Google layoff: ‘బాధాకరమే.. కానీ తప్పలేదు’- 12 వేల మంది ఉద్యోగుల లే ఆఫ్ పై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయి స్పందన-sundar pichai opens up on googles biggest layoff could have done differently ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Sundar Pichai Opens Up On Google's Biggest Layoff: 'Could Have Done Differently'

Google layoff: ‘బాధాకరమే.. కానీ తప్పలేదు’- 12 వేల మంది ఉద్యోగుల లే ఆఫ్ పై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయి స్పందన

HT Telugu Desk HT Telugu
Dec 16, 2023 05:33 PM IST

Google layoff: గూగుల్ సంస్థ 2022 లో అతిపెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. సంస్థ చరిత్రలోనే అది అతి పెద్ద లే ఆఫ్ నిర్ణయం. 2022 లో మొత్తం 12 వేల మంది ఉద్యోగులను గూగుల్ తొలగించింది.

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయి
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయి (AP)

Google layoff: 2022 లో గూగుల్ ప్రకటించిన లే ఆఫ్స్ పై ఆ టెక్ దిగ్గజం సీఈఓ సుందర్ పిచాయి స్పందించారు. అది అత్యంత కఠినమైన నిర్ణయమని, కానీ, సంస్థ భవిష్యత్తు దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదని వివరించారు.

ట్రెండింగ్ వార్తలు

12 వేల మంది లే ఆఫ్స్

గూగుల్ 2022 లో మొత్తం 12 వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. గత 25 ఏళ్ల గూగుల్ చరిత్రలో ఇదే అతి పెద్ద లే ఆఫ్ నిర్ణయం. సంస్థ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 6% ఉద్యోగులను గూగుల్ తొలగించడం నాడు సంచలనంగా మారింది. 2022, 2023 ల్లో చాలా టెక్ సంస్థలు, ఈ కామర్స్ సంస్థలు, మేజర్ ప్రైవేటు సంస్థలు పెద్ద సంఖ్యలో తమ ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించాయి. వ్యయ నిర్వహణ నిర్ణయాల్లో భాగంగా వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.

అత్యంత కఠిన నిర్ణయం

ఇటీవల, డిసెంబర్ 12వ తేదీన గూగుల్ సంస్థలో ఆల్ హ్యాండ్స్ మీటింగ్ (all-hands meeting) జరిగింది. ఆ సమావేశంలో ఒక ఉద్యోగి ఈ లేఆఫ్స్ పై సంస్థ సీఈఓ సుందర్ పిచాయిని ప్రశ్నించారు. ఆ నిర్ణయం కఠినమైనదే కానీ, తప్పని సరిగా తీసుకోవాల్సిన నిర్ణయమని సుందర్ పిచాయి సమర్ధించుకున్నారు. ‘‘ ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలన్న కఠిన నిర్ణయం తీసుకుని సంవత్సరం దాటింది.ఆ నిర్ణయం సంస్థ లాభానష్టాలను, వృద్ధిని, ఆత్మ స్థైర్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది?’’ అని ఆ ఉద్యోగి ప్రశ్నించారు. దానికి.. ‘‘ఉద్యోగుల ఆత్మస్థైర్యంపై ఆ నిర్ణయం భారీ ప్రభావమే చూపింది. కంపెనీ తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయం అది. గూగుల్ లో గత 25 ఏళ్లలో అలాంటి పరిస్థితి రాలేదు. అది కఠిన నిర్ణయమే కానీ తప్పక తీసుకోవాల్సిన నిర్ణయం. ఒకవేళ అప్పుడు ఉద్యోగుల సంఖ్యను తగ్గించకపోతే, మరింత కఠినమైన నిర్ణయం ఇప్పుడు తీసుకోవాల్సి వచ్చేది’’ అని సుందర్ పిచాయి సమాధానమిచ్చారు. అయితే, ఆ నిర్ణయాన్ని అమలు చేసిన తీరు సరిగ్గా లేదని ఆయన అంగీకరించారు. ‘‘టైమ్ జోన్ కు సంబంధం లేకుండా, ఒకే సమయంలో ఆ ఉద్యోగులందరినీ తొలగించి, వారికి వెంటనే యాక్సెస్ ను కట్ చేయడం సరైన పద్ధతి కాదు. సరైన పద్ధతిలో ఆ నిర్ణయాన్ని అమలు చేస్తే బావుండేది’’ అన్నారు.

WhatsApp channel