Stocks to buy today : ఈ రూ. 45 స్టాక్​ కొంటే షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!-stocks to buy today march 1 2024 stock market senex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ఈ రూ. 45 స్టాక్​ కొంటే షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!

Stocks to buy today : ఈ రూ. 45 స్టాక్​ కొంటే షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!

Sharath Chitturi HT Telugu

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై లిస్ట్​..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ని స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 195 పాయింట్లు పెరిగి 72,500 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 32 పాయింట్ల లాభంతో 21,983 వద్ద ముగిసింది. ఇక 158 పాయింట్లు పెరిగిన బ్యాంక్​ నిఫ్టీ.. 46,121 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ 50 కీలకమైన 21,950 సపోర్ట్​ దగ్గర ఉంది. మార్కెట్​లో పాజిటివ్​గానే ఉన్నా.. 22,000 లెవల్స్​ దాటితేనే ఒక కన్ఫర్మేషన్​ లభిస్తుంది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

Stock market news today : గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3,568 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 230 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా మొదలుపెట్టే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల డౌన్​లో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగిశాయి. డౌ జోన్స్​ 0.12శాతం, నాస్​డాక్​ 0.9శాతం మేర పెరిగాయి.

స్టాక్స్​ టు బై..

Stocks to buy : మెక్​డోవెల్​-ఎన్​:- బై రూ. 1165.8, స్టాప్​ లాస్​ రూ. 132, టార్గెట్​ రూ. 1220

బర్జర్​ పెయింట్స్​:- బై రూ. 606.7, స్టాప్​ లాస్​ రూ. 586, టార్గెట్​ రూ. 628

ఎల్​ అండ్​ టీ ఎఫ్​హెచ్​:- బై రూ. 168, స్టాప్​ లాస్​ రూ. 163, టార్గెట్​ రూ. 175

శిల్పా మెడీకేర్​:- బై రూ. 420, స్టాప్​ లాస్​ రూ. 405, టార్గెట్​ రూ. 445

సుజ్లాన్​ ఎనర్జీ:- బై రూ. 45.25, స్టాప్​ లాస్​ రూ. 43, టార్గెట్​ రూ. 50

బోరోసిల్​ రెవెవెబుల్స్​:- బై రూ. 538, స్టాప్​ లాస్​ రూ. 520, టార్గెట్​ రూ. 570

Tata Elexi share price target : టాటా ఎలెక్సీ:- బై రూ. 7811, స్టాప్​ లాస్​ రూ. 7620, టార్గెట్​ రూ. 8200

రామ్​కృష్ణ ఫోర్జింగ్స్​:- బై రూ. 782- రూ. 784, స్టాప్​ లాస్​ రూ. 762, టార్గెట్​ రూ. 825

రికో ఆటో ఇండస్ట్రీస్​:- బై రూ. 103, స్టాప్​ లాస్​ రూ. 99, టార్గెట్​ రూ. 111

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)