గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 399 పాయింట్లు పెరిగి 82,172 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 136 పాయింట్లు వృద్ధిచెంది 25,181 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 174 పాయింట్లు పెరిగి 56,192 వద్దకు చేరింది.
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,308.16 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 864.36 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ అక్టోబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 672.24 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 10,089.18 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని స్వల్ప నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 35 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 25,250 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. షార్ట్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్‌గానే ఉంది. 25,250 దాటికే.. సూచీ 25,600 వరకు వెళ్లొచ్చు. 25,000 వద్ద కీలక సపోర్ట్ ఉంది,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.52శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.28శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.08 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఎటర్నల్ (జొమాటో)- బై రూ. 345.5, స్టాప్ లాస్ రూ. 333, టార్గెట్ రూ. 370
జేఎస్‌డబ్ల్యూ స్టీల్- బై రూ. 1175, స్టాప్ లాస్ రూ. 1133, టార్గెట్ రూ. 1260
కొఫోర్జ్- బై రూ. 1720, స్టాప్ లాస్ రూ. 1675, టార్గెట్ రూ. 1800
పతాంజలి ఫుడ్స్- బై రూ. 595, స్టాప్ లాస్ రూ. 580, టార్గెట్ రూ. 620
డీఎల్ఎఫ్- బై రూ. 729, స్టాప్ లాస్ రూ. 709, టార్గెట్ రూ. 759
డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్: రూ .506 వద్ద కొనండి, టార్గెట్ రూ .545, స్టాప్ లాస్ రూ .490;
ప్రెసిషన్ వైర్స్ ఇండియా: రూ .213 వద్ద కొనండి, టార్గెట్ రూ .230, స్టాప్ లాస్ రూ .206;
సుబ్రోస్: రూ .1164 వద్ద కొనండి, టార్గెట్ రూ .1250, స్టాప్ లాస్ రూ .1120;
బ్లాక్ బక్: రూ .679 వద్ద కొనండి, లక్ష్యం రూ .730, స్టాప్ లాస్ రూ .655;
హైటెక్ గేర్స్: రూ .814 వద్ద కొనండి, టార్గెట్ రూ .875, స్టాప్ లాస్ రూ .785.
సంబంధిత కథనం