గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 170 పాయింట్లు పడి 83,239 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 48 పాయింట్లు పతనమై 25,405 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 207 పాయింట్లు పడి 56,792 వద్దకు చేరింది.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1481.19 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,333.06 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఈ జులై నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 5012.95 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5140.82 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
గురువారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.77 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.83శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.62 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్గా కొనసాగుతున్నాయి.
సాక్సాఫ్ట్- బై రూ. 225.8, స్టాప్ లాస్ రూ. 220, టార్గెట్ రూ. 245
ఆటోమోటివ్ స్టాంపింగ్స్ అండ్ అసెంబ్లింగ్- బై రూ. 625.65, స్టాప్ లాస్ రూ. 600, టార్గెట్ రూ. 667
యాక్సిస్ బ్యాంక్- బై రూ. 1170, స్టాప్ లాస్ రూ. 1145, టార్గెట్ రూ. 1205
టాటా కెమికల్స్- బై రూ. 945, స్టాప్ లాస్ రూ. 915, టార్గెట్ రూ. 985
పంజాబ్ నేషనల్ బ్యాంక్- బై రూ. 113, స్టాప్ లాస్ రూ. 108, టార్గెట్ రూ. 119
హబ్టౌన్: రూ.273.90 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.295, స్టాప్ లాస్ రూ.264;
మ్యాన్ ఇండస్ట్రీస్ (ఇండియా): రూ.439.50 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.475, స్టాప్ లాస్ రూ.424;
ఓసీసీఎల్: రూ.126.7, టార్గెట్ రూ.137, స్టాప్ లాస్ రూ.122;
కృతి ఇండస్ట్రీస్ (ఇండియా): రూ.163 వద్ద కొనండి, టార్గెట్ రూ.176, స్టాప్ లాస్ రూ.157;
లేటెంట్ వ్యూ అనలిటిక్స్: రూ.446.7 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.482, స్టాప్ లాస్ రూ.430.
సంబంధిత కథనం