దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 899 పాయింట్లు పెరిగి 76,348 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 283 పాయింట్లు పెరిగి 23,191 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 360 పాయింట్లు వృద్ధిచెంది 50,062 వద్దకు చేరింది.
“23,100-23,000 లెవల్స్ నిఫ్టీ50కి కీలక సపోర్ట్‌గా ఉంటాయి. 23,300-23,400 కీలక రెసిస్టెన్స్. 23,000 లెవల్స్ కన్నా దిగువకు పడితే సెంటిమెంట్ మారవచ్చు,” అని కొటాక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3239.14 కోట్లు విలువ చేసే షేర్లను కొనగోలు. అదే సమయంలో డీఐఐలు రూ. 3136.02 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
మార్చ్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 22,114.1 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 33,483.85 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.03 శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 0.22శాతం పతనమైంది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.33 శాతం పడింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ఆవాస్ ఫైనాన్షియర్- బై రూ. 1980, స్టాప్ లాస్ రూ. 1911, టార్గెట్ రూ. 2119
ఇప్కా ల్యాబ్స్- బై రూ. 1402, స్టాప్ లాస్ రూ. 1353, టార్గెట్ రూ. 1500
కాస్ట్రోల్ ఇండియా- బై రూ. 216, స్టాప్ లాస్ రూ. 207, టార్గెట్ రూ. 230
మారుతీ సుజుకీ- బై రూ. 11730, స్టాప్ లాస్ రూ. 11530, టార్గెట్ రూ. 12200
భారత్ డైనమిక్స్- బై రూ. 1247, స్టాప్ లాస్ రూ. 1215, టార్గెట్ రూ. 1320
వెల్స్పన్ కార్ప్ లిమిటెడ్: రూ.872.1 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ ధర రూ.930, స్టాప్ లాస్ రూ.840.
కావేరీ సీడ్ కంపెనీ లిమిటెడ్: రూ.1,249.2కు కొనుగోలు చేయండి, టార్గెట్ ధర రూ.1,320, స్టాప్ లాస్ రూ.1,200.
గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్: రూ.586.1, టార్గెట్ ధర రూ.620, స్టాప్ లాస్ రూ.565.
విమ్టా ల్యాబ్స్ లిమిటెడ్: రూ.1,123.45కు కొనుగోలు, టార్గెట్ ధర రూ.1,200, స్టాప్ లాస్ రూ.1,085.
గార్వేర్ టెక్నికల్ ఫైబర్స్ లిమిటెడ్: రూ.845.2కు కొనుగోలు చేయండి, టార్గెట్ ధర రూ.900, స్టాప్ లాస్ రూ.815.'
సంబంధిత కథనం