిమూవెబుల్ బ్యాటరీ ఆప్షన్ కూడా ఉండనుంది.
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్..
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో బ్లూటూత్ కనెక్టివిటీ, నేవిగేషన్, కాల్- ఎస్ఎంఎస్ అలర్ట్స్తో కూడిన డిజిటల్ కన్సోల్ ఉంటుంది. అండర్ సీట్ స్టోరేజ్ కెపాసిటీ ఎంత ఉంటుందో చూడాలి. ఈ మోడల్ డిజైన్‌పై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. కానీ యాక్సెస్ 125 స్టైలింగ్‌తోనే ఈ సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుందని అంచనాలు ఉన్నాయి.
లాంచ్ అనంతర ఈ- యాక్సెస్.. హోండా యాక్టివా ఎలక్ట్రిక్‌కి గట్టిపోటీని ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
2025 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన అనంతరం ఈ మోడల్‌పై పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి. బ్యాటరీ, ఫీచర్స్, ధరతో పాటు మరిన్ని వివరాలపై పూర్తి క్లారిటీ వస్తుంది. ఆ వివరాలను మేము మీకు అప్డేట్ చేస్తాను. హెచ్‌టీ తెలుగును ఫాలో అవ్వండి!
సంబంధిత కథనం