రూ.7 వేల వరకు కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే మీకోసం గుడ్‌న్యూస్. అమెజాన్ అద్భుతమైన డీల్‌లో రియల్‌మీకి చెందిన నార్జో ఎన్61 గొప్ప ఆఫర్లతో లభిస్తుంది. 4 జీబీ ర్యామ్ ప్లస్ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర అమెజాన్ ఇండియాలో రూ.7,498గా ఉంది. ఈ డీల్‌లో ఈ ఫోన్ పై రూ.900 కూపన్ డిస్కౌంట్ ను అందిస్తోంది. ఈ ఆఫర్‌తో ఈ ఫోన్ రూ.7 వేల లోపు ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.
ఈ ఫోన్ మీద రూ.224 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో దీని ధరను మరింత తగ్గించుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో లభించే డిస్కౌంట్ మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని గమనించాలి.
రియల్‌మీ ఈ బడ్జెట్ ఫోన్‌లో 1600×720 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.74 అంగుళాల డిస్‌ప్లే లభిస్తుంది. ఈ డిస్‌ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని గరిష్ట బ్రైట్‌నెస్ 560 నిట్స్. ప్రాసెసర్‌గా యూనిసోక్ టీ612 చిప్‌సెట్‌ను కంపెనీ ఫోన్‌లో అందిస్తోంది.
ఫొటోగ్రఫీ కోసం ఈ ఫోన్లో ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన 32 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను అందించారు. దీంతోపాటు డెప్త్ సెన్సార్ కూడా లభిస్తుంది. అదే సమయంలో సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను చూడవచ్చు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఈ బ్యాటరీ 10 వాట్ల ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బయోమెట్రిక్ సేఫ్టీ కోసం ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది.
ఓఎస్ విషయానికొస్తే ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐపై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ ఫోన్ ఐపీ54 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌తో వస్తుంది. కనెక్టువిటీ ఆప్షన్లలో డ్యూయల్ 4జీ వీవోఎల్టీఈ, వై-ఫై 802.11ఏసీ (2.4గిగాహెర్ట్జ్ + 5గిగాహెర్ట్జ్), బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.
టాపిక్