అక్టోబర్​ 8: ఈ రోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది? ఏ స్టాక్స్​లో ట్రేడింగ్​ బెస్ట్​?-stocks to buy today stock market updates 8th october 2025 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  అక్టోబర్​ 8: ఈ రోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది? ఏ స్టాక్స్​లో ట్రేడింగ్​ బెస్ట్​?

అక్టోబర్​ 8: ఈ రోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది? ఏ స్టాక్స్​లో ట్రేడింగ్​ బెస్ట్​?

Sharath Chitturi HT Telugu

ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​లను నిపుణులు వెల్లడించారు. వాటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 137 పాయింట్లు పెరిగి 81,927 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 31 పాయింట్లు వృద్ధిచెంది 25,108 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 134 పాయింట్లు పెరిగి 56,239 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,440.66 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 452.57 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ అక్టోబర్​​​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 2,061.68 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 8,894.86 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 15 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో నిఫ్టీ50కి 25,200- 25,250 లెవల్స్​ వద్ద రెసిస్టెన్స్​ కనిపించింది. ఫలితంగా బుల్లిష్​ మూమెంట్​ కొంత తగ్గి కన్సాలిడేషన్​ దశకు చేరుకోవచ్చు. కానీ సూచీ 24,900 లెవల్స్​ పైన ఉన్నంత వరకు పాజిటివ్​గానే చూడాలి,” అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​ టెక్నికల్​ ఎనలిస్ట్​ వత్సల్​ భువ తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.20 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.38శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.67 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

ఏథర్​ ఎనర్జీ- బై రూ. 630, స్టాప్​ లాస్​ రూ. 608, టార్గెట్​ రూ. 674

యూనో మిండా- బై రూ. 1366, స్టాప్​ లాస్​ రూ. 1320, టార్గెట్​ రూ. 1458

బీఎస్​ఈ- బై రూ. 2230, స్టాప్​ లాస్​ రూ. 2150, టార్గెట్​ రూ. 2450

జేఎస్​డబ్ల్యూ ఎనర్జీ- బై రూ. 548, స్టాప్​ లాస్​ రూ. 530, టార్గెట్​ రూ. 580

పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​- బై రూ. 114, స్టాప్​ లాస్​ రూ. 109, టార్గెట్​ రూ. 119

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

ఎన్డీఆర్ ఆటో కాంపోనెంట్స్: రూ .1060 వద్ద కొనండి, టార్గెట్ రూ .1140, స్టాప్ లాస్ రూ .1020;

అనూప్ ఇంజినీరింగ్: రూ .2492 వద్ద కొనండి, టార్గెట్ రూ .2675, స్టాప్ లాస్ రూ .2400;

కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్: రూ .722 వద్ద కొనండి, లక్ష్యం రూ .777, స్టాప్ లాస్ రూ .700;

యథార్థ్ హాస్పిటల్ అండ్​ ట్రామా క్రె ఎస్ఆర్వీసీఎస్: రూ.781 వద్ద కొనండి, రూ.840 టార్గెట్, స్టాప్ లాస్ రూ.755;

ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్: రూ .642 వద్ద కొనండి, టార్గెట్ రూ .690, స్టాప్ లాస్ రూ .620.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం