విదేశాలకే వెళ్లాలనే ఆలోచనొద్దు.. ఇంటి నుంచి కూడా డాలర్లు సంపాదించొచ్చు
Earn Dollars From Home : భారత్‌లో చాలామందికి ఇతర దేశాలకు వెళ్లాలనే ఆలోచన ఉంటుంది. అక్కడి సిటిజన్‌షిప్ వస్తే ఇక హాయిగా లైఫ్ సెట్ అనుకుంటారు. కానీ మీరు ఇంటి నుంచి కూడా డాలర్లు సంపాదించొచ్చు. ఆ విషయాన్ని తెలుసుకోవాలి.
విదేశాలకు వెళ్లాలని కొందరికి డ్రీమ్. ఇందుకోసం చాలా కష్టపడుతారు. అక్కడకు వెళ్లి ఉద్యోగం చేస్తే డాలర్లు సంపాదించొచ్చని లెక్కలు వేసుకుంటారు. చదువు పేరుతో అక్కడకు వెళ్లి.. విదేశాల్లోనే సెటిల్ అవ్వాలని కలలు కంటారు. అమెరికా, జర్మన్, కెనడా, ఆస్ట్రేలియాలాంటి దేశాల పౌరసత్వం కోసం నానా తిప్పలు పడుతారు. ఇక ఎలాంటి ఇబ్బందులు రావని అనుకుంటారు. డబ్బులు బాగా సంపాదించొచ్చు అని ఆలోచన చేస్తారు. కానీ మీరు ఇంటి నుంచి కూడా డాలర్ల రూపంలో డబ్బులు సంపాదించొచ్చు.
కంపెనీలు కొరుకునే స్కిల్ మీకు ఉంటే.. వివిధ దేశాలకు చెందిన సంస్థల్లో పని చేయవచ్చు. మీకు డబ్బులు కూడా డాలర్ల రూపంలో చెల్లిస్తారు. హాయిగా ఇంటి నుంచి జాబ్ చేయవచ్చు. ఏ రిస్క్ ఉండదు. కాకపోతే వారి టైమింగ్స్ ప్రకారం మీరు పని చేయాల్సి ఉంటుంది. విదేశాల్లోని వివిధ కంపెనీల్లో పని చేసేందుకు మీరు పెద్దగా ఇబ్బందిపడాల్సిన పని లేదు. ఇందుకోసం కొన్ని రకాల వెబ్‌సైట్స్ ఉన్నాయి. అందులో మీరు రిజిస్టర్ అవ్వాలి. తర్వాత ఇంటర్వ్యూలాంటివి ఫేస్ చేయాల్సి ఉంటుంది.
ప్రియాంక్ అహూజా అనే కెరీర్ కోచ్, మెంటర్, కన్సల్టెంట్.. అలాంటి వెబ్‌సైట్‌ల గురించి తన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో షేర్ చేశారు. అందులో మీకు ఏది సూట్ అవుతుందో చూసి రిజిస్టర్ అవ్వొచ్చు. ఇందులో కొన్ని రిమోట్, హైబ్రిడ్ పద్ధతిలో ఉన్నాయి. ఆ సమాచారం మీకోసం..
- JustRemote
ఈ వెబ్‌సైట్‌లో మీరు రిమోట్, హైబ్రిడ్ ఉద్యోగాలను చూడవచ్చు.
https://justremote.co
- Wellfound by Anglelist
ప్రత్యేకమైన స్టార్టప్, టెక్ ఉద్యోగాలు ఇందులో ఉంటాయి. మీ ప్రొఫైల్‌ని ఉపయోగించి ఇందులో ఉద్యోగం సంపాదించొచ్చు.
https://wellfound.com
- Working Nomads
డిజిటల్‌గా పని చేసేందుకు ఇందులో జాబ్స్ ఉంటాయి. ఎక్కడి నుండైనా పని చేయవచ్చు.
https://lnkd.in/g8jbCcgv
- Remote
ప్రపంచవ్యాప్తంగా సులభంగా వర్క ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలను పొందేందుకు ఈ సైట్ ఉపయోగపడుతుంది.
https://remote.com
- oDesk Work
మీ నైపుణ్యల ఆధారంగా ఇందులో జాబ్ వెతుక్కోవచ్చు.
https://odeskwork.com
- Job Board Search
200 కంటే ఎక్కువ కేటగిరీలకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలను ఇందులో చూడవచ్చు.
https://jobboardsearch.com
- JS Remotely
జావాస్క్రిప్ట్ ఉద్యోగాల కోసం ఈ సైట్ చాలా బెస్ట్.. ప్రతిరోజూ 200కి పైగా కొత్త జాబితాలు ఇందులో ఎంటర్ అవుతాయి.
https://jsremotely.com
- Remote.co
స్థానిక ఉద్యోగాలను సులభంగా ఇందులో తెలుసుకోవచ్చు.
https://remote.co
- Remote OK
ఇందులో ఉద్యోగాలను తెలుసుకోవడం చాలా సులభం అవుతుంది.
https://remoteok.com
- Himalayas
100 ప్లస్ కేటగిరీలకు సంబంధించిన మీరు ఇష్టపడే రిమోట్ ఉద్యోగాన్ని కనుగొనవచ్చు.
https://himalayas.app
- We Work Remotely
మంచి మంచి రిమోట్ ఉద్యోగాలను కనుగొనేందుకు ఇది బెటర్ సైట్.
https://weworkremotely.com
- Flex Jobs
ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ రిమోట్, సౌకర్యవంతమైన ఉద్యోగ అవకాశాలను ఇందులో కనుగొనండి.
https://flexjobs.com
- Fiverr
Fiverr అనేది ఫ్రీలాన్సర్ల కోసం ఒక ఉచిత వేదిక. సైన్ అప్ చేయండి. మీకు వచ్చిన స్కీల్ ఆధారంగా సంపాదించడం ప్రారంభించొచ్చు.
https://fiverr.com
- Upwork
మీ ప్రతిభ ఆధారంగా ఇందులో ఉద్యోగాలు తెలుసుకోవచ్చు.
https://upwork.com
- Freelance Writing
మీరు రచయిత అయితే ఈ వెబ్‌సైట్ మీకు పక్కాగా ఉపయోగపడుతుంది. రచయితలకు సులభంగా ఉద్యోగావకాశాలను కనుగొనే వెబ్‌సైట్ ఇది.
https://lnkd.in/gaaweqHF
- Freelancer
ఫ్రీలాన్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసేవారికి వెబ్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, రైటింగ్‌లో వర్క్ కోసం ఇది సహాయపడుతుంది.
https://freelancer.in
- Indeed
ఇందులో కూడా మంచి ఉద్యోగాలను సెర్చ్ చేయవచ్చు. ఆటో-అప్లై సిస్టమ్‌తో సులభంగా దరఖాస్తు చేసుకోండి.
https://in.indeed.com
- Outsourcely
వెబ్ డెవలప్‌మెంట్, డిజైన్, కంటెంట్ రైటింగ్, మరిన్నింటిలో పార్ట్-టైమ్ లేదా ఫుల్-టైమ్ ఉద్యోగాలను ఇందులో కనుగొనండి.
https://outsourcely.com
- Problogger
గోస్ట్‌రైటర్‌లు, బ్లాగర్‌లు, కంటెంట్ రైటర్‌ల కోసం ఇది ఉపయోగపడుతుంది. రిమోట్ వర్క్ కోసం సైన్ అప్ చేయండి. దరఖాస్తు చేసుకోండి.
https://problogger.com
టాప్ కంపెనీలలో మీ నైపుణ్యాలకు సరిపోయే ఉద్యోగాలను కనుగొనండి. ఇందుకోసం లింక్డ్ఇన్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.
https://linkedin.com
గమనిక : ఇది కేవలం నిపుణులు చెప్పిన సమాచారం ఆధారంగా ఇచ్చిన కథనం మాత్రమే. HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. కేవలం సమాచారం ఇవ్వడం మాత్రమే మా ఉద్దేశం. రిజిస్టర్ అవ్వడానికి డబ్బులు ఎవరైనా అడిగితే ఇవ్వకండి. నిపుణుల సలహా తీసుకోండి.