Sunder Pichai's phone?: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఐ ఫోన్ వాడుతారు తెలుసా?
Sunder Pichai's phone?: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏ ఫోన్ వాడుతారంటే.. ఎవరైనా వెంటనే ఇచ్చే సమాధానం.. సొంత కంపెనీ గూగుల్ కు చెందిన గూగుల్ పిక్సెల్ మోడల్ అని. కానీ సుందర్ పిచాయ్ ఒక ఐ ఫోన్ ను, మరో సామ్సంగ్ గెలాక్సీ ఫోన్ ను వాడుతారు.
Sunder Pichai's phone?: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (Sunder Pichai) ని మీరు ఏ ఫోన్ వాడుతారని ఒక యూట్యూబర్ ఒక ఇంటర్వ్యూలో అడిగారు. దానికి సుందర్ పిచాయి ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ గా మారింది.
Sunder Pichai's phone?: గూగుల్ పిక్సెల్ ఫోల్డ్
గూగుల్ (Google) కంపెనీ ఇటీవల తమ ఫోల్డబుల్ మోడల్ స్మార్ట్ ఫోన్ ను పిక్సెల్ ఫోల్డ్ (Pixel Fold) పేరుతో లాంచ్ చేసింది. ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఈ పిక్సెల్ ఫోల్డ్ (Pixel Fold) పాపులారిటీ గణనీయంగా పెరుగుతోంది. అయితే, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయి (Sunder Pichai) మొదటి ప్రాధాన్యత మాత్రం ఈ పిక్సెల్ ఫోల్డ్ (Pixel Fold) ఫోన్ కాదట. ఈ పిక్సెల్ ఫోల్డ్ (Pixel Fold) ను వాడుతాను కానీ, నా ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఆ ఫోన్ కాదు’ అని సుందర్ (Sunder Pichai) వివరించారు. ప్రముఖ యూట్యూబర్ అరుణ్ మైనీ (Arun Maini) కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాన్ని సుందర్ పిచాయి (Sunder Pichai) పంచుకున్నారు.
Sunder Pichai's phone?: మొదటి ప్రాధాన్యత ఫోల్డబుల్ ఫోన్ కాదు..
తన మొదటి ప్రాధాన్యత ఫోల్డబుల్ ఫోన్ కాదని, ప్రయాణాలు చేసే సమయంలో ఫోల్డబుల్ ఫోన్ ను ఆపరేట్ చేయడం కన్నా సాధారణ స్మార్ట్ ఫోన్ ను ఆపరేట్ చేయడం సులభమని సుందర్ పిచాయ్ (Sunder Pichai) వివరించారు. ముఖ్యంగా మెయిల్స్ చెక్ చేసుకోవడం కోసం తాను రెగ్యులర్ గా Google Pixel 7 Pro! మోడల్ ఫోన్ ను వాడుతానన్నారు.
Sunder Pichai's phone?: సామ్సంగ్ గెలాక్సీ కూడా..
Google Pixel 7 Pro! తో పాటు తాను సామ్సంగ్ గెలాక్సీ (Samsung Galaxy) ఫోన్ ను అలాగే, లేటెస్ట్ మోడల్ ఐ ఫోన్ (iPhone) ను కూడా ఉపయోగిస్తానని సుందర్ పిచాయ్ (Sunder Pichai) వెల్లడించారు. అయితే, సామ్సంగ్ గెలాక్సీ (Samsung Galaxy) , ఐ ఫోన్ (iPhone) లను తాను టెస్టింగ్ పర్పస్ కోసం, ఫీచర్స్ కంపేరిజన్ కోసం వాడుతానని వివరించారు. అత్యాధునిక టెక్నాలజీతో, నిత్యావసర కార్యకలాపాల్లో వినియోగదారులకు ఉపయోగపడేలా పిక్సెల్ ఫోల్డ్ (Pixel Fold) ఫోన్ ను రూపొందించామని తెలిపారు. స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ ఫోల్డబుల్ ఫోన్స్ తోనే ఆగిపోదని, అది మరింత ముందుకు వెళ్లి, నూతన ఆవిష్కరణలతో సాగుతుందని తెలిపారు. భవిష్యత్తులో కృత్రిమ మేథ మనిషి దైనందిన జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపబోతోందన్నారు.