Stock market : ఈ రోజు స్టాక్​ మార్కెట్​లకు భారీ లాభాలు! ఈ స్టాక్స్​లో ట్రేడ్​తో ప్రాఫిట్​కి ఛాన్స్​..-stocks to buy today gift nifty and latest stock market updates 15th april 2025 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market : ఈ రోజు స్టాక్​ మార్కెట్​లకు భారీ లాభాలు! ఈ స్టాక్స్​లో ట్రేడ్​తో ప్రాఫిట్​కి ఛాన్స్​..

Stock market : ఈ రోజు స్టాక్​ మార్కెట్​లకు భారీ లాభాలు! ఈ స్టాక్స్​లో ట్రేడ్​తో ప్రాఫిట్​కి ఛాన్స్​..

Sharath Chitturi HT Telugu

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

అంబేడ్కర్​ జయంతి సందర్బంగా స్టాక్​ మార్కెట్​లకు సోమవారం సెలవు. ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1310 పాయింట్లు పెరిగి 75,157 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 429 పాయింట్లు వృద్ధిచెంది 22,828 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 762 పాయింట్లు పెరిగి 51,002 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2,519.03 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,759.27 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 400 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 22,500 ఎగువ ట్రేడ్​ అవుతున్నంత సేపు ట్రెండ్​ పాజిటివ్​గా ఉన్నట్టు. 23,000 దాటితే సూచీ 23,200 వరకు వెళ్లొచ్చు,” అని కొటాక్​ సెక్యూరిటీస్​ వీపీ- టెక్నికల్​ రీసెర్చ్​ అమోల్​ అథావలే తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.78 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.79శాతం పెరిగింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.64 శాతం వృద్ధిచెందింది.

కానీ అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ట్రంప్​ టారీఫ్​ భయాలు కొనసాగుతున్నాయి. ఆయన ఎప్పుడు ఎలాంటి ప్రకటన చేస్తారో అన్న విషయంపై అనిశ్చితి నెలకొంది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

రెయిన్​బో చిల్డ్రెన్స్​ మెడీకేర్​- బై రూ. 1530.85, స్టాప్​ లాస్​ రూ. 1455, టార్గెట్​ రూ. 1685

పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా- బై రూ. 304.10, స్టాప్​ లాస్​ రూ. 289, టార్గెట్​ రూ. 335

ఎం అండ్​ ఎం- బై రూ. 2580, స్టాప్​ లాస్​ రూ. 2530, టార్గెట్​ రూ. 2700

సీజీ పవర్​- ఇండస్ట్రియల్​ సొల్యూషన్స్​- బై రూ. 572, స్టాప్​ లాస్​ రూ. 562, టార్గెట్​ రూ. 605

చాలెట్​ హోటల్స్​- బై రూ. 819.80, స్టాప్​ లాస్​ రూ. 800, టార్గెట్​ రూ. 860

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

1.భారతీ హెక్సాకామ్ లిమిటెడ్: రూ.1,504 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ ధర రూ.1,625, స్టాప్ లాస్ రూ.1,440.

2.పూనావాలా ఫిన్కార్ప్ లిమిటెడ్: రూ.366.3 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ ధర రూ.400, స్టాప్ లాస్ రూ.350.

3. గ్లోబల్ హెల్త్ లిమిటెడ్: రూ.1,269.95 వద్ద కొనుగోలు, టార్గెట్ ధర రూ.1,370, స్టాప్ లాస్ రూ.1,210.

4.చోళమండలం ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్: రూ.1,780కు కొనుగోలు, టార్గెట్ ధర రూ.2,000, స్టాప్ లాస్ రూ.1,680.

5. గుజరాత్ గ్యాస్: రూ.425, టార్గెట్ ధర రూ.460, స్టాప్ లాస్ రూ.400.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం