జనాలు మెచ్చే ఈ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ మీద భారీగా డిస్కౌంట్.. న్యూ ఇయర్‌కి ప్లాన్ చేయెుచ్చు!
Redmi Note 13 Pro 5G Discount : ఈ న్యూ ఇయర్‌కు కొత్త ఫోన్ కొనాలనే ఆలోచనలో ఉంటే మీకోసం అద్భుతమైన ఆఫర్ వెయిట్ చేస్తోంది. రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ ఫోన్ మీద మంచి డిస్కౌంట్ నడుస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ మొబైల్స్ మీద ఆఫర్లు ప్రకటిస్తూనే ఉంది. న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని మొబైల్‌ల మీద మంచి తగ్గింపులు ఉన్నాయి. అందులో రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ ఒకటి. 25 శాతం ప్రత్యక్ష తగ్గింపుతో దీనిని కొనుగోలు చేయవచ్చు. ఈ మొబైల్ 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ వేరియంట్ ధర రూ.21,499గా అందుబాటులో ఉంది. దీనితో పాటు, కస్టమర్లు బ్యాంక్, ఎక్స్ఛేంజ్, ఇతర ఆఫర్లలో కూడా కొనుగోలు చేయవచ్చు.
రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీని మొదటి కెమెరా 200 మెగాపిక్సెల్ సెన్సార్. అలాగే 5100 mAh కెపాసిటీ బ్యాటరీ సపోర్ట్‌తో వస్తుంది. 1080×2400 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు కూడా మద్దతు ఇస్తుంది. గరిష్టంగా 1000 నిట్‌ల బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. 1920Hz హై-ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ ఆప్షన్ కూడా కలిగి ఉంటుంది.
రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ ఆండ్రాయిడ్ 13 ఓస్ మద్దతుతో పని చేస్తుంది. అదేవిధంగా 6జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ, 8జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిపై డిస్కౌంట్స్ వేరే విధంగా ఉంటాయని గమనించాలి.
రెడ్‌మి నోట్ 13 ప్రో ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను పొందుతుంది. దీని ప్రైమరీ కెమెరా 200-మెగాపిక్సెల్ సెన్సార్, సెకండరీ కెమెరాలో 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ముందు భాగంలో 16 మెగా పిక్సెల్ సెన్సార్‌తో కూడిన సెల్ఫీ కెమెరా అందించారు. 5100 mAh బ్యాటరీతో సపోర్ట్ ఇస్తుంది. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.
గమనిక : ఆఫర్లు రోజురోజుకు మారుతూ ఉండవచ్చు. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ మీద ఉన్న డిస్కౌంట్ ఆధారంగా వివరాలు ఇచ్చాం. భవిష్యత్తులో ఈ ధరలు మారవచ్చు.