Samsung Galaxy A35 : కిర్రాక్ కెమెరా ఉన్న ఈ శాంసంగ్ ఫోన్ మీద భారీగా తగ్గింపు.. ఇంకెందుకు లేట్!
Samsung Galaxy A35 5G Discount : శాంసంగ్ ఫోన్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మీరు కూడా ఈ కంపెనీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే మీ కోసం గుడ్‌న్యూస్. శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ మీద డిస్కౌంట్ నడుస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ ఫోన్ మీద తగ్గింపు ఉంది. మీరు కొత్త శాంసంగ్ ఫోన్ కొనాలనుకుంటే ఈ ఆఫర్ మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. ప్రముఖ ఇ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ ఫోన్ల మీద మంచి ఆఫర్లు నడుస్తున్నాయి. ఆకర్షణీయమైన తగ్గింపులను కూడా ఉన్నాయి. ఇందులో శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ ఫోన్ కూడా ఉంది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రముఖ ఇ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. 13 శాతం ప్రత్యక్ష తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,499ల ఆఫర్‌తో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.33,999. దీంతో పాటు సెలక్ట్ చేసిన కొన్ని బ్యాంకుల నుంచి ఆకర్షణీయమైన డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ ఫోన్‌లో 5000 mAh సామర్థ్యం గల బ్యాటరీ బ్యాకప్ సౌకర్యంతో వస్తుంది. ఈ ఫోన్ మొదటి కెమెరా 50 మెగా పిక్సెల్ సెన్సార్ సౌకర్యాన్ని కలిగి ఉంది. దీని సెల్ఫీ కెమెరా 13 మెగా పిక్సెల్ సెన్సార్ సామర్థ్యంతో ఉంటుంది. ఈ ఫోన్ 1080 × 2340 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 389 పీపీఐ పిక్సెల్ సాంద్రత, 120 Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ ఫోన్ Mali G68 జీపీయూ సపోర్ట్‌తో పాటు Exynos 1380 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో ఆండ్రాయిడ్ 14 ఓఎస్ సపోర్ట్ కూడా ఉంది. ఇది 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. మొదటి కెమెరా 50-మెగాపిక్సెల్ సెన్సార్‌తో వస్తుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ సౌకర్యం, మూడో కెమెరా 5 మెగాపిక్సెల్ సెన్సార్ కలిగి ఉంది. సెల్ఫీ కెమెరా 13 మెగా పిక్సెల్.
ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీ బ్యాకప్‌ను పొందుతుంది. 25వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉంది. ఇందులో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ ఫోన్ 8జీబీ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్, 8జీబీ ప్లస్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్స్‌తో ఉంటుంది. ఐస్ బ్లూ, లిలక్, నేవీ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ దొరుకుతుంది.
గమనిక : ఈ డిస్కౌంట్ ఆఫర్ మారుతూ ఉండవచ్చు. ప్రస్తుతం ఉన్న తగ్గింపు ప్రకారం కథనం ఇచ్చాం. పైన చెప్పిన కంటెంట్ కు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు.