Kavya Maran Net Worth : ఎస్ఆర్‌హెచ్ ఓనర్ కావ్య పాపకు ఎంత ఆస్తి ఉంది? ఆమె కుటుంబం గురించి తెలుసా?
Kavya Maran Net Worth : కావ్య మారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కావ్య పాప అంటే తెలుగు వాళ్లకు బాగా అర్థమవుతుంది. ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్. ఆమెకు ఎంత ఆస్తి ఉంది? ఆమె కుటుంబం గురించి చూద్దాం..

సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ ఐపీఎల్‌లో చాలా ఫేమస్. ఎస్ఆర్‌హెచ్ గెలిచినప్పుడు, ఓడినప్పుడు ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌కి అందరూ ఫీదా అయిపోతారు. ఓ స్టేజీ మీద రజనీకాంత్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారంటే ఎంత వైరల్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ వ్యాపార కుటుంబంలో జన్మించిన ఆమె ఎంబీఏ పూర్తి చేశారు. 2018లో ఎస్ఆర్‌హెచ్ సీఈవో అయ్యారు.
కావ్య మారన్ ఫ్యామిలీ
సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ ఐపీఎల్‌లో ప్రముఖ వ్యక్తిగా మారారు. ఆగస్టు 6, 1992న జన్మించారు. ఆమె తండ్రి కళానిధి మారన్ సన్ గ్రూప్ చైర్మన్, వ్యవస్థాపకుడు. ఆమె తల్లి కావేరి మారన్ సోలార్ టీవీ కమ్యూనిటీ లిమిటెడ్‌కు సీఈవో. కావ్య సన్ గ్రూప్ వ్యాపార కార్యకలాపాలలో ప్రభావవంతమైన పాత్ర పోషిస్తుంది. సన్ టీవీ నెట్‌వర్క్ వెనుక ఉన్న శక్తిగా ఆమె దేవి అవార్డ్స్ 2024ను కూడా అందుకుంది.
కావ్య మారన్.. దివంగత మురసోలి మారన్ మనవరాలు. ద్రవిడ మున్నేట్ర కజగం(DMK)లో కీలక వ్యక్తి ఈయన. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎం. కరుణానిధికి దగ్గరి వ్యక్తి. చెన్నై సెంట్రల్ నుంచి నాలుగుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన దయానిధి మారన్ మేనకోడలు కావ్య మారన్.
కావ్య చదువు
కావ్య మారన్ చెన్నైలోని స్టెల్లా మారిస్ కళాశాల నుండి తన బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేశారు. 2012లో పట్టభద్రురాలైంది. తరువాత ఆమె విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించింది. 2016లో ఇంగ్లాండ్‌లోని కోవెంట్రీలోని ప్రతిష్టాత్మక వార్విక్ బిజినెస్ స్కూల్ నుండి ఎంబీఏ పట్టా పొందింది.
కావ్య మారన్ ఆస్తి
కావ్య 2018లో అధికారికంగా ఎస్ఆర్‌హెచ్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో కావ్య మారన్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌తో చాలా మంది అభిమానులను పొందారు. రూ.400 కోట్లకు పైగా నికర విలువతో అత్యంత శక్తివంతమైన యువ వ్యాపార మహిళలలో ఒకరు. ఆమె తండ్రి నికర విలువ చాలా ఎక్కువగా ఉంది, ఫోర్బ్స్ ప్రకారం దాదాపు రూ.25,000 కోట్లు.
సంబంధిత కథనం